LOCAL WEATHER

16, మే 2013, గురువారం

బాల్య వివాహాలూ---వృద్ధ వివాహాలు.......అనే శుభ "లేఖ"......!!!!


ఈ మధ్య కాలంలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతుంటే కొందరు పెద్దలు పెద్దరికాన్ని భుజాన్న వేసుకొని వాటిని ఆపించినట్లుగా టివీలలో వార్తలు చూస్తున్నాము. అలా చెయ్యటంలో ఆ పెద్దలు   సామాజిక స్పృహ కలిగినట్లుగా,  తాము బాధ్యతాయుత పౌరులు అయినట్లుగా ప్రవర్తించి, ఈ ఒక్క విషయంలోనే,  అంటే ఆ పెళ్ళి ఆపించే వరకే పెద్దరికం వహిస్తున్నారు. మరి ఆ పెళ్ళి ఆగిపోయిన తరవాత ఆయా కుటుంబాల పరిస్థితి యేమిటీ, ఆ తరవాతి కాలంలో ఆ పిల్లలు పెద్దయిన తరవాత వారికే ఇచ్చి పెళ్ళి చేస్తున్నారా అనే అనేక విషయాల పట్ల ఈ పెద్దలకి పెద్ద పట్టింపు లేదు. కేవలం పెళ్ళి ఆపేవరకే పెద్దరికం.   

ఈ పెళ్ళీ వద్దు..... 

బాగానే ఉన్నది.... బాల్యవివాహాలు చట్టరీత్యానే కాక ఆరోగ్య రీత్యా మంచివి కావని మన యూరోపియన్లు చెప్పనే చెపారు. కాబట్టి, అది వారికే కరెక్టా... లేక మన సమాజంలో కూడా సరిగ్గానే ఉన్నదా లేదా అని ఆలోచించవలసిన పనిలేదు.....!!!! 

మరి,  వయసుకి ముందర పెళ్ళి చేసుకుంటే వచ్చే పరిస్థితులనీ, ఇబ్బందులనీ తెలుసుకొన్న పెద్దలు..... ఆ పెళ్లి వయసు వచ్చాక కూడా పెళ్ళిళ్ళు చేసుకోకుండా భటాచారుల్లాగా తిరిగే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, సామాజిక బాధ్యత మరియూ సామాజిక భద్రత దృష్ట్యా ఏమైనా చట్టం చేయిస్తే బాగుండేది కదా....!!! దీని గురించి పెళ్ళిళ్ళు ఆపే పెద్దమనుషులు కూడా ఎప్పుడూ ఆలోచించినట్లుగా కనపడటం లేదు.... 

ఎందుకంటే, బాల్య వివాహం వలన  ఏమైనా చెడు ఫలితాలుంటే అవి ఏ ఇద్దరైతే చిన్నప్పుడే పెళ్ళి చేసుకొన్నారో వారికి మాత్రమే  ఇబ్బందిని కలిగిస్తాయి.  కానీ, వయసు ముదిరినా పెళ్ళిళ్ళు చేసుకోకుండా సమాజంలో తిరిగే వారి వలన, వారికే కాకుండా సామాజిక సంభంధాల వికృతం గానూ, మరియూ మొత్తం సమాజానికే శాంతి భద్రతల సమస్యగానూ...కలిగిస్తున్నాయి. ఈ కోణంలో మన పెద్ద మనుషులు ఎందుకు ఆలోచించటంలేదో ఆ పెద్దమనుషులకే అర్ధం కావాలి....

 ఈ పెళ్ళీ వద్దు..... 

ఇదివరలో, ఓ వయసు రాగానే పెద్దలు వారికి వారిష్టం వచ్చిన సంబంధాలని చూసి పెళ్ళిళ్ళు చేసిపారేసే వారు. ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి... బాల్య వివాహాలు అనగానే కన్యాశుల్కంలో చిన్న పిల్లని ఓ ముసలతనికి కట్టబెట్టటమే అనుకోవఖర్లేదు. అలా జరిగినవి చాలా తక్కువనే చెప్పుకోవాలి.   

విషయంలోనికి వస్తే.... ఇప్పుడు పెద్దలు పెళ్ళీ అనగానే, పెరిగిన పిల్లలలో కొందరు అప్పుడే పెళ్ళా... కొంతైనా జీవితంలో "ఎంజాయ్" చెయ్యకుండానే... అని అనేస్తున్నారు.... ఇంతకీ ఎంజాయ్ చెయ్యటం అంటే ఏమిటో వారికే తెలియాలి...!!!  మరికొందరు... అప్పుడే పెళ్ళా... ఇంకా జీవతంలో సెటిల్ కాకుండానే...ఎంత సంపాయిస్తే సెటిల్ అయినట్లో.....!!! ఇక మరికొందరు పెళ్ళిళ్ళకి సిద్ధంగానే ఉన్నప్పటికీ, వారి కుటుంబ పరిస్థితి  దృష్ట్యా వారికి పెళ్ళియోగం ఉండదు... అంటే పెళ్ళి కావాలిసిన పైన పెద్దవారు ఉండటం... లేదా పెళ్ళి కావాలిసిన వారి సంపాదన మీదే ఆ కుటుంబం ఆధారపడి ఉండటంతో వారికి పెళ్ళి చేస్తే కుటుంబం గడవదనే భయం..... ముఖ్యంగా ఇది ఉద్యోగం చేసే ఆడవారి మీదే ఎక్కువ దుష్‌ప్రభావం చూపుతోంది. పాపం నోరు తెరిచి నాకు పెళ్ళి చెయ్యండీ అని అడగలేరు. తెచ్చిన జీతమంతా తల్లిదండ్రుల చేతిలోనే పోస్తారు.. అబ్బయిలకి ఉన్నట్లుగా స్వంత ఖర్చులు కూడా ఎక్కువ ఏమీ ఉండవు... ఈ విధంగా ఉద్యోగం చెయ్యటం వల్లనే పెళ్ళి కాకుండా ఉన్న వారు ఎందరో....  

ఇలాంటి కారణాలతో, కొన్ని సంవత్సరాలు గడిచిన తరవాత ఏ 30 యేళ్ళకో 35 యేళ్ళకో పెళ్ళి చేసుకుంటే, వారు తమ జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చెయ్యగలరా...??? మైండు మెట్యూరిటీ దాటి, స్వంతంగా తమ పరిధిని తామే గిరి గీసుకొని బ్రతుకుతున్న వారు, ఆ వయసులో పెళ్ళిళ్ళు చేసుకొని, తమ స్వంత పరిధిలోనికి ఇతరులని...మొగుడిని కానీ, పెళ్ళాన్ని కానీ రానిస్తారా...??? వారిద్దరూ ఎవరి దారిన వారు ఆలోచించటానికి అలవాటు పడిపోయిన తరవాత పెళ్ళి చేసుకొని సవ్యంగా కాపురాలు చెయ్యగలరా... ఎందుకంటే ఇదివరలో చేసుకొన్న బాల్య వివాహాల వలన సర్దుకుపోవాలిసిన పరిస్థితి ఉన్నదన్నప్పుడూ... అదే పరిస్థితి ఈ వృద్ధ వివాహాలలోనూ ఉంటుంది కదా....ఈ విధంగా 30 వయసు దాటిన పెళ్ళిళ్ళు సమాజానికి మంచిదా....???

ఇకపోతే, వయసు దాటి పెళ్ళుళ్ళు చేసుకొనే వారికి పిల్లలు పుట్టే విషయంలోనూ ప్రమాదకరమైన పరిస్థితులే ఉంటాయి... డాక్టర్లు చెప్పిన దానిపట్టి 18 యేళ్ళ వయసుకి ముందర ప్రెగ్నెన్సీ రావటం ఎంత ప్రమాదకరమో... అలాగే 30, 35 యేళ్ళ వయసు తరవాత ప్రెగ్నెన్సీ రావటం కూడా అంతే ప్రమాదం... 

అంతే కాదు, ఆ వయసులో పిల్లలు పుడితే... ఈ భార్యా భర్తల తల్లిదండ్రులకి[అత్తా మామలకి]తగిన ఓపిక ఉండకపోవచ్చునూ... లేక అసలు వారే ఉండకపోవచ్చును... కాబట్టి తమ పిల్లలని చూసే పెద్ద దిక్కు లేక, ఇద్దరూ ఉద్యోగాలు చేసి, పిల్లలని "పిల్లల ఆశ్రమంలో[BABY CARE CENTER]" ఉంచి పెంచితే, ఆ పెరిగిన పిల్లలు సమాజానికి ఏ మాత్రం బాధ్యతగా  ఉంటారో చెప్పలేము.... ఎందుకంటే, ఇదివరలో స్వంత తల్లిదండ్రుల దగ్గిర పెరిగిన వారే సమాజంలో వస్తున్న మార్పులకి లోనై, బాధ్యతా రాహిత్యంగా ఉంటుంటే... అసలు తల్లిదండ్రుల దగ్గరే పెరగని, వారి మనస్థత్వం వలన....  సమాజంలో ఒక బాధ్యత అనేది ఉంటుందా...?? పిల్లల ఆశ్రమంలో పెరిగిన పిల్లలు, పెరిగి పెద్దై తమ తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో చేర్చ కుండా ఉంటారా...??? 


ఈ పెళ్ళే ముద్దు... 

కాబట్టి, బాల్యవివాహాలు ఆపే ఓ పెద్ద మనుషులారా....ఆ బాధ్యతతో బాటే వయసు వచ్చినా పెళ్ళికాని వారి పెళ్ళిళ్ళు చేసే బాధ్యతని కూడా.....  మంచి పౌరుల్లా మీద వేసుకోండి... వారితో బాటూ తల్లిదండ్రులూ... ముఖ్యంగా కొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దామనుకొనే పిల్లలూ ఆలోచించండి... కెరీర్ లో   డబ్బు ఎంత ప్రధానమో... మన జీవితంలో "కాలం" కూడా అంతే ప్రధానం.... డబ్బుని కావాలంటే 50 యేళ్ళు వచ్చాక కూడా సంపాయించ వచ్చును. కానీ, సమాజంలో మనం బాధ్యతగా మన పిల్లలని పెంచాలంటే...అంటే  ఆ పిల్లలకి  ఉద్యోగం వచ్చి, వారికి పెళ్ళి చేసే వరకూ మనం ఉండాలంటే...  సకాలంలో పెళ్ళి చేసుకొని సకాలంలో పిల్లలని కనటం కూడా కెరీర్‌లో భాగమే అని తెలుసుకోవాలి....డబ్బు కెరీర్ కి సంబంధించినది అయితే...... పెళ్లి అనేది కాలానికి సంబంధించినది. పోయిన డబ్బుని సంపాయించు కావచ్చును కానీ........ జరిగిన కాలం తిరిగి రాదు .....


**********************

 @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@ 
 @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@ 


ఈ మధ్యన ఓ పెళ్ళికి మచిలీపట్టణం వెళ్లాను.. ఆ పెళ్ళిలో  సన్నాయి వాయిద్యం వాయించే వాళ్ళు 
ఎంతో చక్కగా వాయించారు... ఈ సందర్భంగా మీరూ విని ఆనందించండి .... 
ఏ దివిలో విరిసిన పారిజాతమో....... 





శుభం






   ఇందులోని బొమ్మలన్నీ గూగుల్ లోనివే 


************************************************************************************************************

ఇంతకు ముందు వేసిన పోస్ట్ 



ఆవకాయ చెయ్యటం ఎలాగు...???





************************************************************************************************************




తెలుగు అక్షరాలు    అ ఆ....వ్రాయాలని సరదా ఉంటే, వ్రాయటానికి ప్రయత్నించండి..... అన్నీ ఓ క్రమంలో వచ్చాయో లేదో ఈ క్రిందికి[bottom లోనికి]వెళ్లి అక్షరమాలలో సరి చూసుకోండి.   




2 కామెంట్‌లు:

  1. బాల్య వివాహాల గురించి చట్టంలో ఉన్న విషయం ఏమంటే, బాల్య వివాహం చెయ్యటం, చేయటానికి సహకరించటం నేరం. కాని అధికారులు అక్కడకు వెళ్ళేప్పటికి ఆ బాల్య వివాహం జరిగిపోయి ఉంటె, ఆ పెళ్ళి చట్టబధ్ధమే! అందుకని సామాజిక కార్యకర్తలుగా తమను తాము నియమించుకున్నవారు, ఈ వివాహాలను ఆపటానికి హడావిడి చేసి, మీడియాలో వచ్చేట్టు చేసి ఆపటానికి ప్రయత్నిస్తారు. ఇది చూశన్నా మరి కొంతమంది ఈ పనికి పూనుకోకుండా ఉండటానికి. బాల్య వివాహం కనుక జరిగిపోయి ఉంటె ఆ పెళ్ళి చెల్లుబాటు అవుతుందని ఆ చట్టంలో ఎందుకు ఉండనిచ్చారు అంటె, ఒక్కటే జవాబు. మతాచారాలను పూర్తిగా అడ్డుకునే సాహసం చెయ్యలేక, కొంతవరకూ అడ్డుకోవటనికి అదికారులకు చట్టబధ్ధత కలిపించి, ఈ బాల్య వివాహ వ్యవస్థకు అడ్డుకట్ట వేశే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. చాలావరకూ సఫలీకృతం అయ్యిందనే చెప్పవచ్చు. అక్కడక్కడా చెదురుమదురుగా ఇంకా అలా జరిపే ప్రయత్నాలే కాని, మన తాతల కాలంలో లాగా ఇప్పుడు జరగటంలేదు.

    ఇక ముదిరిపోతున్న బెండకాయలు అనేది మన సామాజిక వ్యవస్థలో మరో వికారం. డబ్బు యావలోనో, జాతకాల పిచ్చలో పడో పెళ్ళిళ్ళు సంవత్సరాలకు సంవత్సరాలు వాయిదా వేసుకునే వారి సంఖ్య బాగానే పెరుగుతున్నది. స్వార్ధపరులు, మొండి వాళ్ళు పూర్తి మూఢులు అయిన కొంతమంది తల్లి తండ్రుల బాధ్యత కూడా ఈ విషయంలో ఉన్నది. అలాంటి తల్లి తండ్రులను మార్చటానికి ఈ సామజిక కార్యకర్తలు వాళ్ళకు నచ్చ చెప్పే ప్రయత్నాలు చేస్తే బాగానే ఉంటుంది. కాని కుటుంబ విషయాల్లో మరొకరు చొరబడటానికి ఎవరు మాత్రం ఒప్పుకుంటారు. బాల్య వివాహాలు చేయటం నేరమన్న ఒక చట్టం ఉండబట్టి, ఎవరన్నా వెళ్ళి అలా ఆపటానికి అవకాశం ఉండి ఆ దురాచారం దాదాపుగా వెనుకబడింది.

    పెళ్ళి అనేది పూర్తిగా వ్యక్తిగతమైన విషయం ఈ విషయంలో ఇలా చెయ్యండి ఇలా చెయ్యద్దు అని వేరే వారు శాసించే అవకాశం తక్కువ, ఉండకూడదు కూడా. చట్ట బధ్ధం కానిది ఆపే ప్రయత్నం ఎవరన్నా చెయ్యగలరు కాని, వ్యక్తిగతమైన వివాహ నిర్ణయాన్ని ఎవరిమీదా ఒత్తిడి తీసుకు వచ్చి వారిని వారి పెరిగిపోతున్న వయస్సు చూపి పెళ్ళి చేసుకునే దిశగా నడపటం కష్టమైన విషయం. ఎవరి కారణాలు వాళ్ళకి ఉంటాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళకు సహజంగా సరిగ్గానే అనిపిస్తాయి. ఒకరి మాటలు మరొకరు వినేట్టుగా ఉన్నారా ఈ నాటి ప్రజలు!! ఎవరి నిర్ణయాలకు వాళ్ళే బాధ్యులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవలిసి వస్తుంది అంతే. అలా లేటు పెళ్ళిళ్ళ వల్ల జరిగే అనర్ధాలు చూసిన రాబొయ్యే తరం, సరైన సమయాలకు పెళ్ళిళ్ళు చేసుకుంటే మంచిది, అని చూసి నేర్చుకునే అవకాశం లేకపోలేదు.

    రిప్లయితొలగించండి
  2. SIVARAMAPRASAD KAPPAGANTU గారు మంచిగా చెప్పారు. అయితే, వృద్ద వివాహాల వలన సమాజం మీద చెడు ప్రభావం పడి, ఆ తర్వాతే మారే కన్నా... కాస్త ముందుగా మేల్కొంటే మంచిదని నా అభిప్రాయం... పెళ్లి అనేది కుటుంబ వ్యవహారమే అయినప్పటికీ బాల్య వివాహాల మిద చట్టం వచ్చినట్లుగా, ఈ ఆలస్య వివాహాల మిద కూడా ఏదైనా చర్యలు తీసుకొంటే బాగుంటుంది. 20, 30 ఏళ్ళ మధ్య వారు వివాహాలు చేసుకోనేట్లుగా ఏదైనా ప్రోత్సాహం కల్పించితే......అది చట్టం చేసే వరకు రాకుండా చెయ్య వచ్చును. ఏది ఏమైనా స్వంత వ్యవహారాలూ సమాజం మీద చెడు ప్రభావం చూపిస్తున్నప్పుడు, అది బాగా ముదరక ముందే దానికి తగిన మందు వేస్తే మంచిది. చేతులు పూర్తిగా కాలకముందే ఆకులని వాడితే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి