LOCAL WEATHER

22, అక్టోబర్ 2014, బుధవారం

నేరం నాయకులది...శిక్ష రాహుల్ గాంధీకా...!!!

కాంగ్రెస్సు ఓటమికి తామేమి కారణం కాదు, 
అంతా రాహుల్ దేనని, 
ప్రియాంకా కావాలని 
కార్యకర్తలచే ఎంతో అమాయకంగా నాటకం ఆడిస్తున్నారు... 
లోకల్ అవినీతి నాయకులు. 
ప్రియాంక కన్నా రాహుల్ 1000 రెట్లు బెటర్.
కానీ, కాంగ్రెస్ నాయకులు 
తాము చేసిన తప్పులకి రాహుల్ గాంధిని బాధ్యుడిని చేసి 
తమ తప్పుల  నుండి తప్పుకుంటున్నారు. 
చాలా రాష్ట్రాలలో అధికారంలో ఉన్నప్పుడు 
కాంగ్రెస్స్ నాయకులు రాహుల్ గాంధిని అడిగి పరిపాలన చెయ్యలేదు...
అవినీతి చెయ్యలేదు... 
అది కేవలం కాంగ్రెస్స్ అధిష్టానమే చూసుకుంది...
నిజానికి రాహుల్ గాంధి అవినీతిపరుడా...కాదు. 
ఎందుకంటే ఏ అవినీతి ఆరోపణలలో లేడు. 
ఉంటే సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఉన్నారేగాని రాహుల్ లేడు... 
కేవలం ఎన్నికలప్పుడే రాహుల్‌ని తెచ్చి ముందర నుంచోబెట్టి, 
"ఇతను సరైన నాయకుడు కాదు" అని ఎలా చెప్పగలరు...?  
రేపు ప్రియాంకా వధేరా వస్తే సాధించేది ఏమున్నది...???
 ఈవిడ భార్తగారు చేసిన అవినీతి పనులు ఇప్పటికే కాంగ్రేస్సును ముంచేసినాయి..
ఆ పాపం కూడా రాహులే మోయ్యాలిసి వచ్చింది...
పైగా ఇది మోడీ సమయం...
కాబట్టి, కాంగ్రెస్సు నాయకులలాగా కాకుండా 
పక్షపాతం లేకుండా 
కాంగ్రెస్సు దేశవ్యాప్తంగా ఓడిపోవటానికిగల కొన్ని కారణాలు చూద్దాం...

1] ఆంధ్రా....విభజన పాపం మరియూ  10 సవత్సరాల దిక్కుమాలిన పరిపాలన. 
2] తెలంగాణా....విభజన జరిగిన విధానం...ఐకమత్యం లేని 
   స్వయం ప్రకాశంలేని మసిబట్టిన లోకల్  కాంగ్రెస్ నాయకులు.  
3] హర్యాణా...10 సంవత్సరాల అవినీతి పాలన...మోడీ హవా...
4] గుజరాత్... మోడీ హవా...
5] మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘర్...ఐకమత్యం లేకపోవటం... ఉడిగిన లోకల్  నాయకత్వం, 
6] మహారాష్ట్రా, రాజస్థాన్... లోకల్ నాయకుల అవినీతి మరియూ పనికి మాలిన పరిపాలన 
7] ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, బీహార్, ఝార్‌ఖండ్, వెస్టు  బెంగాల్... 
   వీటిలో కాంగ్రెస్స్ మట్టి కరచి ఎన్నో "ఎన్నికలు గడుస్తున్నాయి"...!!! 
8] భారతదేశ ఎన్నికలు... కాంగ్రెస్సు 10 సంవత్సరాల 
   చదువోచ్చిన పిచ్చి పరిపాలన...మోడీ హవా... 
9] శనిలా పట్టిన కాంగ్రెస్సు సీనియర్ నాయకులు. 

పైవన్నీ మోడికి ఎలా కలిసి వచ్చినాయో... రాహుల్‌కి అలా మైనస్ పాయింట్లు అయినాయి. ఈ కారణాల్లో ఎక్కడా రాహుల్ ప్రమేయం ప్రత్యేక్షంగా లేదు... అయితే, పెద్ద పార్టీలలో "పార్టీ గెలుపు కేవలం ముఖ్యనాయకుడి వల్లనే వస్తోంది" అని అనిపించుకోటానికి, ఆయా నాయకులు, వారి సొంత దారులు తాపత్రయపడుతున్నారు...ఇలా రాజకీయాల్లో విజయం మొత్తం... తమ నాయకుడి వల్లనే వస్తుందనే భావం సృష్టించటం వల్లనే, అపజయాల భారం నాయకుడు మోయ్యవలసి వస్తోంది...క్రింది నాయకులకి కూడా ఇది హాయిగానే ఉన్నది...తాము లోకల్‌గా ఎన్ని పాడు పనులు చేసినా... అది పెద్ద నాయకుడి మీదుగానే పోతుంది గాని వీరికి తగలదు... కాబట్టి, గెలిచినా ఓడినా వారికి తగలటంలేదు. నిజానికి "ఇది సమిష్టి బాధ్యతే గాని ఏ ఒక్కరిదో కాదు". ఇలా అని పార్టీ పెద్దలు కూడా ప్రచారం చేస్తే, అప్పుడు తప్పొప్పుల భారాన్ని అందరూ పాలు పచుకోవటమే కాకుండా...లోకల్‌గా ఉండే నాయకులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ప్రజల కోసం పనిచేస్తారు...దీనిని ఆమోదించాలి అంటే... రాజకీయాలలో వ్యక్తి సామ్యం/ఆరాధన పోవాలి, ప్రజలనే నాయకులుగా/హీరోలగా గుర్తించాలి... అప్పుడే నిజమైన ఫలితాల విశ్లేషణ వస్తుంది. 

ఇక్కడ, మన ఎన్నికల విశ్లేషకుల గురించి చెప్పుకోవాలి....ఎంతో ఘనత వహించిన వీరు కూడా ఎన్నో వివరించి, అసలు విషయం అయిన ప్రజలని... మరచి పోతున్నారు. ఎంత గొప్ప నాయకులనబడే వారున్నప్పటికి, ప్రజలని పరిగణలోనికి తీసుకోకుండా... ఆ నాయకుడుంటే గెలుస్తారు, ఈ నాయకుడుంటే ఓడిపోతారు అని తమకి తోచిన విధంగా విశ్లేషణలు చేసిపారేస్తున్నారు... జరిగేది, జరిపించేది ప్రజలే... ప్రజలు పార్టీని ఆమోదించినప్పుడు ఈ విశ్లేషకులు అది పరిగణలోనికి తీసుకోకుండా ఆ నాయకుడిని పైకేత్తేస్తారు...

ఉదాహరణకి...ఆంధ్రాలో వైఎస్సార్ చంద్రబాబుని దింపినప్పుడు 220 సీట్ల దాకా వచ్చినాయి.... అది వై ఎస్సార్ గొప్పతనమన్నారు.... అదే అయిదేళ్ళ వై ఎస్సార్ పరిపాలన తరవాత కాంగ్రెస్సుకి 157 మాత్రమే వచ్చినాయి... ఇక్కడ తెలుసుకోవలసింది నాయకుడి గొప్పతనం కాదు... పాత అధికార పార్టి వాళ్ళు చేసిన తప్పులు అధికారం లేని నాయకులకి కలిసి వస్తాయి అనేది. అలా కలసి రావటానికి మూలం ప్రజలే... వారిని ఎవరు సంతృప్తి పరుస్తారో వారికి ఓట్లు వెయ్యటమే కాకుండా...అసంతృప్తి పరచిన వారికి వ్యతిరేకంగా ఓటు వేస్తారు. దీనిని నాయకుల గొప్పతనం అనుకుంటే...ఓటమిలో కాలిసినట్లే... 

ఇక రాహుల్ గాంధి విషయానికి వస్తే... 
తమ పిల్లలకి ఏమి ఇబ్బంది వస్తుందో అని 
ముద్దు చేసే తల్లిదండ్రులు ప్రక్కన ఉండి పిల్లలని నడిపిస్తే, 
వారికి మొద్దులుగా ఎలా పేరు వస్తుందో...
అదే రాహుల్‌కి వచ్చింది... 
నిజంగా రాహుల్ గాంధి నాయకత్వం ఏమిటో తెలియాలంటే... 
సోనియా పూర్తిగా విశ్రాంతి తీసుకొని,  
ఇప్పుడు రాబొయ్యే ఐదేళ్ళు 
అతనినే దేశంలోని కాంగ్రెస్సు మొత్తానికి నాయకుడిని చేసి,  
కాంగ్రెస్సు నాయకులందరూ రాహుల్ మాట మీదే నడచి... 
అతని మాటతోనే కాంగ్రెస్సుని నడిపించి... 
ఆ తరవాత వచ్చే ఎన్నికల ఫలితాలని చూస్తే గాని 
అతని నాయకత్వ పటిమ తెలియదు...
 రాహుల్ గాంధి కూడా మోడీ తరహాలో 
ఏ అమిత్ షా లాంటి వాడినో సహచరుడిగానో...
సలహాదారుడిగానో పెట్టుకుంటే...
మోడీ అంతటి నాయకుడు కాకపోయినా 
కనీసం మోడికి పోటి అయినా ఇవ్వగల నాయకుడిగా అవుతాడు....
దేశంలోని అన్ని రాష్ట్రాలలో కాస్తో కూస్తో పలుకుబడి ఉన్న నాయకుడు 
మోడీ తరవాత రాహులే...
ఈ సంగతి సోనియాకి ఎవరు చేప్తారబ్బా...!!! 

ఇది కేవలం భారతదేశంలో జరిగిన ఎన్నికల విశ్లేషణ గురించేగాని... కాంగ్రేస్సునుగానీ, రాహుల్ గాంధిని గానీ వెనకేసుకుని రావటం కోసం కాదు.  కాంగ్రెస్సు లాంటి దేశవ్యాప్త పార్టి మరొకటి లేదనే చెప్పాలి...అయితే, ఇప్పుడిప్పుడే బిజెపి కూడా అలాంటి వ్యవస్థని దేశవ్యాప్తంగా ఏర్పరచుకుంటోంది. బిజెపి "కాంగ్రెస్సు హఠావో" అంటోంది కాని, దాని స్థానాన్ని భర్తీ చేసే మరో పార్టి వచ్చే దాకా కాంగ్రెస్సు ఉండాలిసిదే...అది ఎలాంటి పార్టి అయినప్పటికీ... ఎందుకంటే, కాంగ్రెస్సు పార్టీకి పల్లెల నుండి మహానగరాల వరకూ...కేరళా నుండి మిజోరాం వరకు ఉన్న వ్యవస్థ మరొక పార్టికి లేదనే చెప్పవచ్చును... అందుకని కాంగ్రెస్సు హఠావో అనేకన్నా "స్వచ్చ కాంగ్రెస్" అంటే దేశానికి మంచిది. దేశంలో కనీసం రెండు బలమైన పార్టీలు ఉంటేనే అది ప్రజాసామ్య దేశం అవుతుంది...కాంగ్రెస్సులో  ప్రస్తుతం ఉన్న వ్యక్తుల్ని చూసి, ఆ పార్టీని హఠావో అనటం సరికాదు. 

దీనికి ఉదాహరణగా... 
ఒంగోలులోని ఒక ఆటో డ్రైవరు మాటలు. 
ఆటో ఎక్కినాయన... 
"విభజన ఇంత భయంకరంగా చేసిన కాంగ్రెస్ జెండా 
కనపడకుండా చెయ్యాలి" అని 
 విభజన తరవాత వచ్చిన ఎన్నికల సందర్భంగా అన్నాడు... 
దానికి  ఆటో డ్రైవరు జవాబు...
"బాధ్యత వహించాలిసిన ఆ పార్టిలో ఉన్న వారు
వేరే పార్టిలలో దూరిపోతే...
మిగిలిన ఆ జెండా ఏం పాపం చేసింది" అని అన్నాడు.
నిజమే... 
పార్టి అంటే జెండా లేక పేరు కాదు కదా.. 
అందులో ఉన్న వ్యక్తులే కదా. 
ఆ పార్టిలో ఉండి, చెయ్యాలిసిన చెత్త అంతా చేసేసి...
ఆ తప్పుని పార్టి మీదకు తోసేసి,
వారు కాస్తా ఏ మాత్రం బాధ్యతా వహించకుండా
వేరొక పార్టీలోనికి పొతే.. 
వారిని చక్కగా తమ తమ పార్టీలలోనికి ఆహ్వానిస్తే
అది కాంగ్రెస్ హఠావో అవుతుందా....???

ఇదంతా ఎందుకంటే...
ఎలాగూ ఏ ఐదేళ్ళకో పదేళ్లకో
మళ్ళి కాంగ్రెస్సే కీలక పార్టి అవుతుంది
" ఏ నాయకత్వం ఉన్నప్పటికీ"...
అప్పుడు ప్రియాంకా వధేరా కన్నా
రాహుల్ గాంధీ ఉంటేనే దేశానికి మంచిది...


@@@@@@@@@@@@@


\_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/
\_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/
\_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/
అంరికి దీపాళి శుభాకాంక్షలు
\_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/
\_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/
\_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/




@@@@@@@@@@@@@
బొమ్మ కర్టేసి:సాక్షి 







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి