LOCAL WEATHER

26, మే 2013, ఆదివారం

వీరికే మానవహక్కులు లేవా....??????

మానవ హక్కులు అనగానే సామాన్యంగా దొంగలవో, లేక రోడ్లు రైళ్ళు పేల్చేసే వారివో  అనుకునేరు..... కానేకాదు............ ఈ క్రింది విడియో చూడండి. ఈ ప్రజలు  "ఏం పాపం చేసు'కొన్నారు"........... 


ఏం వీరెవరు టిక్కెట్టు కొనలేదా.......???  లేక ఏదైనా ప్రాంతంలో ప్రమాదం వచ్చి ఒక్కసారిగా రైల్వేవారు ఊహించని విధంగా వచ్చి పడిన ప్రయాణీకులా .....???  కానే కాదు... ప్రతీ  రోజు గోదావరి ఎక్స్ ప్రెస్ లో ఇదే తంతు ...... ఈ కనిపించే విడియోలో జనం గోదావరి ఎక్స్ ప్రెస్ విశాఖలో బయలుదేరేప్పటికే ఉన్నవారే......... మరి తరవాత స్టేషన్లో ఎక్కేవారి గతి ఏమిటి.... ? రోజూ ఇంత రద్దీ ఉన్నప్పటికీ మన భారతీయ రైల్వేవారు ఎంతమాత్రం దయచూపరు... ఉన్నవి మూడున్నర బోగిలైనా అమ్మే జనరల్ టిక్కెట్లు  వేలల్లో ఉంటాయి... టిక్కెట్లు అమ్మేప్పుడు బోగీలు ఖాళీగాలేవని తెలియదా;  లేక భారతీయ సామాన్య మానవులకి హక్కులేవి లేవని వీరి ఉద్దేశమా.... ??? ఓ మానవ హక్కుల సంఘాలవారు మీరే చెప్పాలి.... !!!! లేక వీరు కనీస మానవ హక్కులకి నోచుకోక రైలులో లేట్రిన్ల దగ్గర ప్రయాణిస్తున్నారా...????

కేవలం ఈ ఒక్క రైలే కాదు.... దరిదాపులు అన్ని రైళ్లలోని జనరల్ బోగిల పరిస్థితి ఇంతే.... ఈ విషయమై ఒక టీటీఇ  "మీరు కావాలని ఎక్కితే మేమేమి చెయ్యగలం" అని అనేశాడు........ పైగా ఆర్టిసి బస్సులో ఇదే విధంగా ఎక్కటం లేదా అని ఎదురు ప్రశ్నించి, తమ తప్పుని కప్పెట్టుకోవాలని చూశాడు....  నిజమే ఎక్కుతాం;  కానీ, ఆ బస్సులో మహా అయితే ప్రయాణం చేసేది కొద్ది దూరం మాత్రమే, రైలులో లాగా వందల కిలోమీటర్లు ప్రయాణం చెయ్యము........ అదీ రాత్రి పూట...........అని ఒక ప్రయాణికుడు అన్నాడు..... ఇంకో విషయం కూడా వున్నది ...... బస్సులో ఎక్కిన తరవాత టిక్కెట్టు తీసుకోవచ్చును......... అది మన ఇష్టం మీద ఆధార పడి ఉంటుంది....... కాని రైలులో టిక్కెట్టు కొన్నాకే....  రైలు వొస్తే కాని పరిస్థితి తెలియదు, అని గడ్డి పెట్టాడు మరో ప్రయాణికుడు. 

ఎంత గడ్డిపెడితే మాత్రం ప్రయోజనం ఏమున్నది కనుక అధికారులలో ....... ఎప్పటికీ  జరుగుతున్న తప్పుని సమర్ధించుకోవటమే తప్ప,  ఆ తప్పు భవిష్యత్తులో సరిదిద్దుకోవాలి అనే జ్ఞానం లేనప్పుడు.... సామాన్యు మానవుల హక్కులు ఇలానే త్రొక్కివేస్తుంటే ... అడిగే నాధుడు లేనప్పుడు....!!!   ఆ ... ఆ...   ఎంఎల్ఏలు, ఎంపీల గురించి అడగకండి .... పాపం వారు , వారి వారి  "వ్యాపారాలో" బిజీగా ఉన్నారు... వారినెందుకు డిస్ట్రబ్ చెయ్యటమ్.... !!!

******************************************
 ******************************************

5 కామెంట్‌లు:

  1. వీరికే మానవహక్కులు లేవా

    మీరు మానవ హక్కులు అనేప్పటికి నిన్న చత్తీస్‌ఘడ్ లో జరిగినది టి వి ల్లో చూసి ఆవేశం ఏమన్నా వ్రాశేసారో అని తల్లడిల్లిపోతూ పరుగు పరుగున వచ్చి చదివాను. ఇంతా చేసి ఇదా! మానవ హక్కులు ఎవరికున్నాయో తేల్చి చెప్పాల్సిన వారు వేరే ఉన్నారు కామ్రేడ్. వారు వాళ్ళ దృష్టిలో మానవులనుకునుకునేవారికి ఏమన్నా అపకారం జరిగినా జరగబోతుందని వారికి అనిపించినా ఆగం చేస్తారు కాని, ఇలాంటి వాటి చలింపరు గాక చలింపరు కామ్రేడ్.

    రిప్లయితొలగించండి
  2. Indian Railways is even cheating middle class people by refusing to allow waitlisted ticket holders to board reserved coaches. In past, I did frequent travels from Srikakulam Road to Rayagada by Hirakhand express and Puri-Ahmedabad express. Ahmedabad express often shows status as waiting list if we check the availability on internet. If we board the train, especially AC coaches, we can find some vacant berths. Ladies quota and free pass quota berths cannot be booked by general quota passengers. So, some berths are found vacant even if WL status is shown on website. Indian Railways is giving priority to free pass holders over those passengers who pay money.

    రిప్లయితొలగించండి
  3. And also read the comments here about India Railways:
    http://m.facebook.com/photo.php?fbid=194917093992887&id=100004237920347&set=a.100318773452720.782.100004237920347&comment_id=300732&offset=0&total_comments=6&refid=48

    రిప్లయితొలగించండి
  4. SIVARAMAPRASAD KAPPAGANTU గారు, Praveen Nakkavanipalem గారు, పల్లా కొండల రావు గారు స్పందించినందుకు ధన్యవాదాలు.

    లేదు శివాగారు...రాజకీయ నాయకు హక్కుల గురించి కాదు. వారి గురించి మాట్లాడటానికి బోలెడు సంస్థలు మరియు టివీలు ఉన్నాయి...సామాన్య ప్రజల హక్కులు గురించి అడిగేవారు లేక మన దేశంలోని బ్యురోక్రాట్స్ చేస్తున్న అరాచక పర్వం గురించే ప్రస్తావించాను. అందులోనూ భారతీయ రైల్వే వారికి రాష్ట్ర ప్రజలంటే ఎదో సామంత రాజ్య ప్రజల క్రింద లెక్కగా ఉన్నది.

    Praveen Nakkavanipalem గారు, కేవలం రిజర్వేషనే కాదు, విజయనగరం రాయపూర్ మార్గంలో జనరల్ బోగిల్లో కట్టెపుల్లలు, ఆయిల్ డబ్బాలు, అనేక సరుకుల బస్తాలు ఒరిస్సాకి విచ్చల విడిగా రవాణా అవుతుంటాయి. పైగా ఈ సరుకులని దించుకోవటానికి వీలుగా ద్వారం దగ్గరే పేరుస్తారు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా దిగటానికి కూడా చోటు వుండదు. అటు వచ్చిన రైల్వే అధికారులు వాటిని చూసి చూడనట్లుగా వ్యవహరిస్తారు. రైల్వే వారి ప్రతాపం అంతా సామాన్య ప్రయాణికుల దగ్గరే.....ఇదే పరిస్థితి ప్రకాశం జిల్లా గిద్దలూరు, కర్నూలు జిల్లా నంద్యాల మార్గంలో కూడా ఉన్నది. కొందరు రైల్వే అధికారులు పైడబ్బులు కోసం కక్కుర్తి పడటం వల్లనే ఇలా జరుగుతోంది.



    రిప్లయితొలగించండి