23-11-2013న ACCUWEATHER.COMలో పేరు పెట్టక ముందే ఉంచిన లెహర్ తుఫాను ఊహా చిత్రం.
మరొక సైట్ gdacs.org లో పెట్టిన లెహర్ తుఫాను ఊహా చిత్రం
లెహర్ పుట్టిన దగ్గర నుండి ఇప్పటి దాకా
[FROM 23-11-2013 సాయంత్రం 4.25 నుండి 27-11-2013 ఉదయం 6.25 వరకు]
accuweather.com వారు పెట్టిన సేటిలైట్ చిత్రాలని Gif చేసి పెట్టాను. ఈ క్రింద చూడండి.
ఇది ఊహా చిత్రం కాదు...
23 సాయంత్రం 4.25నుండి ఈ రోజు ఉదయం 6.25 వరకూ గంట గంటకి
సేటిలైట్ తీసిన ఫోటోల సమాహారం
skymetweather.com లో ఇచ్చిన వాతారావరణ హెచ్చరికను
ఈ లింకు నొక్కి
చూడండి.
వీరి ప్రకారం
ఇవ్వాళా రేపట్లో
కాకినాడా-విశాఖపట్టణం మధ్య
లెహర్ తుఫాను
దాటే అవకాశం ఉన్నది.
వీరు చెప్పినట్లే ఈ లెహర్ తుఫాను అదే స్పీడులో తగిలితే
చాలా నష్టం జరిగే అవకాశం ఉన్నది.
ఈ సందర్భంలో కేవలం కాకినాడ ప్రాంతమే కాకుండా,
నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే...ఇప్పటిదాకా పైన ఉన్న ఊహాచిత్రాల ప్రకారమే లెహర్ తుఫాను నడిచినా....
తీరం దగ్గరపడేప్పటికి అది సరిగ్గా ఎక్కడ ఎక్కుతుందో చెప్పటం కష్టం....
ప్రకృతి విపత్తులు వస్తున్నప్పుడు...
ఎక్కువ నష్టం కలగకూడదని దేవుణ్ణి ప్రార్ధించటంతో పాటు
సంయమనంతో వ్యవహరించి, అధికారులకి సహకరిస్తే
ప్రాణనష్టాన్నైనా తగ్గించే అవకాశం ఉన్నది.
@@@@@@@@@@@@
27-11-2013 సాయంత్రం 5 గంటలు
ఈ లెహర్ తుఫాను అండమాన్ మీదుగా దాటినప్పుడే తన దిశ మార్చుకున్నట్లుగా కనపడుతోంది.
ఇది మొన్న 25 రాత్రి నుండే కనపడినప్పటికి, ఇవాళ మధ్యాన్నం వరకు ఏ శాఖవారు గుర్తించలేదు.
ఇది అక్కడి వరకు NORTH-WESTగా ప్రయాణించినా, అండమాన్ దాటినా తరవాత కేవలం WEST వైపునకే ప్రయాణం మొదలు పెట్టినది.
బహుశా
ఇది చెన్నయి-నెల్లూరు వైపుకి
బయలుదేరినట్లు కనపడుతోంది.
25వ తారీకు రాత్రి 9.25 నుండి 27వ తారీకు సాయంత్రం 4.25 వరకు
మోన్న రాత్రి నుండి ఇప్పటి వరకు WEST దిక్కుగా లేహర్ తుఫాను కదలిక.....
@@@@@@@@@@@@
27-11-2013 రాత్రి 11 గంటలు
లెహర్ తుఫాను మధ్యాహ్నం 3 గంటలు వరకు WEST కు ప్రయాణం చేసి
తరవాత NORTH దిక్కుకి కదలటం మొదలెట్టింది.
ఈ క్రమంలో తుఫాను యొక్క శక్తి తగ్గినా, తిరిగి కొంత పుంజుకొని
NORTH మరియూ NORTH-WEST కు ప్రయాణిస్తూ
కాకినాడకి, మచిలీపట్టణానికి మధ్య ఉన్న
కోనసీమ నర్సాపురం-అమలాపురం
వద్ద దగ్గర తీరం దాటే అవకాశం ఉన్నది.
ఈ రోజు మధ్యాహ్నం 2.25 నుండి రాత్రి 10.25 వరకు తుఫాను కదలికలు...
తుఫాను NORTH-WEST దిక్కుగా కదలటం చూడవచ్చును.
@@@@@@@@@@@@
28-11-2013 ఉదయం 7 గంటలు
మునిగిపోయిన లేహర్ తుఫాను
తీరాన్ని ఎక్కక ముందే బలహినపడిపోయింది.
మచిలీపట్టణం వద్ద సముద్రంలోనే బలహిన-పడిపోయింది.
దీనివలన తుఫాను ప్రమాదం లేకపోయినప్పటికీ
భారి వర్షాలు పడతాయని అంటున్నారు.
అయితే, దీని పరిస్థితి చూస్తే ఆమాత్రం కూడా జరిగే అవకాశం కనపడటం లేదు.
ఈ విధంగా
నూటొక్క గంటల
లెహర్ తుఫాను ప్రయాణ గాధ విషాదాంతంగా మునిగిపోయినా
కోస్తా ప్రజల కధ సుఖాంతం అయ్యింది.
నిన్న రాత్రి 9.25 ఈ రోజు ఉదయం 6.25 వరకు తుఫాను కదలికలు...
బలహీనపడిన తుఫాను మచిలీపట్టణం-నర్సాపురం దగ్గర తీరాన్ని దాటే దృశ్యం
@@@@@@@@@@@@
కొసమెరుపు ఏమంటే, ఈ తుఫాను తీవ్రంగా వస్తున్నప్పుడు
రకరకాలైన భయంకరమైన ముజిక్కులు పెట్టి భయపెట్టిన మన మీడియావారు,
ఈ తుఫాను బలహినపడగానే మతిమరుపు నటించి,
యధావిధిగా దిక్కుమాలిన విభజన పురాణాన్ని మాత్రమే
ప్రజల నెత్తిన రుద్దారు.
మనం తుఫాను గురించి ప్రజలని భయపెట్టాము,
తిరిగి మనమే ఆ భయాన్ని తొలగించాలి అన్న
కనీస సామాజిక బాధ్యతని మరచారు.
@@@@@@@@@@@@
మునిగిపోయిన లేహర్ తుఫాను
@@@@@@@@@@@@
కర్టేసి: accuweather.com.......gdacs.org ......skymetweather.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి