LOCAL WEATHER

15, నవంబర్ 2014, శనివారం

రాజకీయాల్లో కిడ్నాప్ కలకలం....!!!

ఈ మధ్యకాలంలో ఒక పార్టికి చెందిన నాయకుడిని మరొక పార్టీ వారు వెనకేసుకునే కిడ్నేప్ రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఈ కిడ్నేప్పులన్నిటికి కారణం ఏమంటే... ఆయా నాయకులని ఎవరికీ వారు తమ తమ పార్టీల స్వంత ఆస్థిగా భావించటమే... వారు దేశానికి ప్రధాని కానియ్యండి లేక దేశాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించనియ్యండి, వారిని ప్రజల ఆస్థిగా కాకుండా పార్టీల ఆస్థిగా చూస్తున్నారు...దీనివల్లనే ఇవి కిడ్నేపులు లాగా కనపడుతున్నాయి...అయితే ఇది వారి మీద ప్రేమ కాదు,  కేవలం తమ ప్రత్యర్ధిని దెబ్బతియ్యటానికి ఈ రాజకీయాన్ని వాడుతున్నారు. ఇందుకోసం అవతల పార్టిలోని మరణించిన లేదా ఆ పార్టిలో పట్టు కోల్పోయిన నాయకులనే ఎంచుకుంటున్నారు..  ఆ నాయకులు పూర్వకాలంలో తమని తిట్టినా లేక తాము వారిని తిట్టినా వాటిని మరచినట్లు నటించి, ఆయా నాయకులని కిడ్నేప్ చేస్తున్నారు. ఈ రాజకీయం  అవతల కేవలం పార్టీ వారి నోరు మూయించటం కోసమే...... 



అందుబాటులో ఉన్న చరిత్ర ప్రకారం, ముందరగా ఎన్టిఆర్ గారిని తీసుకుంటే... ఆయన ఒక ప్రభంజనంలాగా వస్తూనే... "కాంగ్రెస్సు మూల ధనమైన" గాంధీ గారిని విపరీతంగా మెచ్చేసుకుని ఆయన సిద్ధాంతాలని కాంగ్రెస్సు వారు నిర్లక్ష్యం చేస్తున్నారని, వారు గాంధీగారు కలగన్న రాజ్యాన్ని  తేలేరని, ఆపనిని తాము చేస్తామని...కాంగ్రెస్సు నుండి గాంధీగారిని కిడ్నేప్ చేసే ప్రయత్నం చేశారు....


ఆ తరవాత కాలంలో ఎన్టిఆర్ గారు తమ పార్టీ నాయకుడైన చంద్రబాబు వలన దెబ్బతినటం, అధికారం కోల్పోవటం జరిగింది...ఇక అప్పుడు కాంగ్రెస్సు వారి వంతు వచ్చింది... తమని, తమ పార్టిని భయంకరంగా తిట్టి, అధికారం పోయ్యేట్లు చేసిన ఎన్టిఆర్ గారిని వేనేకేసుకుని వచ్చి, ఆయనని చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని దరిదాపుల రెండు దశాబ్దాలుగా చంద్రబాబుని దెప్పి పొడుస్తూనే ఉన్నారు... ఈ కార్యక్రమంలో చాలా చక్కగా తన పాత్రని పోషించిన వారు వైఎస్సార్ గారు...దరిదాపుల తన 7 ఏళ్ళ పరిపాలనలో చంద్రబాబు ఎప్పుడు మాట్లాడటానికి ప్రయత్నించినా ఎంటీఆర్‌నే ఆయుధంగా తీసుకోని నోరేత్తనియ్యలేదు...ఈ విధంగా కాంగ్రెస్సు వారు  పెద్ద మనస్సుతో, చనిపోయిన ఎం.టీ.ఆర్‌ని కిడ్నేప్ చేసిపారేసారు...ఎన్టిఆర్ సహజంగానే కాంగ్రెస్సు వ్యతిరేకి అయినప్పటికీ....ఇక్కడ తెలుగుదేశం వ్యవస్థాపకుడు అయిన ఎంటీఆర్‌ని తెలుగుదేశం వారే అవమానించటం కాగ్రేస్సుకి చక్కగా కలిసి వచ్చింది.


ఇక ఆ తరవాతి కాలంలో వైఎస్సార్ గారు మరణించటం, కాంగ్రేస్సుకి ఆయన కుమారుడు జగన్‌కి  సంబంధాలు చెడిపోవటం, ఆయన స్వంతంగా ఒక పార్టిని పెట్టెయ్యటం చకచకా జరిగిపొయినాయి... దాంతో మూల నేత కిడ్నేప్ కధ మళ్ళి మొదలైయ్యింది...ఆయన కుమారుడు ఊరూరా తిరుగుతూ తన తండ్రి విగ్రహాలని ప్రతిష్టిస్తూ తమ పార్టికి పునాదులు వేసుకుంటూ పోతుంటే...కాంగ్రెస్సు వారు చూస్తూ ఊరుకుంటారా.... జగన్‌ను ఎదిరించటానికి వేరెవరో ఎందుకు అని, అతని తండ్రి పేరును ఉపయోగించి, "వైఎస్సారు మా కాంగ్రెస్సు నాయకుడే" అనీ, ఆయనకీ ఈ కొత్త పార్టికి ఏమి సంబంధంలేదని, ఆయన విగ్రహాన్ని స్వంతంగా కాంగ్రెస్సు వారే ఆవిష్కరించేశారు. ఆయన ఆశయాలని కాంగ్రెస్సు వారు మాత్రమే తీర్చగలరు అనీ.... అప్పటిదాకా కాంగ్రెస్సులో వైఎస్సార్ వ్యతిరేక వర్గంలోఉన్న వారు కూడా వైఎస్సారుని కిడ్నేప్ చేసేశారు. అయితే, ఇక్కడ ఎవరి లేడర్ని ఎవరు కిడ్నేప్ చేశారన్నది చెప్పటం కష్టమే ... ఎందుకంటే, వైఎస్సార్ చనిపోయ్యేవరకు కాంగ్రెస్సు పార్టీలోనే ఉన్నారు...



ఇదే ట్రెండు అంటే మన ఏంటిఆర్ మొదలెట్టిన సిద్దాంతాన్నే ఉత్తర దేశీయులు కూడా కాపి కొట్టి, తామూ రాజకీయాల్లో ఏమీ తక్కువ తినలేదని చూపిస్తున్నారు...మోడీ వలన దెబ్బతిన్న అద్వాని మీద కాంగ్రెస్సు వారు ఎనలేని జాలిని కురిపించి నిజానికి అద్వానీ మాత్రమే సరైన నాయకుడని, ఆయనే సెక్యులర్ వాది అని, రకరకాలుగా ప్రస్తుతించి, తాము  ఇంతకు ముందు అద్వానీని తిట్టిపోసినవి మరియూ ఆయనని అనేక కేసుల్లో పెట్టి నానా తిప్పలు పెట్టినవి మరచినట్లు నటించి మోడీ నుండి అద్వానీని కిడ్నేప్ చేసేసారు. తన రధయాత్ర ద్వారా ...బిజేపికీ పార్లమెంటులో ఒక సీటు నుండి వందల సీట్ల వరకూ తెచ్చిన అద్వానీ గారిని... మొదట వాజపేయి తరవాత మోడీ నిర్లక్ష్యం చెయ్యటం ప్రతిపక్షాలకి బాగా కలిసివచ్చింది...



అయితే వడ్డీ వ్యాపారాలలో పేరొందిన గుజరాతు నుండి వచ్చిన మోడీ గారు తక్కువ తింటారా....అసలుతో పాటు వడ్డీ కూడా కాంగ్రెస్సు నుండి వసులు చెయ్యటం మొదలెట్టారు.... పాపం స్వాతంత్రం తరవాత కాంగ్రెస్సు వాళ్లకి తమకంటూ చెప్పుకోటానికి సరైన నాయకులు లేక అంతకు ముందు ఉన్న వాళ్ళతోనే ఏదో పబ్బం గడుపుకోస్తుంటే... వారి మీద మన మోదిగారికి కూడా కన్ను పడింది.... ముందరగా తమ రాష్ట్రానికే చెందిన ... కాంగ్రెస్సు వారు నిర్లలక్ష్యం చేసిన పటేల్ గారిని పైకి తెచ్చారు...అయితే, కాంగ్రెస్సు వారికి గాంధీ కుటుంబం కాని వారి మీద అంత ప్రేమ లేదు[వారు తమ పార్టీ వారు అయినప్పటికీ] కాబట్టి, పెద్దగా పట్టించుకోలేదు...

కానీ, మోదిగారు అక్కడతో ఆగుతారా...  వడ్డీ క్రింద స్వచ్చ భారత్  అని గాంధీగారిని కాంగ్రెస్సు నుండి వేరు చేస్తూనే ... స్వచ్చ భారత్‌కు  వాడే చిపిరి కట్టతో దిల్లోలోని ఆ గుర్తుగల పార్టిని ఊడ్చిపారేయ్యాలని నిర్ణయించుకున్నారు...(అయితే మోదిగారు పగ తిర్చుకోవాలిసినంత లెవెల్ ఈ చిపిరి పార్టీకీ లేదనుకోండి....)ఇక గాంధీగారి కిడ్నేప్ తరవాత... కాంగ్రెస్సు వారు గొప్పగా చెప్పుకునే నేహృని మడుకు ఎందుకు వదలాలి అని, ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక కాంగ్రెస్సులో మిగిలేది ఒక ఇందిరాగాంధీ మాత్రమే...మరో సంవత్సరంలో చక్రవడ్డి క్రింద ఆవిడని కూడా మోదిగారు లాగేసుకుంటారనుకోండి... ఇక్కడ  కొసమెరుపు ఏమంటే...కాంగ్రెస్సు వారు మోడీని తిట్టటానికి నెహ్రు జయంతిని వాడుకోవటం... తప్పదు మరి వారికి....!!! 





@@@@@@@@@@@@@@@@@@@
బొమ్మల కర్టేసి గూగుల్ 

@@@@@@@@@@@@@@@@@@@






@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

1] పార్టీ సభ్యత్వం అయిదేళ్ళ తరవాతే ఆ పార్టీ తరపున ఎన్నికల్లో నుంచునే అర్హత....
లాభం: పార్టీని నమ్ముకున్న వారికి గుర్తింపు...
గభాలున పార్టీ మారి మరో పార్టీ తరపున నుంచునే గోడ దాటు రాజకీయాలకి బ్రేక్...

2] పార్టీలో టిక్కెట్టు రాలేదని అలిగి ఇండిపెండెంటుగా నుంచునే
 బ్లాక్ మైయిల్ రాజకీయాలకి స్వస్తి.

3] ఇండిపెండెంటుగా నుంచుని ప్రభుత్వాలు ఏర్పరచేప్పుడు జరిగే బేరసారాలకి బ్రేక్....
మరియు ప్రబుత్వాల మీద పార్టీల పెత్తనం లేకుండా చెయ్యటం.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి