ఈ మధ్యన విభజన వంటకాలలో పడి, బ్లాగులో... వంటకాల గురించి అంతగా వ్రాయలేదు... సరే, ఏదైనా కొత్తది వ్రాద్దాము అనుకుని చూస్తుంటే...ఫేసు బుక్కులో లేపాక్షి గారి "నీ వంటా నేను తింటా" కార్టూను చూసి నవ్వుకున్న తరవాత... అవును నిజమే... నిజంగా బియ్యంతో అన్నం సవ్యంగా వండటం తెలికేనా....ఒక్కొక్కసారి చాలా తేలిక అనుకునే విషయం కూడా నిజంగానే తేలిక కాదు. ఈ సంగతిని మనకు ఎదురైయ్యే మన చుట్టాలుగాని, స్నేహితులని గాని చూసినప్పుడు తెలుస్తుంది...
నా చిన్నప్పుడు మా చుట్టాల అబ్బాయి అన్నం వండుకున్న విధానం గురించి చెప్పుకుని, మా పెద్దవాళ్ళు నవ్వుకున్నది చూశాను... అతను, మంచి ఉద్యోగం వచ్చి వేరే ఊరిలో ఉండి, వండుకోవాలిసిన పని పడింది. అతను... గిన్నె నిండా నీళ్ళు పోసి, అందులో మడుకు తనకి కావాలిసినంత బియ్యాన్నే వేసి ఉడకబెట్టేశాడుట... ఏమున్నది.. అది కాస్తా అన్నం కాకుండా జావై కూర్చుంది...ఇది కనీసం పాతికేళ్ళ నాటి సంఘటన... అయితే, ఇది చాలామందికి వచ్చనుకోండి..అయితే రాని వాళ్ళకి "రాదు" అని చెప్పుకోవటం ఇబ్బంది కాబట్టి, వారు చెప్పుకోకపోవచ్చును ... అందుకని, అన్నం వండటం ఎలాగో తెలుసుకుందాము...
కావాలిసినవి...
1] బియ్యం
2] నీళ్ళు
3] నిప్పులు[అదేలెండి గ్యాస్/కరెంటు మంట]
4] సరిపొయ్యే గిన్నె
జాగ్రత్తలు: అన్నం వండటం తేలికే... కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోనితీరాలి.....
మొదటిది...మంచి బియ్యాన్ని ఎంచుకోవటంలోనే అసలైన విషయం ఉన్నది. బియ్యానికి ఉన్న పేర్లతో సంబంధం లేకుండా...కొత్త బియ్యం, పాత బియ్యం అని ఉంటాయి...పాత బియ్యం వండటం తేలిక...తగినన్ని నీళ్ళు పోసి వాడితే సరిపోతుంది... అయితే, కొత్త బియ్యం వండేప్పుడు సరిగ్గా చూసుకోకపోతే అన్నం ముద్దై పోతుంది. అందుకని...ఎక్కువ నీళ్ళు [ఎసరు] పోసి ఒకసారి మరిగిన తరవాత, దానిలో కడిగిన బియ్యం వెయ్యాలి...ఒక ఉడుకు వచ్చిన తరవాత... ఎక్కువగా ఉన్న నీళ్ళని తగ్గించాలి[వార్చాలి]..ఆ వచ్చిన తెల్లని నీళ్ళే గంజి. ఇది కొత్త బియ్యం వండినప్పుడు ఎక్కువ వస్తుంది. దీనిని బట్టలకి స్టిఫ్‌గా ఉండటానికి పెట్టుకోవచ్చును.
రెండవది... నీళ్ళు. నీళ్ళు కూడానా అని అనవద్దు. బ్లీచింగు/క్లోరిన్ కలిపిన మునిసిపల్ పంపు నీళ్ళు తగినన్ని పోస్తే చాలు, తొందరగా ఉడుకుతుంది...అవి కలపని మామూలు బోరింగు పంపు నీళ్ళలో నిమ్మదిగా అన్నం ఉడుకుతుంది... కాబట్టి నీళ్ళ ఎంపిక కూడా ముఖ్యమే. బోరింగు నీళ్ళు అయితే... అన్నం ఉడికేలోపల నీళ్ళు అయిపోకుండా కొద్దిగా ఎక్కువ పొయ్యాలి.
ఇక మూడవది మంట ఎప్పుడు ఎంత మంట పెట్టాలి అనేది కూడా ముఖ్యమే ... మొదలు ఒకసారి పైకి నీళ్ళు పొంగేవరకు ఎక్కువ మంట పెట్టాలి...ఆ తరవాత అన్నం ఉడికేదాకా...తక్కువ మంట[సింలో]పెట్టాలి. కుక్కరుకైతే ఎక్కువ మంటనే పెట్టాలి.
పోసిన బియ్యానికి వచ్చిన ఉడికిన అన్నం
నాలుగవది గిన్నె...ఇది రెండు రకాలుగా చూడాలి... గిన్నెలో నీళ్ళు-బియ్యం పోసినప్పుడు సరిపోయినది, ఉడికిన తరవాత సరిపోదు... అందుకని అన్నం ఎంత వండాలి అనే దాని మీద ఆధారపడి గిన్నె సైజు ఉండాలి...బియ్యం,నీళ్ళు పోయ్యగా, పైన తగినంత ఖాళి ఉండే గిన్నెని పెట్టాలి. ఏ గిన్నెలో అయినా బియ్యాన్ని సగం పైన కొద్దిగా మాత్రమే పొయ్యాలి. అంతకన్నా ఎక్కువ పోస్తే, ఉడికిన అన్నం సరిపోక...పొంగి పాడవుతుంది. రెండవది పలుచటి గిన్నెలు వాడరాదు. వీటిలో, పైన అన్నం ఉడికేలోపల... క్రింద ఉన్న అన్నం మాడిపోతుంది... అందుకని, స్టీలు అయినా ఇత్తడి గిన్నె అయినా మందంగా ఉన్నది వాడితే, గిన్నెలోని అన్నం మొత్తం ఒకేలాగా సరిగ్గా ఉడుకుతుంది. ఇత్తడి గిన్నె అయితే అన్నం రుచిగా చక్కగా ఉంటుంది. అయితే ఇప్పుడు అవి దొరకటం కష్టం, దొరికినా ఎక్కువ ధర ఉంటాయి...
కొలతలు:
సామాన్యంగా అన్నం వండేప్పుడు...ఒక డబ్బాడు బియ్యం లేక రెండు డబ్బాల బియ్యం అంటారేగానీ, అరకిలో/ఒక కిలో అని అనరు. ఒక డబ్బా అంటే షుమారు 400 గ్రాములు ఉండచ్చు. దానికి సరిపొయ్యే నీళ్ళు...బోరింగు నీళ్ళు అయితే మరికాస్త...బియ్యాన్నిబట్టి కూడా కొద్దిగా మార్పులు ఉంటాయి...
వండే విధానం:
కుక్కరు:
కుక్కరులో క్రింద భాగంలో మూడు టి గ్లాసుల నీళ్ళు పోసి, బోరింగు నీళ్ళు అయితే దానిలో కొద్దిగా చింతపండు కానీ, వాడేసిన నిమ్మకాయ తోన గానీ, వెయ్యాలి...దీనివల్ల కుక్కరు అడుగు భాగం నల్లబడకుండా ఉంటుంది. సరే, కుక్కరు గిన్నెలో కావాలిసిన బియ్యం పోసుకొని... ఆ బియ్యం పైన రెండు వేలి గీతాలు[రెండు అంగుళాలు]ముణిగేట్లుగా నీళ్ళు పోసుకోవాలి. ఈ గిన్నెని కుక్కరులో పెట్టి మూతని చక్కగా లాక్ అయ్యేట్లుగా బిగించాలి...దాని మీద విజిల్ పెట్టాలి. ఇప్పుడు దానిని స్టవ్వు మీద పెట్టి...ఎక్కువ మంట పెట్టాలి.[సింలొ పెట్ట కూడదు]., రెండు లేక మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచి, కుక్కరును దింపెయ్యాలి... ఆ తరవాత, 15 నిమిషాల వరకూ మూత తీసే ప్రయత్నం చెయ్యకూడదు.... మంటని సింలొ పెట్టినా లేక మూడు విజిల్స్ కూతలు దాటి ఊరుకున్నా... అన్నం గిన్నెలో నుండి పొంగి కుక్కరులో పడిపోతుంది. ఈ కుక్కరుతో వచ్చెన ప్రమాదం ఏమంటే... కుక్కరు అడుగున తక్కువ నీళ్ళు పోసినా, అసలు నీళ్ళు పోయ్యకపోయినా, దానిలో ఉన్న నీళ్ళు పూర్తిగా ఆవిరి అయిన తరవాత కూడా స్టవ్వు మీద ఉంచినా... కుక్కరు పేలి పోతుంది.
గిన్నెలో ఎసరు విధానం:
ఇది కొత్త బియ్యంతో గానీ, తొందరగా మెత్తబడిపోయ్యే బియ్యంతోగాని వండే పద్దతి. ఇందులో...ముందరగా ఎక్కువ నీళ్ళు గిన్నెలో పోసి దానిని స్టవ్వు మీద పెట్టి బాగా మరగనివ్వాలి. అంతకు ముందే బియ్యాన్ని బాగా కడిగి నీళ్ళు పోయ్యేట్లు చిల్లులు ఉన్న పళ్ళెంలో ఆరబెట్టాలి. నీళ్ళు బాగా మరగిన తరవాత... ఆ బియ్యాన్ని ఆ మరిగిన నీళ్ళలో వెయ్యాలి. అలా కొద్ది నిమిషాల ఉడికిన అనంతరం...ఎక్కువగా ఉన్న నీళ్ళ మొత్తాన్నీ వంచేసి...తిరిగి ఆ గిన్నెని స్టవ్వు మీద పెట్టి[గిన్నె మీద మూత పెట్టి ఉంచాలి] సన్నని మంటతో రెండు మూడు నిమిషాలు ఉంచి దింపెయ్యాలి...అంతే, కొత్త బియ్యంతో కూడా అన్నం మెత్తబడకుండా చక్కగా వస్తుంది....

ఒక డబ్బాడు బియ్యం... దీనిలో తగినన్ని నీళ్ళు...ఈ తగినన్ని నీళ్ళు పోయ్యటంలోనే అన్నం ఆకారం ఉంటుంది. దీనికిగాను, నీళ్ళు కొలవఖర్లేదు. బియ్యం పోసి... పోసిన బియ్యంపైన[గిన్నె అడుగు నుండి కాదు] చేతివేళ్లు పెట్టి, రెండున్నర వేళ్ళ గీతలు మునిగేదాకా నీళ్ళు పొయ్యాలి.[పంపు నీళ్ళు అయితే రెండు, బోరింగు అయితే రెండున్నర గీతలు ముణగాలి].
తరవాత గిన్నె మీద మూత పెట్టి...స్టవ్వు మీద పెట్టి, స్టవ్వు వెలిగించి పెద్ద మంట పెట్టాలి.
తరవాత గిన్నె మీద మూత పెట్టి...స్టవ్వు మీద పెట్టి, స్టవ్వు వెలిగించి పెద్ద మంట పెట్టాలి.
అది ఉడుకుతూ పొంగుతుంది...అప్పుడు మూతని కొద్దిగా ప్రక్కకి తొలగించి పెట్టి...
మంటని సింలో పెట్టాలి. అలా అన్నం ఉడికేదాకా ఉంచాలి...
ఉడికింది అని తెలియాలంటే... గిన్నెలో నుండి తెల్లటి నీటి ఆవిరి వస్తుంది
అప్పుడు గిన్నెని దింపెయ్యాలి.
ఇంకా అనుమానంగా ఉంటే...గట్టు మీద కొద్దిగా నీళ్ళు పోసి...
దాని మీద గిన్నెని పెడితే, ఆ నీళ్ళు కాలిన సౌండ్ కొద్దిగా వస్తుంది...

@@@@@@@@@@@@@@
ఇందులో ఇంతకు ముందు వచ్చినవి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి