LOCAL WEATHER

2, సెప్టెంబర్ 2015, బుధవారం

మూడు అమరావతి ఎక్స్‌ప్రెస్సుల కధ....

ఒకప్పుడు రైల్వేలో చాలా రైళ్ళు పేర్లు లేకుండానే నడిచేవి....తరవాత రోజుల్లో వాటికి రకరకాలైన పేర్లు పెట్టటం మొదలెట్టారు.... అప్పుడు వచ్చిన రైళ్లకు హౌరా మెయిల్, చెన్నై మెయిల్, సర్కార్ ఎక్స్‌ప్రెస్  అని ఉన్నాయి... 

క్రమంగా.....  

నదుల పేర్లతో...కృష్ణా, పినాకిని[పెన్నా], గోదావరి, గౌతమీ, గంగా-కావేరీ ఇలా అనేక  నదుల పేర్లతో రైళ్ళు వచ్చాయి....

కొండల పేర్లతో.. రత్నాచల్[అన్నవరం కొండ], కొండవీడు[గుంటూరు దగ్గర], గోల్కొండ... ఇలా కొండల పేర్లతో.... 

ప్రాంతాల పేర్లతో... ఫలక్ నుమా, చెన్నై మెయిల్, హౌరా మెయిల్, ముంబై  మెయిల్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్సు...

ఈ పేర్లు ఎంత ప్రాముఖ్యం వహించాయి అంటే....ఆ రైళ్ళు ఆయా పేర్లతోనే... అవి ఎక్కడి నుండి ఎక్కడికి వెళతాయో ప్రజలకి తెలిసేంత... 

అంతా బాగానే ఉన్నా... సమస్యల్లా ఒక్క పేరుతోనే.... 
అదే "అమరావతి ఎక్స్‌ప్రెస్" తో.....

మొదట్లో ఇది గుంటూరు నుండి హుబ్లికి మీటర్ గేజి ట్రైనుగా నడచేది....తరవాతి కాలంలో గేజి మార్పిడి వలన...దీనిని విజయవాడ వరకూ పెంచారు....అప్పటి నుండి వారానికి అయిదు రోజులు విజయవాడ నుండి హుబ్లికి, మిగిలిన రెండు రోజులు వాస్కోడ గామా[గోవా]కి నడిచేది.....

అయితే, రైల్వే రాజకీయాలు వలన, ఈ  ట్రైన్ ఇదే పేరుతొ... వారానికి నాలుగు రోజులు హౌరా నుండి వాస్కో[వయా విజయవాడ-గుంటూరు]నడవటం  మొదలు పెట్టింది.... దీని వలన ఇక్కడి ప్రజలకి అందుబాటులో లేదని గొడవలు చెయ్యటంతో....హౌరా అమరావతి ఎక్స్‌ప్రెస్‌ని అలాగే ఉంచి...విజయవాడ నుండి హుబ్లికి మూడు రోజులు నడిచే అమరావతి ఎక్స్‌ప్రెస్‌ని 7 రోజులు నడపటం మొదలెట్టారు.... అక్కడే ప్రజలకి కన్ఫ్యూజన్ మొదలైయ్యింది.... వారంలో నాలుగు రోజులు దరిదాపులు ఒకే సమయంలో రెండు అమరావతి ఎక్స్‌ప్రెస్సులు రావటంతో ... జనాలకి ఏది తాము రిజర్వు చేసుకున్న అమరావతి ఎక్స్‌ప్రెస్షో  తెలియకుండా  పోయింది.....

దీనికి తోడు మరొక సమస్య ఆన్ లైనులో వచ్చిపడింది.....ఆన్  లైనులో ఈ ట్రైనుకి టిక్కెట్టు బుక్ చేసుకుందా చూస్తే , ఇప్పటికే ఒకటికి రెండు అయినాయి అనుకుంటే...మరొక అమరావతి ఎక్స్‌ప్రెస్‌ కనపడటం జరిగింది....ఇది మహారాష్ట్రాలోని అమరావతి నుండి ముంబాయికి వెళుతుంది.....దీంతో కలపి అమరావతి ఎక్స్‌ప్రెస్సులు 3 అయినాయి..... విజయవాడ/గుంటూరు దగ్గర నుండి రెండు అమరావతులు ఒకేసారి ప్లాట్ ఫాం మీదకి వస్తుంటే...ఆన్ లైనులో ఒకే సారి మూడు అమరావతి ఎక్స్‌ప్రెస్సులు వస్తున్నాయి.... పాపం  ఈ రైళ్ళును ఉపయోగించే వారు ఏది ఎదో తెలియక ఒకదాని బదులు  ఒకటి రిజర్వేషన్ చేసుకుంటే... లేక ఎక్కితే... వారి గతి జనరల్  బోగీ పాలే....

కాబట్టి, ఇప్పటికీ  బ్రిటిష్ వారి రుల్సుతోనే నడుస్తూ .... భారత  ప్రజల మాటవినని ఓ ఘనత వహించిన రైల్వే వాళ్ళ లారా... ఈ ఎక్స్ ప్రెస్సు రైళ్ళ పేర్లు అన్నీ మార్చండి....ఈ మూడు రైళ్ళకి వేరే పేర్లు పెట్టి జనాలని కాపాడండి...మూడూ రైళ్ళకి అమరావతి పేరు ఎందుకు తిసెయ్యాలంటే....ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ప్రాంతానికి  "అమరావతి" అని నామకరణం చేశారు....రేపు ఈ పేరుతొ ఏ దిల్లికో రైలు వెయ్యాలిసి రావచ్చును.... అందుకని అమరావతి పేరును ఇప్పటికే ఉన్న మూడు రైళ్ళ కు తీసేస్తే... ప్రజలకి కన్ఫుజన్  లేకుండా  ఉంటుంది....


********

ఆన్ లైనులో ఇబ్బంది లేకుండా ఈ ట్రైను నంబర్లు చూసి బుక్ చేసుకోండి.....వాటి టైం టేబుల్ కోసం క్రింద ఉన్న రైళ్ళ నంబర్ల మీద నొక్కండి....

అమరావతి  ఎక్స్‌ప్రెస్‌ 1
విజయవాడ-హుబ్లి-విజయవాడ


అమరావతి  ఎక్స్‌ప్రెస్‌ 2
హౌరా-వాస్కో-హౌరా


అమరావతి  ఎక్స్‌ప్రెస్‌ 3
అమరావతి-ముంబై-అమరావతి



@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
ఇంకా ఇలాంటి రైళ్ళు  ఒకే పేరుతొ నడిచేవి ఉంటే 
తెలియజేయండి
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

టైం టేబుల్ కర్టేసి:http://indiarailinfo.com
మేపులు కర్టేసి : సహజంగానే గూగుల్ 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి