LOCAL WEATHER

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

రాజకీయ నాయకులు, గూండాలు, స్వామీజీలు దేశాన్ని కొల్లగొట్టేస్తున్నారు ష....!!!

కర్టేసి:ఆంద్ర జ్యోతి 

రాజకీయ నాయకులు, గూండాలు, స్వామీజీలు దేశాన్ని కొల్లగొట్టేస్తున్నారు షా.... మన మహాన్ కళాకారుడు గారు మోహన్‌బాబుగారి ఉవాచ...

నిజమే, ఈయనగారు చెప్పేస్తున్న నిజాలు నిఝంగా నిజమే... కానీ, ముక్కు సూటిగా మరియూ మొహమాటం లేకుండా మాట్లాడేస్తారని పేద్ద పేరున్న ఈ ఖళాకారుడు తమ రంగం గురించి ఎందుకు చెప్పలేదో...??? అదీ కూడా చెప్పేస్తే బాగుండేదేమో...

ఎందుకంటే ఈయనగారు చెప్పిన పెద్దమనుషులైన రాజకీయ, గూండా...స్వామీజీలలో కొందరు కేవలం వారియొక్క నిజస్వరూపాలైన ఒక్క రూపంతోనే ప్రజలని మోసం చేస్తున్నారు... కానీ, "ఈ మూడు రూపాలనీ తామే పోషిస్తున్న సినిమాలలోని కళాకారులుగా పేరెట్టుసుకొన్నా కళాకళలున్న ఖళాకారుల" సంగతేమిటీ...?? "ఖళాకారులు" ఎందుకంటే... నిజమైన కళాకారులులాగా ఏ సీన్‌నీ కంటిన్యూస్‌గా చెయ్యలేక  కట్‌చేసి ఖండ ఖండాలుగానే నటించగల వీరు కళాకారులు ఎలా అవుతారు...ఖళాకారులవుతారుగానీ.... 

రాజకీయ నాయకులని తిట్టిన ఈ ఖళాకారుడికి తమ పరిశ్రమ రాజకీయాలు తెలియవా....పైకి మాత్రం కళాకారులు లాగున్నా...ప్రజలకి సేవ మాట అటుంచి కనీసం తమ రంగానికి చెందిన వారికైనా సహాయసహకారాలు అందించారా...??? లేదు. బ్యాక్ గ్రౌండు లేని కళాకారులు నటించిన సినిమాల వలన లక్షలు కోట్లు గడించుకున్నా...ఆ తరవాత ఆ కళాకారులు రోడ్డున పడితే పట్టించుకునే దిక్కు లేదు... ఐరన్ లెగ్ శాస్త్రి గారు  సినిమాలలో ఎంతో మందిని నవ్వించినా...సినిమావారిలో మడుకు ఆయనని ఏడిపించిన వారే ఎక్కువ...కనీసం ఆయనకి ఇవ్వాలిసిన కొద్ది మొత్తం కూడా ఇవ్వకుండా..చివరికి ఆయన సినిమా జాడ్జ్యం వల్లనే చనిపొతే, సినిమాలలోని ఏ ప్రవక్తగారూ ఆయన కుటుంబాన్ని ఆదరించలేదు. ఇలాగే బోలెడు మంది కళాకారులు, వారి కుటుంబాలు అనాధలవుతున్నారు.  



ఈ సినిమా రాజకీయాల గురించి చెప్పాలంటే పాతకాలంలో హరనాధ్ దగ్గర నుండీ ఇప్పటికాలం ఉదయ్ కిరణ్ వరకూ ఒకే రకమైన కుళ్ళు వంశపారంపర్య మరియూ కుల రాజకీయలే నడుస్తున్నాయి... పాపం మన కమేడీయన్ బాబూమోహన్ గారు కళ్ళనీళ్ళెట్టేసుకొని...తమ సినిమా విడుదలకి అడ్డుపడుతున్నారని ఏడ్చేశారు... అలాగే దాసరి గారు... మొన్నీమధ్యన స్టార్ డైరెక్టరుగా పేరొందిన రాజమౌళీ గారు కూడా కుళ్ళు సినిమా రాజకీయాల వలన బలైపొయ్యే వారే... "కొందరు" టీవీ వారికి డబ్బులిచ్చి మరీ దుష్ ప్రచారం చేయించినప్పటికి, ఆయన సక్సెస్సే ఆయనను కాపాడింది... ఈ సినీ రాజకీయాలు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి.... తమిళంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజాగారు బలైపొయింది సినీ పరిశ్రమలో కుళ్ళిపోయిన రాజకీయాల వల్లనే...ఇక హిందీలో కూడా గానకోకిలగా  ఉన్న ఒక మహా గాయని, కొత్తగా వచ్చిన గాయనీ మణులను  బెదిరిస్తున్నారని... గాయని కవితా కృష్ణ మూర్తి ఒక ఇంటర్వ్యులో చెప్పారు...ఇలా చెప్పుకుంటూపోతే బోలెడు...ఈ సినీ రాజకీయాలకి ఏ సపోర్టూ లేని ఎంతమంది కళాకారులు బలైపొయ్యారో... మనకన్నా బాబుగారికే ఎక్కువ తెలుసు...ఎందుకంటే, ఒక సినిమా ఫంక్షన్లో గొంతెత్తి తమకి అన్యాయం జరుగుతోందని చిరంజీవి గారితో వాదనకి దిగింది ఈయనగారే....


ఇక సినిమా వాళ్ళ గూండాయిజం గురించి చెప్పాలంటే వేరెవరినో చెప్పాలిసినపనిలేదు... ఈ ఖళాకారుడిగారికే పేద్దపేరుంది... ఈ బాబుగారు ముక్కుసూటిగా, మొహమాటం లేకుండా ఉంటారుష...దానికి వ్యతిరేకంగా ఎవరున్నా సరే... వారిని బూతులతో కడిగిపారెయ్యటమే కాకుండా, చెయ్య చేసుకుంటారని కూడా సినీ పరిశ్రమలో అందరికీ తెలిసిందే... ఒక సీనియర్ నటి జయంతిగారిని... సాటి కళాకారిణి అని కూడా చూడకుండా కళ్ళనీళ్ళెట్టించిన ఘనత మోహన్బాబుగారిదే...తాను మొహమాటం లేకుండా ఉన్నప్పుడు... ఇతరులు కూడా అలాగే ఉంటే సహించే బుద్ధి జ్ఞానం ఉండాలి... కానీ ఈయనగారిలో అది కనపడదు. కాబట్టి... ఈయనది ముక్కుసూటీ తత్త్వం కాదు... అహంకారం, దౌర్జన్యం చేసే బుద్ధి మాత్రమే... ఇక వీరి వారసులు గురించి చెప్పనే అఖర్లేదు.. రోడ్డునపడి ఎంత యాగీ చేసి కేసులని నెత్తికి ఎత్తుకున్నారో అందరికీ తెలుసు...

ఇది చిన్ని ఉదాహరణ మాత్రమే...కర్టేసి"యు ట్యూబ్"

ఇకపోతే, సినిమా వాళ్ళు స్వామీజీల పాత్రని ఎంతగా పొషిస్తూ ఉన్నారంటే... వ్యక్తిగత పూజలూ... పాలాభిషేకాలు... గుడులెక్కి... వీరే దేవుడైనట్లు పాటలూ...అవి కూడా... ఇప్పటికే ఉన్న భక్తి పాటల ట్యూన్లో ఉండటంలాంటి విపరీత ధొరణులతో, యువతని తప్పుదోవ పట్టించే విధానం చూస్తే తెలుస్తుంది... ఇలా స్వామిజిలు చేస్తే... మోసం... వీరు చేస్తే అభిమానం'ట....కాకపోతే, అలా మూఢులైన ప్రజలకి పేరెట్టేశారు మన సినీ పెద్దలు... దాని పేరే "అభిమానులు...అదేనండీ ఫేన్సు ట".  ఈ ఫ్యాన్సు పేరు అడ్డెట్టుకొని సినీమా పెద్దలు చెయ్యని దురాగతం లేదు... వీరివల్లన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడినాయి...పడుతున్నాయి...అభిమానం పేరుతో అభిమానులని సమాజంలోని యువతని రెచ్చగొట్టి....ఎంత నాశనం చేశారో తెలిసిందే..."తప్పనిసరైతే" దొంగతం చెయ్యటం  ప్రేమ పేరుతో పెద్దలని ఎదిరించి పారెయ్యటం...ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించటం...లాంటివి  మన సినిమా ప్రవక్తలు చెప్పిన వేదాంతమే...

ఈ విషయానికొస్తే ఓ మాట చెప్పుకోవాలి...సినిమాల్లోని లవ్వు వ్యవహారాల్లో హీరోగారు ఎన్ని వెకిలి చేష్టలు చేసినా పరవాలేదు...హీరోయిన్ ఏమీ అనుకో కూడదు... హీరోయిన్‌కే తెలియదు పాపం తానూ హీరోని ప్రేమిస్తున్నానని... హీరోయిన్ తండ్రి అడ్డుపడితే, ఆయనకి ఫ్లాష్ బ్యాక్‌లో ఒక కధ కలిపి, ఆయనను విలన్ చేసిపారేస్తారు మన సినిమా పెద్దలు.... ఇదే కనుక  హీరోగారి చెల్లెళ్ళ విషయానికొస్తే మాత్రం, ఎవడు ఏమీ కామెంటు చెయ్యకపోయినా సరే...కనీసం ఒక చూపు వారి వంక చూస్తే చాలు...మన హీరోగారు... వారి డొక్క చింపి డోలు కట్టేస్తారు... పెళ్ళిళ్ళ విషయానికొస్తే  హీరోగారు ఎన్ని పెళ్ళిళ్ళు అయినా చేసుకోవచ్చును... వాటికి తగ్గ పరిస్థితులు కూడా అలాగే వచ్చేస్తాయి మరి...!!!  కానీ, హీరోగారి బావగారు తప్పనిసరిగా ఏకపత్నీవ్రతుడైయుండాలి...లేదా వాడికి కూడా ఏ విలనిజమో కట్టబెట్టేస్తారు...మన "సినిమా ప్రవక్తలు".  ఇక హీరోగారు దొంగతం చేస్తే అది కూడా హీరోయిజమే... అని మన సినిమా స్వామీజీలు తమ ప్రవచనంలో చెప్పియున్నారు...



ఈ విధంగా  మన సినిమా స్వామీజీలు/ప్రవక్తలు సృష్టించిన మహాకావ్యాల వల్లనే ఈ రోజున సమాజంలోని యువత తల్లిదండ్రులని ఎదిరించటం, ఆడపిల్లలని ఏడిపించటం...దొంగతనం చెయ్యటం కూడా ఒక హిరోయిజం క్రిందగా అనుకోవటం లాంటి దుష్‌ప్రభావాలు ఏర్పడినాయని, సందేహం లేకుండా చెప్పవచ్చును. తీరా అందరికీ ఇలా ప్రవచనాలు చెప్పిన స్వామీజీలకే ఈ పరిస్థితి వస్తే, తుపాకులతో బెదిరించెయ్యటం, కురదకపోతే గడ్దాలు పెంచేసుకుని టీవీలలో పడి ఒకటే ఏడుపు... సినీ ఫీళ్డు మన చేతిలో ఉన్నది కదా అని పరుగో పరుగు అని సినిమాలు తీసెయ్యటం....  మరి, వీరు తీసిన సినిమాల వలన బాధలు ఏర్పడ్డ ఆడపిల్లల తల్లిదండ్రులు వీరిలాంటివారు కాదా...?  కేవలం సినిమా వారికే ఇలా ఏడిచే సర్వ హక్కులనీ.... సర్కారు, సీడెడ్డు, నైజాం జిల్లాలు మరియూ శాటిలైట్‌లకి కలిపి  ... ఎవరైనా వ్రాసిచ్చారా...???  

సరే, ఇక దోచుకోవటం గురించి అయితే సినిమా కళాకారులు[కొందరు]తాము చేసే పావలా నటనకి కోట్ల రూపాయలని పుచ్చేసుకోవటం కళాపోషణ అవుతుందని వీరికి వీరే అనేసుకుంటున్నారా...?? ఎందుకంటే, రెండున్నర గంటల నిడివిగల ఒక సినిమాలో హీరో, హీరోయిన్లు కనపడేది...కేవలం అరగంటే...దానికే వీరు లక్షలు, కోట్లు డిమాండు చేస్తున్నారు...మరి మిగిలిన రెండుగంటల సినిమాని పొషించిన కళాకారుల మాటేమిటీ, వారికి  కూడా డబ్బులు ఇస్తున్నరని అనేకన్నా విదిలిస్తున్నారు అని అనటమే సమంజసం. ఒకవేళ రెండున్నర గంటలు పాటు వీరు కనపడినా దానికి లక్షలు...కోట్లు పుచ్చేసుకోవాలా....? ఇలా హీరోలు కోట్లు కొట్టేయ్యటంతో... సినిమాలని కళా దృష్టి ఉన్న ఏ మాములు కళాపోషకుడు తియ్యలేని పరిస్థితి వచ్చింది. దీంతో సమాజాన్ని చెడగొట్టే వ్యాపార దృష్టిగల "దిష్టి" సినిమాలే వస్తున్నాయి...దీనికి గల కారణం మన మహా సినిమా ప్రవక్తల దోపిడినే కదా... 

సామాన్యుడికి సామాన్య వినోదంగా ఉండే సినిమాలు.... సినిమా హాళ్ళని కూడా ఈ సినిమా ప్రవక్తలే చేతిలో ఉంచుకోవటంతో  వాటి ధరలు కొండెక్కి కూచున్నాయి. ఒక కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే పర్సు ఖాళీ అవ్వవలసిందే...  కాబట్టీ, ఇలా ఏ విధంగా చూసినా సమాజానికి ఇసుమంతైనా ఉపయోగపడని వీరు, కళాకారులని పేరెట్టేసుకుని... వీరే ఏదో సమాజాన్ని ఉద్దరించేట్లుగా మాట్లాడటం.... వారి నటనకి బాగుంటుందేమో కానీ, నిజ జీవితానికైతే ఏ మాత్రం నప్పదు!!! 




@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@
@@@@@@@@@@



ఇందులోనివి గూగుల్ బొమ్మలే 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి