LOCAL WEATHER

11, సెప్టెంబర్ 2014, గురువారం

చేసిన పాపం ఎక్కడికి పొతుంది...???


పాపమా...చేశారా.... ఎవరూ... ఏమా కధ... ఏమున్నది ఆంధ్రప్రదేశ్‌లో గత పది ఏళ్ళుగా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు మన మీడియా వారు చేసిన పాపము... ఉద్యమాలు మొదలులో ఉన్నప్పుడు, ఆ ఉద్యమాలు ఊపందుకొటానికి మన మీడియాలు ఎంతో కృషి చేసినాయి... ఎక్కడైనా నలుగురు కూర్చొని కొద్దిగా అరచినా సరే, అక్కడికి పోయి వారిని లైవులో రాష్ట్రమంతా చూపించేసినాయి... మన మీడియాలు అన్నీ. ఇందులో పాపమేమున్నది....

దీనిలో పాపము ఏమీ లేదు... కానీ, తరవాతి కాలంలో ఆ ఉద్యమం కొద్దిగా పెరిగి, ఆ అవేశంలో ఉద్యమ ప్రాంత నాయకులు వాగే ప్రతీ వాగుడినీ నిర్మొహమాటంగా తమ మీడియాలో చూపించేసినాయి...వ్రాసేసినాయి... మచ్చుక్కి కొన్ని వ్రాయగలిగిన బూతులు...వాల్లు కోతులు, కుక్కలు, నక్కలు...[పై వారి దగ్గరున్నదే నది అయినట్లు...దిగువ వారిది గొయ్య అయినట్లు] మా నీళ్ళు దొబ్బేస్తున్నారు, వాళ్ళు దొంగలూ...దోచేస్తున్నారు...మెడకాయలు కోసేస్తాము....పండక్కి వెల్లిన వారు తిరిగి రారు...ఇలా ఒకటేమిటి అన్ని రకాల బూతుల్నీ వాళ్ళు ఉద్యమం ముసుగులో తిట్టేస్తుంటే... కనీస జ్ఞానం లేని మన మీడియా వారు, రాష్ట్ర ప్రజలందరికీ కనపడేట్లూ వినపడేట్లూ చేసేశారు... వాళ్ళ బూతుల వీడియోలు ఇప్పటికి యు ట్యూబ్ లో మూలుగుతున్నాయి.

తిట్టే వారు తిడుతున్నారు...వినేవారు వినలేరేమో అనే కనీసం జాలీ దయా చూపించకుండా...ఆ ఉద్యమ ప్రాంతములో మాత్రమే వినపడవలసిన మాటలని...ఉద్యమం లేని...తిట్టించుకునే ప్రాంతంలో కూడా చూపించేశారు... మిగిలిన ప్రాంతం ప్రజల అభిమానం దెబ్బతింటుంది, వారికి అవమానం జరుగుతోంది, వారి మనోభావాలు దెబ్బతింటాయీ అనే జ్ఞానం లేకుండా ప్రతీదీ తమ మీడియాలో లైవ్ టెలికాస్టు చేసి మరీ సీమాంధ్రులని తిట్టించారు.... 

అదే సమయంలో కనుక కొంత సంయమనం పాటించి...
ఆ తిట్లని ప్రసారం చెయ్యకుండా ఉండినట్లైతే...
ఆ తిట్టే వారికి ప్రోత్సాహం తగ్గి...
తాము మాట్లాదేది తప్పు అనే విజ్ఞత అయినా కలిగేది కదా... 
పోతే పోతారు మాదేం పొయ్యింది అనే చందాన 
ఈ దిక్కుమాలిన మీడియాలు
 ఉద్యమ ప్రాంతంలో ఏ ఇద్దరు కూర్చొని ఏ కాస్త గొడవ చేసి తిట్టినా 
దానిని యధావిధిగా ఏ మాత్రం సెన్సార్ చెయ్యకుండా ప్రసారం చేసి
 సీమాంధ్రుల ప్రజలని ఎంతగా అవమానించారో అంతగా 
ఆత్మా విశ్వాసాన్ని దెబ్బతీశాయి...
పైగా వీళ్ళకి "సీమాంధ్ర మీడియా అనే పేరు"...

ఈ మీడియాలు ఎంత ఏకపక్షంగా వ్యవహరించాయి అంటే.. పొద్దున్నే పెద్ద "మనుషుల పేరంటాలలో" కూడా వారు కూర్చొని మాట్లాడేప్పుడు, అవతల వారిని ఏ మాత్రం కంట్రోల్ చెయ్యకపోగా, తాము కూడా ఒక చెయ్య వేశారు... ఈ పాపాన్ని ఏ ఒకటో రెండో చానళ్ళే కాదు...అనేక మురికి చానళ్ళు చేసినాయి... అప్పుడే వీరి మీద సీమాంధ్రలో దాడి చెయ్యవలసిందే...కానీ, అది జరగలేదు. వాళ్ళ పాపాన వాళ్ళే పోతారులే అని ఊరుకున్నారు.

ఉద్యమం అయిపోయింది....ఇప్పుడు కూడా అదే ధోరణిని అలాగే కొనసాగించారు ఒళ్ళు తెలియని మన మీడియా వారు...ఇన్నాళ్ళూ వీళ్ళ కొమ్ము కాశాముకదా... మనం ఏమన్నా చెల్లుబాటు అవుతుంది అని అనుకుని...అక్కడి ప్రాంతం వాళ్ళ మీద కారు కూతలు కూశారు. తిట్టే వారికి తిట్టించుకోవాలని ఉంటుందా...?? వారికి మనోభావాలు దెబ్బతిన్నాయి... అంతే మీడియాల్లో ఒకటి రెండిటిని మూటగట్టేశారు...అసలు ఒకటి రెండు మినహాయిస్తే మిగిలిన అన్నిటికీ మూటగట్టించుకునే అర్హతని కలిగి ఉన్నాయి.... కానీ, పాపం కేవలం రెండు చానళ్ళకే ఆ పాపము పండింది...

ఈ విధంగా రెండు చానళ్ళకి పాపం పండినాక, 
మిగిలిన చానళ్ళకి జ్ఞానోభయం కలిగింది. 
అంతే, 
అక్కడి నుండీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తున్నాయే కానీ, 
తమ సోదర చానళ్ళు ఈ విధంగా మూతపడ్దాయి...
వాటిని తెరిపించటానికి అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాము...
ఇది మీడియాకే/ప్ప్రజ్జాసామ్యానికే గ్గొడ్డల్లి పెట్టు...
"ఆ రెండు చానళ్ళు వచ్చే వరకూ 
మన చానళ్ళని కూడా ఆ ప్రాంతంలో బంద్ చేద్దామూ" 
అని గొడవ చెయ్యలేదు... 
"అలా గొడవచేసి, అన్ని చానళ్ళని ఆ ప్రాంతంలో రానియ్యకపోతే,
అక్కడి కేబుల్ ఆపరేటర్లకి నెలవారీ డబ్బులని జనం కట్టేవారు కాదు...
అప్పుడు వారు దిగి వచ్చే అవకాశం ఉన్నది కదా"...
కానీ, అలా చెయ్యలేదు...
బుద్ధిగా వారి మీడియా వ్యాపారాన్ని వారు చేసుకుని పోతున్నారు... 
చేసిన పాపం ఊరికే పోతుందా...పోదు. 
అయితే, 
ఆ పాపం మొత్తం కేవలం రెండు చానళ్ళ మీదే పడటమే బాధాకరం...!!!  @@@@@@@@@@@@@@@@@
బొమ్మ గూగుల్ లోనిదే