LOCAL WEATHER

10, అక్టోబర్ 2014, శుక్రవారం

హుదూద్ తుఫాను విశాఖనే చేరుతుందా...???

కోస్తాకు మరో తుఫాను... 
ఈ సారి భారసాల చేసి 
దానికి హుదూద్ అని పెరేట్టినవారు ఒమన్* దేశం వారు. 
అది అక్కడి ఒక పిట్ట పేరు...

కర్టేసి:సాక్షి

సరే, తుఫాను విషయానికి వస్తే...
అది మొన్న అండమాన్స్ దగ్గర దాటి, 
అక్కడి నుండి భారత ఖండం వైపునకు రావటం మొదలెట్టింది...
ఇది పశ్చిమం..పశ్చిమ-ఉత్తరంగా కదులుతూ ఉన్నది.
ఇది విశాఖ మరియూ గోపాల్ పూర్[ఒరిస్సా]మధ్యలో దాటుతుందని మొదలు అనుకున్నారు...
అయితే, అది పశ్చిమానికి ఎక్కువ కదులుతూ ఉండటంతో...
విశాఖ నగరం దగ్గర దాటుతుందని దరిదాపుల అన్ని పేపర్లలో వేశారు.

కర్టేసి: తెలుగు వార్తాపత్రికలు 

ఈ తుఫాను యొక్క కదలికలని
 http://www.accuweather.com/ లో 
ఫోటోలు పెడుతున్నారు. వాటన్నిటిని కలిపి జిఫ్ చేశాను...

ఈ నెల 8వ తారీకు నుండి 10తారీకు ఉదయం 7 గంటల వరకూ 
సేటిలైట్ తీసిన ఫోటోల సమాహారం.
కర్టేసి: accuweather

ఈ పైన ఉన్న తుఫాను కదలికలని చూస్తే 
అది విశాఖ వైపు వస్తున్నట్లు కనపడుతున్నా...
దారి తప్పి ఒరిస్సా-బెంగాలు వైపుకి వెళ్ళేట్లే ఉన్నది.
తీరం వెంబడి సముద్ర కదలికలు మరియూ గాలి 
ఉత్తరం మరియూ ఉత్తరం-తూర్పువైపుగా ఉండటం వలన 
అది అరవై శాతం ఒరిస్సాకి తాకేట్లే ఉన్నది.
లేదా 
ఇంకా పైకి పోయి బెంగాలుకి తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదు...
ఎందుకంటే అది తుఫాను కదా...
టార్గెటెడ్ మిస్సైల్ కాదు కదా...!!!

చూద్దాం...

ఏది ఎలా ఉన్నా 
ప్రభావం ఉన్నదని చెపుతున్న ప్రాంతాల ప్రజలు 
అప్రమత్తతతో ఉండి
 ప్రభుత్వ అధికారులకి సహకరిస్తే 
ఆస్థి నష్టాన్ని ఆపలేకపోయినా 
కనీసం 
ప్రాణ నష్టం అయినా లేకుండా చెయ్యొచ్చు.

--------------------------------------------------
10-10-2014 రాత్రి 10 గంటలకి 
ఈ రోజు ఉదయం 6.25 నుండి రాత్రి 9.25 వరకు తుఫాను కదలికలు. 
దీని వరస చూస్తే, విశాఖా మరియు భువనేశ్వర్‌ల మధ్య 
ఏ శ్రీకాకుళం దగ్గరో దాటేట్టుంది...
విశాఖా-భువనేశ్వర్ ప్రాంతం...ఇంకొంచం క్లోజప్పులో....

--------------------------------------------------
11-10-2014 ఉదయం 9.30 నిమిషాలు.
ఈ రోజు ఉదయానికి 
తుఫాను విశాఖకి దగ్గరగా వచ్చి 
కొద్దిగా దక్షిణానికి దిగినట్లు కనపడుతున్నది.
 అలా జరిగితే, 
దీని వల్ల కాకినాడకి కూడా 
పెద్ద ప్రభావం ఉండే అవకాశం ఉన్నది.

అయితే... 
విజయనగరం, విశాఖా, తుని, కాకినాడలలోని 
మాకు తెలిసిన వాళ్లకి ఫోన్ చేసి కనుక్కుంటే
అక్కడ ఇప్పటివరకు[9.30AM] 
తుఫాను ఎఫ్ఫెక్టు ఏమీ లేదనే చెప్పారు.
ఈ హుదూద్ తుఫాను కూడా లేహర్ తుఫానులాగా 
సముద్రంలోనే కలిసిపోయ్యే అవకాశం ఉన్నది.
 ఏ సంగతి ఈ రోజు సాయంత్రానికి తేలిపోతుంది.
--------------------------------------------------
11-10-2014 సాయంత్రం 7గంటలు 
తుఫాను ఈ విధంగా రావచ్చును...
కర్టేసి:http://in.weather.com/

తుఫాను దగ్గర నుండి మరో అయిదు రోజులు 
ఈ విధంగా వర్షాలు పడచ్చును.
కర్టేసి:http://in.weather.com/
--------------------------------------------------

12-10-2014 ఉదయం 6 గంటలు 
విశాఖ మీదకే తుఫాను...
ఈ రోజు మధ్యాన్నం దాటే అవకాశం...

--------------------------------------------------
12-10-2014 మధ్యాహ్నం 12 గంటలు
విశాఖ మీదే ఉన్న తుఫాను...
వాతావరణ శాస్త్రవేత్తలు సూచించిన విధంగానే 
విశాఖ నగరం మీదుగా దాటుతోంది. 
అక్కడ విపరీతం సృష్టిస్తోంది.
సెల్ టవర్స్, ప్రకటన బోర్డులు, చెట్లు కూలి 
భీభత్స  వాతావరణం ఉన్నదని 
విజయవాడ దూరదర్శన్ "సప్తగిరి" లో  
లైవ్ చూపిస్తున్నారు.
--------------------------------------------------
12-10-2014 మధ్యాహ్నం 12.56


CYCLONE EYE
మధ్యాహ్నం 12.25 సమయంలో 
విశాఖ మీద ఉన్న "తుఫాను కన్ను".
ఈ సమయంలో తుఫాను ప్రశాంతంగా ఉంటుంది.
ఈ తుఫాను కన్ను చుట్టు భీభత్సం ఉంటుంది.
అంటే, కొద్ది సేపట్లో మళ్ళి తుఫాను విజృంభిస్తుంది. 
--------------------------------------------------

కర్టేసి: accuweather

@@@@@@@@@@@@@
*తుఫానులకి పేర్లు పెట్టటం...కొంతకాలం క్రిందే మొదలయ్యింది. 
ఇదివరకు తుఫానుని, అది వచ్చిన సంవత్సరం బట్టి గుర్తించేవారు. 
అయితే, ఒకే సంవత్సరంలో అనేక తుఫానులు వస్తే వాటిని గుర్తించటం కష్టం. 
అందుకనే తుఫానులు వచ్చే ప్రదేశంలోని దేశాలన్నీ కలిసి 
తుఫానుల పేర్ల లిస్టుని తయారు చేసి, 
అందులో నుండి పేర్లు పెట్టటం మొదలు పెట్టారు. 
ఆ పేర్లని తుఫాను వచ్చిన ప్రదేశంతో సంబంధం లేకుండా... 
దేశాల వరుస క్రమంలోని దేశాలకి అవకాశం ఇస్తారు... 
ఈసారి ఒమాన్ వంతు వచ్చింది.
@@@@@@@@@@@@@




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి