LOCAL WEATHER

25, జులై 2012, బుధవారం

సి పి ఐ పార్టీ కార్యాలయంలో సి పి ఎం జెండా ఎగరవెయ్యనిస్తారా నారాయాణగారూ....???

సమాజంలో శాంతి భద్రతలు సరిగా ఉండాలంటే ప్రజలందరూ సంయమనం పాటించవలసిందే.....అందులో కొందరికి పరిమితులంటూ లేకుండా ఉంటాయా....?? ఎవరి పరిమితులలో వారు ఉంటేనే సమాజంలో ఉద్రిక్తతలు పెరగకుండా ఉంటాయి....ఎదో పేద్ద నాయకుడనుకొనే నారయణగారికి ఇంత చిన్న విషయం తెలియదా.....? లేక ఒకరి మీద ఒకరిని ఎగదోసి,   చలి కాచుకుందమని అనుకుంటున్నారా....?? నాయకులనబడే వారికి కూడా సంయమనం లేకపోతే ఎలా....???

నిన్న తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నది అన్న విషయం మీద కామెంటు చేస్తూ...... సి పి నారాయణగారు........... "చేస్తే తప్పేమున్నది...మన దేశం సెక్యులర్ కంట్రీ కదా" అని ప్రజలను విభజించి రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు.....అదేమీ తప్పులేదని కూడా నొక్కి చెప్పారు.....మరి రేపు "ఈయన మాట పట్టుకొని హిందువులూ, ముస్లీంస్ వెళ్ళి చర్చిల్లో తమ మత ప్రచారం చేస్తే" నారాయణగారు సమర్ధిస్తారా......? అప్పుడు జరిగే గొడవలకి ఈయనగారు బాధ్యత వహిస్తారా......?? నారాయణగారి మాటలు వింటుంటే ఎలా ఉన్నదంటే "ఇల్లు చక్కబెట్టుకోవటం చాతకాని వారు ఊరుమీద పడ్డారు" అన్నట్లున్నది. బాబూ నారాయణగారు ముందర మీ రెండు కమ్యునిస్టు పార్టీల మధ్య సామరస్యం వచ్చేట్లు చేసుకొని తరవాత సామరస్యం గురించి అయిన మాట్లాడితే బాగుంటుందేమో.......!!!!

అసలు, ఈయన కార్యాలయంలో సి పి ఎం నాయకులు రాఘవులు గారు ప్రవేశించి వీరి కార్యకర్తలను సి పి ఎం లోనికి రమ్మని ఆహ్వానిస్తే ఊరుకుంటారా.....??? సామరస్యంగా ఆహ్వానించి మాట్లాడతారా....?? సి పి పార్టీ కార్యాలయంలో సి పి ఎం జెండ ఎగరవెయ్యనిస్తారా ....??? రెండూ కమ్యునిస్టు పార్టీలేకద.......?? రెండూ ప్రజలకోసమే పనిచేసేవేగా.....?? వీళ్ళా ఊరుకొనేది....వీరి మధ్య ఎన్నో గొడవలని మా విజయవాడ నగరం భరించిందో విజయవాడ జనానికి తెలుసు. రాష్ట్ర, దేశ వ్యాప్తంగా కూడా ఇందుకోసం ఎన్ని గొడవలూ, హత్యలూ చేశారో మరిచిపోయారా .....? పైగా మొన్నీమధ్య ఒక కేరళ కమ్యూనిస్టు పెద్ద శలవిచ్చిన దాని ప్రకారం...వీరి పార్టీలలో హత్యలు లాంటివి చాలా సాధారణ విషయమట. కేవలం మొన్నీ మధ్య పుట్టిన సిద్ధాంతం కోసం, పార్టీ కోసం రాద్ధంతం చేస్తున్న వీళ్ళా లౌకికతత్వం, సామరస్యం మరియూ మతాల గురించి మాట్లాడేది......???

అయ్యా లౌకిక తత్వం పెద్దమనిషి గారూ.... కాస్త మీరు మాట్లాడేప్పుడు, కొద్దిగా.... "ఉన్నంతవరకూ" బుద్దిని ఉపయోగించండీ.
......!!! నాయకులనే వారు, ప్రజలందరి మనోభావాలనూ గౌరవిస్తూ ఉండి, ప్రజల మధ్య గొడవలు వచ్చినప్పుడూ.....ఒకరి విషయంలో మరొకరు అనవసరంగా జోక్యం చేసుకొంటున్నప్పుడు.... వారినీ, వారి ఆలోచనలనీ సరైన దారిలో పెట్టాలేగానీ.....మరింత చెడుచెయ్య కూడదు..... అసలు ఈయనగారి బాధల్లా ఏమిటంటే......ఎలాగైనా హిందువుల ఓట్లు తీసుకుందామా అంటే అవికాస్త కులానికొక పార్టీగా విడిపోయి ఉన్నాయి. అందుకనీ, హిందువులను విమర్శించి ఇతరుల మనస్సు గెలవాలని............కానీ, ఇతరులు మటుకు ఇలాంటి వీరిని ఎలా నమ్ముతారు? రేపు రాజకీయ నాయకుల వంకర నాలిక ఎటుతిరుగుతుందో ఎవరికి తెలుసు....??? కాబట్టి, ఇటువంటి విషయాలలో తలదూర్చి తలతిక్కగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే ఇప్పుడొచ్చే అయిదో లేక ఏడో శాతం ఓట్లు కూడా పొయ్యే పరిస్తితి వస్తుందని నారాయణగారు తెలుసుకుంటే మంచిది.

జై హింద్