LOCAL WEATHER

21, జులై 2012, శనివారం

టీవీ 18/2 ఓవరాక్ష[స]న్ టీవీ



మన తెలుగు టీవీ 18/2 తనకు నీతీ, మానవీయత లేదని మరోసారి నిరూపించుకొన్నది. రాజేష్ ఖన్నా చనిపోయి ఒకరోజు గడవక ముందరే ఆయన మీద విషం చిమ్మింది. చనిపోయిన రాజేష్ ఖన్నా మీదకంటే బ్రతికున్న బిగ్ బీ మీద సింపతీ వచ్చేటట్లు నిన్న రాత్రి ప్రసారం చేసింది.


ఇంతకీ రాజేష్ ఖన్నాకీ బిగ్ బీ మీద అసూయ అనేది దిక్కుమాలిన కధాంశం.....వారు చెప్పినవి అన్నీ కల్పిత గాలి కధనాలేగానీ...ఒక్కటీ అధారితం ఉన్నవి కాదూ...ఎవరూ చూసినవి కాదు. సినిమా వాళ్ళు తమ ప్రచారానికి అనేకం చేస్తూ ఉంటారు......వాటిని పట్టుకొని వారు ఎవరైనా చనిపోయినప్పుడు ప్రసారం చేయ్యటం ఏమాత్రం నీతి.   ఇద్దరూ మహానటులే సందేహం లేదు.   కానీ పోల్చాలిసిన సమయం ఇదా...?

టీవీ 18/2 కీ సాక్షీ టీవీకీ పడదు.....ఏబీఎన్న్తో కూడా పడదు...ఒకే ఫీల్డులో ఉండటం వలన కొన్ని స్పర్ధలు ఉండచ్చు......కానీ రేపు దిక్కుమాలిన టీవీకి సంబంధిచిన వారు పోయినప్పుడు....వీరికి అసూయ ద్వేషం అని ప్రసారం చెయ్యటం ఎంతవరకూ సమంజసం...?

ఇదంతా రాక్షస టీవీ 18/2 మనసు మార్చటానికి కాదు....వారికి ఇపుడున్న పరిస్థితులలో బుద్ధి వస్తుందనికూడా నేను అనుకోవటం లేదు. మొన్నటిదాకా శబరిమల మీదపడి ఏడ్చారు.... తిరుమల మీద పడి ఏడుస్తూనే ఉన్నారు ..... ఇవేకాకుండా ఏదో డిఫరెంటుగా చెయ్యాలనో లేక చనిపోయిన వారిమీద కూడా పైసలు ఏరుకొనే పరిస్థితిలో ఉన్నారో అర్ధం కావటం లేదు. అసలు నా అనుమానం.. టివీ 18/2 వారికి మన దేశం సంస్కృతి అన్నా ఇక్కడి పద్ధతులన్నా ద్వేషం అసుయేమోనని...!!!