LOCAL WEATHER

25, డిసెంబర్ 2013, బుధవారం

సీతను వెదక... "రావణుని సహాయమడిగె"...కేజ్రీవాల్‌గారు....

one of the seven sins:
politics without principles
- గాంధి గారి యాంగ్ ఇండియాలో నుండి 

ఇదేదో సమస్యాపూరణం అనుకునేరు... కానే కాదు. కేవలం సమస్యలపై'రణం మాత్రమే... మన సమస్య కాదనుకోండీ... ఢిల్లీ వాసుల సమస్య పైన...

సీతను వెదికే క్రమంలో రాములవారు సుగ్రీవుడి సహాయం  తీసుకుంటారు. సుగ్రీవుని స్నేహం కోసం,  అతని అన్న వాలిని హతమారుస్తాడు రాముడు. అప్పుడు సుగ్రీవుడు తనవారి సహాయంతో సీతని వెదకటానికి ఒక్కోదిక్కుకీ కోందరిని పంపించి... చివరకి, హనుమంతుడు సహాయంతో సీత ఎక్కుడున్నదో కనుక్కుని, ఆవిడ కష్టాలు తీరటానికి సహాయపడతాడు.... ఈ కధంతా రామాయణంలో ఓ చిన్న భాగం. ఇందులో వెతికించేది సుగ్రీవుడైనా...పేరు హనుమంతులవారికే ఎక్కువ వచ్చింది... అయినా, ఇదొక విషయంగానైనా కూడా సుగ్రీవుడు గుర్తించనేలేదు...

కానీ, ధిల్లీ కధలో మన సుగ్రీవుణ్ణి సీత కష్టాలని తీర్చటానికి సహాయం అడిగితే... ఎవరు సహాయం ఎంతెంత చేస్తారో...వారేమి డిమాండు చేస్తారో...వారే ఈ క్రెడిట్టు అంతా కొట్టేస్తారేమోనన్న భయంతో... ఎవరో ఎందుకు డైరెక్టుగా రావణుని సహాయంపొందెస్తే పోలా అని.... తెలివిగా అనుకుని... రావణుని సహాయం పొందటానికి ముందడిగేశాడు... మనం సుగ్రీవుడనబడే కేజ్రీవాల్ గారు...!!! 

ఈ విషయంలో రాజకీయాలకి కొత్త అయిన ఆయన, తెలివితక్కువగా నిర్ణయం తీసుకున్నారని, చాలా మంది అనుకుంటున్నారు కానీ....కేజ్రీవాల్‌గారు రాజకియాలకి కొత్తేమోగానీ...అది తనకి కాదనీ...ఉన్న రాజకీయాలకే తనవంటివారు కొత్తని నిరూపించారు...ఇప్పటిదాకా జరుగుతున్న రాజకీయాలు తెల్లబోయేట్లుగా....  

శత్రువుకి శత్రువు మిత్రుడనీ, అలాంటివారందరూ కూడా కలిపి మిత్రులనీ శతాబ్దాలుగా అందరూ... ఇప్పటిదాకా భారత రాజకీయ వ్యవస్త నమ్ముతోంది.... రామాయణంలో వాలి తాను చనిపొయ్యేప్పుడు రాముని అడుగుతాడు..."అయ్యో నీకు సీతని వెదకటానికి సహాయం కావాలంటే అసమర్ధ సుగ్రీవుడే కావలిసి వచ్చాడా...నేను ఆ రావణునికన్నా బలవంతుడను...పైగా ఆ రావణుడు నాకు మిత్రుడు కూడా...నేను చెపితే వింటాడు కూడా" అని వాపోతాడు.... అప్పుడు రాముడు చెపుతాడు... "వాలీ... ఇది జరిగే పనే అయినప్పటికీ నీవు నాకు శత్రువువి... ఎందుకంటే...నాకు శత్రువైన రావణుడు నీకు మిత్రుడు కాబట్టి... నువ్వు నాకు శత్రువువి కాబట్టి... నీకు శతృవైన శుగ్రీవుడు నాకు మిత్రుడవుతాడు అసమర్ధుడైనప్పటికీ".... ఈ విధంగా వాలి సందేహం తీరుస్తారు రాములవారు.

ఇక కొత్త రాజకీయంలోనికి వస్తే, ఢిల్లీలో తమకి శత్రువైన కాంగ్రెస్సుని మట్టి కరిపించారు...ఆంఆద్మీ పార్టీ మరియూ బీజేపే పార్టీలు. అప్పుడు స్నేహ హస్తం చాచిన బీజేపీతో చెలిమి చేసి ప్రభుత్వ ఏర్పాటుని చెయ్యవచ్చును... సామాన్యంగా ఆ పొజిషన్‌లో ఏ పార్టీ ఉన్నప్పటికీ అదే చేసేవారు....బీజేపీని మతతత్త్వపార్టీ అన్నప్పటికీ... కానీ, ఇక్కడ ఉన్నది "రాజకీయాలకే కొత్త" అయిన కేజ్రివాల్ గారు.... ఇలా అనుకునే కాంగ్రెస్సు కూడా స్నేహ హస్తం ఇచ్చింది... తాము ఇదివరలో ఇతరులని ముంచినట్లుగా ఈ కొత్త పార్టీని కూడా ముంచేద్దామనే.... 

అయితే కెజ్రీవాల్ గారు ఇంకోలా ఆలోచించారు... తమకు శత్రువైన కాంగ్రెస్సుకి బలం తగ్గిపొయింది అనే దానికన్నా... తమ శత్రువుకి శత్రువుగా ఉన్న బీజేపేకి బలం పెరిగింది...అన్న విషయాన్నే ప్రాధాన్యతలోనికి తీసుకున్నారు మన ఆం ఆద్మి పార్టీ నేత. ఎలాగూ బలహీనపడిపోయిన శత్రువుతో ఇక భయం లేదు. అదే సమయంలో శత్రువు కన్నా బలంగా ఉన్న, మిత్రుడు కాని మిత్రుడుతో కలిసి పరిపాలన చేస్తే... ఆ వచ్చే మంచి పేరంతా ఆ పార్టీకే పోతుంది కదా.... "బలమైన మిత్రుడికన్నా, బలహీనమైన శత్రువు మేలన్న కొత్త రాజకీయానికి" తెర లేపారు... రాజకీయాలకే కొత్త అయిన కేజ్రీవాల్ గారు. 

మరి అంతా బాగున్నది అని అనుకుంటున్నా... కేజ్రీవాల్ గారు సిత ఎక్కడున్నదీ ఎలా కనిపడతారు? కష్టాలని ఎలా తీరుస్తారు...?? ఎందుకంటే, ఆవిడని ఎత్తుకొచ్చిన రావణుడే ఎక్కడున్నదీ...ఎలా ఎత్తుకొచ్చిందీ, ఎన్ని కష్టాలు పెట్టినదీ చెప్పడు కదా...ఎంత స్నేహం చేస్తున్నప్పటికీ... సరే, ఈ కొత్త సుగ్రీవుల వారు ఎలగొలా కనిపెటినప్పటికీ... దిల్లి వాసుల  కష్టాలకి కారణమైన రావణుని ఎలా శిక్షిస్తారు...ఈ క్రమంలో రాముడికి[కాంగ్రేస్సుకి వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రజలకి]ఏమి సమాధానం చెపుతారు...  ఎంత "రావణుని సహాయమే తీసుకొమ్మని ఎస్స్.ఎమ్మ్.ఎస్స్ సలహాలు ప్రజల నుండీ వచ్చినట్లుగా కొత్త రాజకీయం నడిపినప్పటికీ"...ఈ కొత్త సుగ్రీవునికి కత్తి మీద సామే..... 

మొదటి ఎన్నికలలోనే కొత్త రికార్డులు నెలకొల్పి... కొత్త రాజకియ నాటకానికి తెరలేపిన  కొత్త పార్టీ కనుక కాంగ్రెస్సుని కట్టడి చెయ్యగలిగితే, దిల్లి వాసుల కష్టాలు తీరినట్లే... అప్పుడే కేజ్రివాల్ గారు నిజమైన సరికొత్త రికార్డుని నెలకొల్పినట్లవుతుంది......లేకపొతే ఏమున్నది...మళ్ళీ పాత రికార్డే[చరిత్రే]...కాంగ్రెస్సు కబళించిన మరొపార్టీగా ఆం ఆద్మీ పార్టీ చరిత్రలో కలిసిపోతుంది. 

MAN IS BY NATURE A POLITICAL ANIMAL - ARISTOTLE

ఏదిఏమైనా, మొదటి రాజకీయమే... తమ పార్టీ ఎదుగుదలకోసం ఇంత భీభత్సంగా నడిపి, అవినీతి పార్టీ అని తామే అన్న పార్టీతోనే జతకడితే... ఈ కొత్త పార్టీ "ఆంఆద్మీ పార్టీ ఎలా అవుతుందీ...అమ్యామ్య పార్టీ అవుతుందిగానీ"... అదికాక, కాంగ్రెస్సుతో రాజకీయాలంటే మాటలా...కాంగ్రెస్సుని తక్కువగా అంచనా వేసి, అది నిజంగా బలహీనపడింది అనిగానీ KEJRIVALగారు అనుకుంటే... ఆయన CRAZY WAIL గా మిగిలిపోవలసి  వస్తుంది.... 


ఇందులోని పాత్రలూ పాత్రధారులు షుమారుగా...

కొత్త సుగ్రీవుడు--- కేజ్రివాల్ గారు ... 
రాముడు---------  రావణునికి వ్యతిరేకంగా ఓటు వేసిన దిల్లి ప్రజలు... 
సీత---------------  రావణుని వలన కష్టాలు పాలైన దిల్లి ప్రజలు....         
కొత్త సుగ్రీవుడుచే రావణాసురుడుగా చెప్పబడిన పార్టి--  కాంగ్రెస్సు....
వాలి లేక ఆంజనేయుడా  అని[కేజ్రివాల్ గారి రాజకీయం వలన] చెప్పలేని పార్టీ--- బిజెపి ....

@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@


ఇందులోని బొమ్మ...దానితోబాటు ఉన్న కొటేషన్స్ గూగుల్ వారివే