LOCAL WEATHER

7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

జూ. డాక్టర్లూ మీకు సమ్మె చేసే అర్హత లేదు....


సమాజంలో ఎవరు సమ్మెకు దిగినా నష్టమే......కానీ కొన్ని వర్గాల వారు, వారి కోర్కెలు నెరవేరనప్పుడు వాటిని సాధించుకోవటానికి సమ్మె చేస్తుంటారు......దానివలన వచ్చిన నష్టం సమాజమూ....ఉద్యోగులూ భరిస్తుంటారు, జరిగిన నష్టాన్ని సరి చెయ్యగలుగుతారు....కానీ డాక్టర్లు చెసే సమ్మె వలన కేవలం సామాన్య జనమే తిరిగి పొందలేనంత నష్టాన్ని పొందుతున్నారు........డాక్టరు చదువు అనేది ప్రజల ప్రాణాలు పోసే తపస్సు లాంటిది....ఆ కఠినమైన పరిస్థితులకి ఇష్టపడి మాత్రమే ఈ తపస్సుకు పూనుకోవాలి. అంతే గానీ మిగిలిన సామాన్యుల లాగా ప్రతి స్పందిచే కఠిన మనస్థత్వం ఉన్నవారూ, వ్యాపార బుద్ధి ఉన్నవారూ ఈ విద్య జోలికే రాకూడదు.

 
1] సామాన్య ఉద్యోగులు సమ్మె చెస్తే ఆ పనిని సమ్మె తరవాత పూర్తి చెయ్యవచ్చును.

2] బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తే, ఆ రెండు మూడురోజులూ జనాలకి డబ్బులందవు......కావాలంటే బయటెక్కడన్న దొరకపుచ్చుకొనే అవకాశం ఉన్నది....

3] బస్సుల వాళ్ళు సమ్మె చేస్తే దానికీ ప్రత్యామ్నాయాం ఉన్నది......

4] రాజకీయ నాయకులు చేస్తే ప్రజలకి పోయేదేమీ ఉండదు.....ఎందుకంటే వీరివల్ల ఉపయోగమే లేనప్పుడు నష్టమెక్కడిదీ.....

5] మాష్టార్లు సమ్మె చేస్తే పరీక్షలు ఆలస్యంగా పెట్టుకోవచ్చును.....


కానీ, అత్యవసర టైంలో ప్రాణాలు నిలిపే డాక్టర్లు సమ్మె చెయ్యవచ్చునా...? ఆ సమయం దాటితే పోయే ప్రాణాలను తరవాత రప్పించే అవకాశం ఉన్నదా...?? డాక్టర్లు చేసే పనికి ప్రత్యామ్నాయం ఉన్నదా.....??? మిగిలిన వాళ్ళు తాము సమ్మె చేసిన కాలానికి జీతాన్ని మాత్రమే కోల్పోతారు....కానీ డాక్టర్లు చేసే సమ్మెకు పేద ప్రజలు జీవితాలనే కోల్పోతారు. మిగిలిన వారు తాము చేసిన సమ్మెకు శిక్షగా ఇంక్రిమెంటులు కోల్పోవటమో ప్రమోషను కోల్పోవటమో జరవచ్చును......కానీ డాక్టర్ల సమ్మెకు ప్రాణాలే పోయినప్పుడు ఎటువంటి శిక్ష వేయాలీ....ఏమాత్రం సున్నిత మనస్సు లేని వారు ఈ చదువు చదవటానికి అర్హులా.......? చదువుతుండగానే ఇంత నిర్దయగా ఉన్నవారు రేపు ప్రజల ప్రాణాలకి వెలకట్టరని నమ్మకం ఏమున్నదీ.....? సున్నితమైన ఈ చదువు చదివే జూ డాక్టర్లకి సమ్మె చేసే అర్హత ఉన్నదా...?

జూ డాక్టర్ల ప్రధాన డీమాండు అయిన గ్రామాల్లో పనిచెయ్యటం ఏమన్నా కానీ పనా.......? వీరొక్కరే చేస్తున్నారా......? గ్రామాల్లో పనిచేసే మిగిలిన అన్ని రకాల ఉద్యోగులూ మనుషులు కారా....??? గ్రామాల్లో ఉండే వారు మనుషులు కారా.............ఏమిటీ....గ్రామాల్లో పనిచేసే ఆడవారికి రక్షణ కల్పించాలా....? అయ్యా జూ డాక్టర్లూ ఇక్కడి గ్రామాల్లో మనుషులను పీక్కుతినే రాక్షసులెవ్వరూ లేరు.....మీ "మెడికల్ కాలేజీల్లో కన్నా" వెయ్యి రెట్లు ఆడవారిని గౌరవించేవారే ఉన్నారు......ఆర్టీసీలో ఆడ కండెక్టర్లు సైతం రాత్రింబవళ్ళూ గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే, కేవలం డాక్టర్లకి ఎందుకొచ్చిదీ ఈ ప్రాణ భయం.....?

దీనంతటికీ కారణం ప్రభుత్వ మెతక వైఖరే......మిగిలిని ఉద్యోగులు ఆడా మగా భేదం లేకుండా గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తుంటే వారికి లేని ప్రత్యేకతను వీరికి ఇచ్చి, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం కఠిన వైఖరి వహించి, ప్రత్యేక నియమాలు పెట్టి, వాటికి ఒప్పుకున్న వారినే మెడికల్ సీట్లకు ఎంపిక చెయ్యాలి.....అలా కానివారు ఈ వృత్తినే చేపట్టక పోయినా ఈ వ్యవస్థకు వచ్చిన నష్టమేమీ లేదు. ఇదేమీ వ్యాపర పరమైన విద్య కాదు............

పైన విషయంపై "సాహిత్యాభిమాని" శివాగారిని తమ అభిప్రాయం అడిగినప్పుడు ఈ విధంగా నాకు మెయిల్ చేశారు:SIVARAMAPRASAD KAPPAGANTU
9:43 AM (2 hours ago)

to me
suggestion to Govt.

డాక్టరీ చదవటానికి ఎంట్రెన్స్ కి అప్లై చేసుకునే దరకాస్తులోనే తాను
గ్రామీణ ప్రాంతంలో ఐదేళ్ళు ముందుగా పనిచేసి తీరతానని ఒప్పుకోవాలి.

ఆ తరువాత సీటు వచ్చినాక మళ్ళీ అదే మాట తిరిగి వ్రాసివ్వాలి. ప్రతి
పరీక్షకు వ్రాసే ముందు వాళ్ళకు పది నిమిషాల టైం ఇచ్చి తాము గ్రామీణ
ప్రాంతాల్లో ఐదేళ్ళు పనిచేసి తీరతామని పది సార్లు వ్రాసి సంతకం పెట్టి ఆ
పరీక్ష పేపరుతో పాటూ ఇవ్వాలి. అలా జతపరచని పేపరు దిద్దకుండా, ఆ అబ్యర్ధి
పరీక్ష హాజరు కాలేదని పరీక్ష తప్పించాలి.

ప్రతిరోజు వాళ్ళ కాలేజీల్లో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు పనిచేసి
తీరాల్సిన అవసరం, అక్కడా పనిచేసి ఎంతో మందికి వైద్య సేవలు అందించిన
వైద్యుల కథలు స్పూర్తిదాయకంగా చదువులో భాగంగా ప్రతిరోజు లేదా కనీసం
వారానికి రెందు సార్లు క్లాసులు ఉండాలి.

ఐదేళ్ళు, చదువు పూర్తయిన తరువాత తప్పనిసరిగా ఐదేళ్ళు గ్రామీణ ప్రాంతం లో
పనిచేసి తీరాలి. అలా పనిచేస్తున్నట్టుగా ప్రతి నెలకు ఒక పది మంది
గ్రామీణుల దగ్గర నుండి సంతకాలు తీసుకుని పంపుతూ ఉండాలి. ఆ విధంగా ఐదేళ్ళు
పనిచేసినాక మాత్రమే అసలైన డాక్టర్ డిగ్రీ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే
వారిష్టం వచ్చిన చోట ప్రాక్టీసుకు అనుమతి ఇవ్వాలి.

బాoకులు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ఉదారంగా అప్పులు ఇచ్చే
పధ్ధతి ప్రవెశ పెట్టాలి. వారు పరికరాలు కొనుక్కోవటానికి, డిస్పెన్సరీ
ఏర్పరుచుకోవటానికి అతి తక్కువ వడ్డీకి బాంకులు అప్పు ఇచ్చేట్టుగా
నిబంధనలు ఏర్పరచాలి.

ఇలా చేస్తే ఒక పాతిక సంవత్సరాల తరువాత కొంత మంచి గుణం కనిపించే అవకాశం లేకపోలేదు.,


మంచి సజెషన్స్ పంపినందుకు శివాగారికి ధన్యవాదాలు.