ప్రపంచ దేశాలలో ప్రజలని పరిపాలించటానికి అక్కడ ఏవిధమైన పద్ధతి ఉన్నప్పటికీ, ఆ పద్ధతిలో లోపాలుంటే ఆ దేశ ప్రజలు సహించరు. ప్రజలు తమను సరిగా చూసుకొనే ప్రభుత్వాలనే ఆదరిస్తారు. లేదూ ప్రజలు దొరికారు కదా అని ప్రభుత్వాలు తోక జాడిస్తే ఫ్రాన్సు, రష్యా, ఈజిప్టూ సౌత్ ఆఫ్రికా మొదలైన దేశాధినేతలకి పట్టిన గతే పడుతుంది.
ఇప్పటిదాకా ప్రపంచాధిపత్యం చేద్దామన్న ఏ దేశానికీ ఆ దేశ ప్రజలు సంపూర్ణమైన మద్దతు పలకలేదు. ప్రజల గోడు పట్టించుకోకుండా స్వంత ప్రజల శ్రామిక శక్తిని దోచుకొనీ, వారి దారిన వారు ప్రపంచాన్ని ఎలా గుప్పిట పెట్టుకోవాలీ అనీ చూస్తే, స్వంత ప్రజలే తిరగ బడతారు. అలా కుదరనప్పుడు ఆ దేశాలు క్రమంగా బలహీన పడతాయి.
రష్యాలో అదే జరిగింది, అమెరికాలో అదే జరుగుతోంది....చైనాలో అదే జరగబోతోందా .......? చైనాకి కూడా రష్యా , అమెరికా గతే పట్టబోతొందా.....?
ఎందుకంటే దీనికి ముఖ్య కారణం తమ ప్రయోజనాల కోసం స్వంత ప్రజలని పావులుగా పెట్టి వారి శ్రామిక శక్తినీ, దేశ సంపదనూ వాడుకొని తద్వారా ప్రపంచాన్ని గుప్పిటపెట్టుకోవాలను చుడటమే.... ఈ విధంగా చేసే కొన్ని యూరప్ దేశాలూ, రష్యా మరియూ అమెరికాలు తమకేమాత్రం సంబంధం లేని విషయాలలో తల దూర్చి తమ ఎకానమీలను[ప్రజల శక్తిని] బలహీన పర్చుకొన్నాయి. ఇప్పుడు అదే దారిలో చైనా ఉన్నది.
యూరప్ దేశాలకంటే చైనా కొంచం అతి తెలివిని ప్రదర్శిస్తోంది. యూరప్ దేశాల వారు తమ ప్రజలని పరోక్షంగా వాడుకొంటే చైనా ప్రత్యక్షంగా వాడుకొంటొంది. ఇందులో భాగమే అతి తక్కువ ధరలకి అనేక వస్తువులను ప్రపంచానికి అందించటం...... డిఫ్లేషన్ అనేది ఇంఫ్లేషను కన్నా ప్రమాద కరమైనది. దీని వలన నిరుద్యగిత పెరిగిపోతుంది. అందుకనే తన శ్రామికులను ఉపయోగించి మిగిలిన దేశాల పరిశ్రమలను దెబ్బతీసి......దాని ద్వారా ఆయా దేశాల ఎకానమీలను దెబ్బతియ్యాలని చైనా ప్రయత్నం.
ప్రపంచ కార్మికుల సంగతి సరే, మరి చైనా కార్మికుల మాటేమిటి........??? కారల్ మార్క్స్ సిద్దంతం ప్రకారం ప్రపంచంలో ఏ వస్తువుకూ స్వంత పూర్తి విలువ ఉండదు. దానికి శ్రామిక శక్తిని జోడించిన తరవాతే దేనికైనా పూర్తి విలువ పుడుతుంది. దీని ప్రకారం ఒక దేశంలో దొరికే వస్తువు విలువ బట్టి, ఆ దేశంలో శ్రామికునికి ఇచ్చే విలువ తెలుస్తుంది. ప్రపంచంలో ఒకే వస్తువుకు అనేక దేశాలలో అనేక ధరలుంటాయి. ఇలా ఉండటానికి అనేక కారణాలుంటాయి....మొదటిది ఆ దేశపు డబ్బు మారకం విలువ.......ఆ దేశంలో వస్తువుకు కావాల్సిన ముడి సరుకు దొరకక పోవటం.....ప్రతీ వస్తువూ అన్ని దేశాలలో అందుబాటులో లేకపోటం.....ఆ వస్తువు తయారీలో నైపుణ్యంలో తేడాలుండటం......ఇలా మొదలైన కారణాలుండటం వలన ఏ దేశం కూడా అన్ని వస్తువులనూ అందుబాటులో ఇవ్వటం కష్టమే మరి.
కానీ, చైనా విషయంలో వేరే విధంగా ఉన్నది. అన్నిరకాలైన వస్తువులనూ మరొక దేశంలోని ఏ కార్మికుడూ తయారు చెయ్యలేనంత తక్కువ ధరకు ఇస్తున్నారు. ఇదెలాగు సాధ్యమైనది....? పోనీ చీనాలో తక్కువ ధరలకే బ్రతికే విధంగా ఉన్నదా.....??? అలాంటప్పుడు ఆ దేశపు కరెన్సీనీ ఆధారంగా చేసుకొని చూడాలి....చైనా దేశపు కరెన్సీ "యవాన్" మన దేశపు "రూపాయి" కంటే షుమారు 8.35 రెట్లు ఎక్కువ.....అనగా మన దేశంలో శ్రామికుడికి ఇచ్చేదానీకన్నా ఎంత లేదన్నా కనీసం 8.7 రెట్లు అధికంగా విలువ ఇవ్వాలి. అలాంటప్పుడు చైనా నుండి దిగుమతి అయ్యే వస్తువు మన దేశంలో దొరికే వస్తువు కన్నా 8.35 రెట్లు అధికంగా ఉండాలి. అలాగే, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే కేవలం 6.9 యువాన్లకే ఒక డాలరు వస్తుంది. అంటే అమెరికా కన్నా తక్కువ, మరియూ మన కన్నా ఎక్కువ జీవన విధానం చైనాలో ఉన్నట్లు అనుకోవాలి. అలాంటప్పుడు మనదేశం కన్నా తక్కువ ధరకు [మనకు పంపించేంతగా] ఇవ్వటం ప్రకారం చూస్తే....... అన్ని వస్తువులూ తయారు చేసే ముడిసరుకు అతి చవుకగా చైనాలో అందుబాట్లో ఉన్నదనుకోవాలి.. .......లేదా వారి శ్రామికుల శక్తిని తక్కువగా కొలవాలి. మొదటిది అసాధ్యం కనుక, రెండవదే చైనా చేపట్టింది.

ఈ విధంగా తనకున్నా జనభానీ ఒక ఆయుధంగా చేసి ప్రపంచం మీదకు సంధిస్థొంది. కానీ ఆ ఆయుధం మనుషులని గుర్తించటంలేదు. ఇది అణుయుద్ధం కన్నా, క్రిమి రసాయనిక యుద్ధాల కన్నా నికృష్టమైనది....ఇది ఏ రెండు దేశాల మధ్యా జరిగే యుద్ధం కాదు........ ప్రపంచంలోని అనేక దేశాల కార్మికుల మీద యుద్ధం. చైనా తన కార్మికులని వచించి, ప్రపంచ కార్మికుల పొట్టగొడుతున్నది. "ప్రపంచ కార్మికులారా ఏకంకండి" అని కమ్యూనిజం చెపుతుంటే అదే సిద్ధాంతాన్ని దురుపయోగ పరచి ప్రపంచ కార్మికుల మధ్య విభేదాలు తెస్తోంది. ఈ విధంగా ప్రపంచ చరిత్రలో ఏ నియంత చెయ్యనంత నికృష్ట విధానంతో ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోంది.
ఇవ్వాళ చైనాలో కనపడేది మూలంలో ఉన్న కమ్యూనిజం కాదు...."మార్పు" అనే పేరుతో మూలాన్నే మార్చేసి "బూర్జువా కమ్యూనిజం" మాత్రమె. మతహింస, రాజ్యహింస లాగానే "సిద్ధాంత హింసను" చేస్తూ, దానిని సమర్ధించుకుంటోంది. [తన రాజ్య కాంక్షతో టిబెట్టుని ఆక్రమించటమే కాకుండా, మన దేశంలో కూడా దురాక్రమణ జరిపి, మనకు అనేక వేల కోట్ల రూపాయల అనవసర సైనిక ఖర్చుకి కారణమైనది.] వేరే దేశంలో పరిశ్రమలు రాకుండా చేసి, కమ్యూనిజానికి చెడ్డ పేరు తెస్తోంది. కానీ తమ దేశంలో అదే పరిశ్రమలని తన ఇష్టారాజ్యంగా [అడిగే వారు ఉండరు కదా] నెలకొల్పి అక్కడి ప్రజలను ఇబ్బంది పెట్టటమే కాకుండా.....మన అంతర్జాలంలో అనేక "దొంగ లింకులు" పెట్టీ.....వాటి ద్వారా అక్కడి[చైనా]ప్రజల మనోభావాలను వక్రీకరించి ప్రపంచానికి చూపిస్తోంది.
ఎందుకంటే, బూర్జువా దేశాలుగా పిలువబడే పెట్టుబడీదార్ల దేశాలలాగానే చైనాలో కూడా పేద్ద నగరాలూ....అందులో పెద్ద పెద్ద ఆకాశాన్ని తాకే భవనాలూ.....స్టార్ హోటళ్ళూ....వ్యాపార సముదాయాలూ ఉన్నాయి. మరి వాటిలోనికి సామాన్య చైనా పౌరుడు వెళ్ళే అవకాశం ఉన్నదా.....? ఈ విధంగా అక్కడ కూడా ఆర్ధిక అసమానతలు పెరిగి పోవటంలేదా...?? ఈ మొత్తం అభివృద్ధికీ తమ దేశపు కార్మిక శక్తినీ దోచే చేస్తున్నారు. ఇదంతా అక్కడి ప్రజల పూర్తి అంగీకారంతోనే [నెట్లోని దొంగ లింకులు ఫొటోలూ చూసి] జరుగుతోందని అనుకోవాలా.....??? ఒక విధంగా రాజరికానికీ, కమ్యూనిజానికీ తేడా లేనంతగా దేశాన్ని భ్రష్టు పట్టించారు అక్కడి బూర్జువా కమ్యూనిస్టు పెద్దలు.
ఒక ప్రక్క ప్రపంచ దేశాలలో ఉన్న కార్మికులు ఎదో అన్యాయానికి గురి అవుతున్నారనీ, వారిని రక్షించటానికీ తమ దేశమొక్కటే కృషి చేస్తున్నట్లుగా మొసలి కన్నీరు కారుస్తూ.......మరో ప్రక్క తమ కార్మికులని వాడుకొని.....అక్కడి నుండి "అనేక వస్తువులను అతి తక్కువ ధరకు ప్రపంచ దేశాలకి ఎగుమతి చేస్తూ......ప్రపంచ కార్మికులకి పనిలేకుండా చేస్తోంది చైనా".......పైగా ప్రపంచ కార్మికుల సంక్షేమానికి తమ పార్టీ బ్రాంచీలను ఏర్పాటు చేసి వారికేదో మేలు చేస్తున్నట్లుగా కనపడి.....వారి వారి దేశాలనే శత్రువులుగా చిత్రీకరించి.....అక్కడి శ్రామిములను వెర్రి వాళ్ళను చేస్తోంది చైనా కమ్యునిస్టు పార్టీ. మరోప్రక్క తమ దేశంలో మడుకూ శ్రామికులను "దేశ భక్తి పేరుతో బ్లాక్ మెయిల్ " చేసి వారిని వెర్రి వాళ్ళని చేస్తోంది.
ఎటు చూసినా చైనా, ప్రపంచ కార్మికులనే కాదు, తమ దేశపు కార్మికులను కూడా వంచిస్తోంది. ఈ నిజాన్ని చైనా కార్మికులు గుర్తించిన మరుక్షణం చైనాకి కూడా ప్రపంచ నియంత దేశాలకి పట్టిన గతే పడుతుంది. కానీ, అప్పటి దాకా ప్రపంచ కార్మికులు ఇబ్బంది పడవలసినదే మరి......."చైనా కార్మికుల్లారా మేల్కోండి".
ఇందులోని బొమ్మలు గూగుల్ లోనివి. మిక్సింగ్ కేఅర్‌కె

Very good article, Please translate in to chainees language and post in china website QQ.com
రిప్లయితొలగించండిఅదిత్య గారూ ధన్యవాదాలు.......Please let me know how to translate into chainees languague......
తొలగించండి