LOCAL WEATHER

2, సెప్టెంబర్ 2012, ఆదివారం

కోటప్పకొండ



ఆంధ్రప్రదేశ్లో పర్యాటక శాఖ అంటే నాలుగు బస్సులూ ఉండి .....వాటిని అందరికీ తెలిసిన నాలుగు చోటలా తిప్పేసి హమ్మయ్య అనుకునేదే....మరి మిగిలిన చూడ తగ్గ ప్రదేశాల మాటేమిటి...? అసలు మన రాష్ట్రంలో లెనే లేవా.....???

ఎందుకు లేవు బోలెడు ఉన్నాయి...విజయవాడ, గుంటురు, చిలకలూరిపేట, నర్సారావుపేట లాంటీ పట్టణాలకి చేరువలో ఉండి అహ్లాదకరమైన వాతావరణంతో ఉన్న కోటప్పకొండే దీనికి ఉదాహరణ. విచిత్రం ఏమంటే అక్కడెక్కడో ఉన్న కర్నాటకా, తమిళ్నాడు పర్యాటక ప్రదేశలగురించి తెలిసిన మన రాష్ట్ర జనాలకి ఇలాంటి లోకల్ ప్రదేశాల గురించి తెలియదంటే.... తప్పు ప్రజల కన్నా పర్యాటక శాఖదే అవుతుంది. అవును, వీరికి నచ్చిన నాలుగు ప్రదేశాలను ఎంచుకొని అక్కడ అన్ని సౌకర్యాలకీ మామూలుకన్న ఫదిరెట్లు డబ్బులు వసూలు చేస్తూ అదే పర్యాటక అభివృద్ధి అనీ, మిగిలిన ప్రదేశాలని అటక ఎక్కించిన శాఖ......ఇంతకన్నా ఏమి చెయ్యగలదు.....ఇలాంటివాటి గురించి రాష్ట్రం నలుమూలలా....కనీసం సమీప పట్టణాలలో కూడా సరైన ప్రచారం లేక చాలామందికి తెలియటంలేదు.


సరే, ఈ పర్య+అటక శాఖ గురించి ఎందుకు లెండి...... కోటప్పకొండకు వెళ్ళాలంటే, బాగా బస్సు సర్వీసులు అందుబాటులో ఉండే చిలకలూరిపేట కానీ, నర్సారావుపేట కానీ చేరుకోవాలి. అక్కడ నుండీ కోటప్పకొండకు జీపుల్లో కానీ, ఆటోల్లో కానీ వెళ్ళ వచ్చును. రెండు ఊళ్ళూ విజయవాడ నుండి కనీసం 80 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి. కోటప్పకొండ నర్సారావుపేట నుండి 13 కిలోమీటర్లూ, చిలకలూరిపేట నుంది 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దూరంలో కనీసం నాలుగైదు కిలోమీటర్లు కొండదారి ఉన్నది....దీనిని ఎంటీఆర్ కాలంలో వేశారని అక్కడివారు చెప్పారు. దీని పైకి వెళ్ళటానికి మెట్ల దారికూడా ఉన్నది.



ఎక్కువగా ఇక్కడికి కార్తీకమాసంలో[అంటే నవంబరులో], శివరాత్రికీ బాగా జనం వస్తుంటారు. కానీ, ఇప్పుడిప్పుడే జనం తెలుసుకొని ప్రతీ శనీ ఆదివారాలలో కూడా బాగా వస్తున్నారట. ఫొటోలలో కోటప్పకొండ అందాలను చూడండి. వీలైతే అక్కడికి వెళ్ళి మరింత ఆనందం పొందండి.







శుభం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి