LOCAL WEATHER

5, జూన్ 2013, బుధవారం

హైదరాబాదు చిన్న చేప మందా..?? కార్పోరేట్ పెద్ద చేప మందా......???

హైదరాబాదు చేప మందు....

ఎండాకాలం ముగుస్తోందంటే టీవీలలో ఒకటే గోల "చేప మందు విశ్వసనీయత ఏమిటీ" అని జన విజ్ఞాన వేదికవారు అడుగుతున్నారని.... ఇంతకీ చేప మందు ఏమిటీ, దాని మీద జనవిజ్ఞాన వేదిక వారికి కోపం ఎందుకూ...????

మృగశిరా కార్తె ప్రవేశించే రోజు చిన్న చేప పిల్ల నోట్లో "ఎదో మందును" బత్తిన సోదరులు అనబడే వారు పెట్టి ఇవ్వటం.....ఆ వంశం వారే స్వయంగా నోట్లో వెయ్యటం 100 ఏళ్ళపైగా సాగుతోంది. ఈ మందు వేసుకొంటే ఉబ్బసం తగ్గు[తుందనీ]తోందని ప్రజలలో నమ్మకం పెరిగి,  ప్రజల నుండీ దీనికి విపరీత స్పందన రావటంతో,  ప్రభుత్వమే దీనికి ఏర్పాట్లు చేస్తోంది.... ఇలా జరుగుతుండగా అసలు ఈ చేప మందేమిటీ, ఇది వేసుకుంటే నిజంగా తగ్గుతుందా అని మాములుగా చేప పిల్లలని నోట్లో వేసుకొని గుటుక్కున మింగేసే వారెవ్వరికీ కలగని ఓ అనుమానం మన జన విజ్ఞానవేదిక వారికి మాత్రమే కలిగింది....!!!

జనవిజ్ఞాన వేదిక అంటే ఎవరూ....ఇందాక చేప మందును గురించి సంక్షిప్తంగా తెలుసుకున్నాము కదా...!!! అలాగే జన విజ్ఞాన వేదిక వారంటే........ హిందువులూ మరియూ ముస్లీంస్‌లకు చెందిన ప్రజలని అజ్ఞానం బారిన పడకుండా, వారిని రక్షించి........ విజ్ఞానులుగా చేసేవారే జనవిజ్ఞాన వేదికవారు. వీరు మనం పైన చెప్పుకున్న వారి పండగలు, ముఖ్యంగా హిందువుల పండగలు వచ్చినప్పుడు మాత్రం టీవీలలో నవ్వుతూ కనపడి, ఆ పండగలలో ఉన్న విశ్వసనీయత గురించీ, శాస్త్ర విజ్ఞానం గురించీ చీల్చి చెండాడి...ప్రజలు ఆ పండగలు చేసుకో రాదని జ్ఞానం కలిగిస్తూ ఉంటారు. కాషాయం పంచలు కట్టుకున్న స్వామీజీలనీ  పట్టుకుంటారు... లేత ఆకుపచ్చ పచ్చ లాల్చీ స్వామీజీలనూ పట్టుకుంటారు.....కానీ, ఎందుకనో పేంటూ షర్టూ, కోట్లూ తొడుక్కున్న స్వామీజీల ఊసే ఎత్తరు...వారు కేవలం తమ ప్రార్ధనలతోనే అన్నీ రోగాలనీ తగ్గించేయ్యటం బహుశా శాస్త్రీయమేమో....మనకి తెలియదు....!!!

పేరు తెలుగులో లేకపోతేనే  శాస్త్రీయమా....బొమ్మల మిక్సింగు కేఆర్కే 

ఇంతకీ శాస్త్రీయత అంటే ఏమిటీ.....?? మందార పువ్వుని మందారం అంటే తప్పు...దాని శాస్త్రీయ నామం "Hibiscus rosa-sinensis"  అని అంటేనే శాస్త్రీయమైనదని[??]గాఠిగా నమ్మేవారే జన విజ్ఞాన వేదికవారు. లేదు... అది గ్రీకో లేక లాటిన్  వారు అలా పిలుస్తారు..అది వారి శాస్త్రీయ నామం.. దీనినే మందారం అని తెలుగు వారు అంటారు...ఇది తెలుగు శాస్త్రీయ నామం అని ఎవరైనా అజ్ఞానులు అడిగితే, అసలు తెలుగే అశాస్త్రీయమైనదని వాదిస్తారు నవ్వుతూ....!!!   వీరి నవ్వు వెనుక ఉన్న రహశ్యమేమిటో ఆ పైన వాడికే తెలియాలి....!!! తమకి అర్ధం అయితేనే శాస్త్రం, లేకపోతే కాదు...!!!  మరియూ, దేశీయ మందులైన ఆయుర్వేదం, యునానీ లాంటి శాస్త్రీయత లేని[?] వైద్యాలని నమ్మరు...ఇవి వేల సంవత్సరాల నుండీ మన దేశంలోని అనేక కోట్లమందిని బ్రతికిస్తున్నప్పటికీ.... ఇక ఈ మందులలో సైన్సు లేదనీ, కేవలం ఇంగ్లీషు కెమికల్ మందులలోనే సైన్సు ఉన్నదని వీరి వాదన... వీరికి నమ్మకానికి శాస్త్రనికీ{సైన్సుకీ} తేడా తెలియదు. నమ్మకానికి ఆధారం ఉంటేనే శాస్త్రమని వీరి  "నమ్మకం". మన పూర్వీకులు కూడా ఆధారాలు లేనివన్నీ శాస్త్రం కాదని అనివుంటే ఇప్పుడీ సైన్సు[శాస్త్రం] ఇంత అబివృధి చెందేది కాదని ఈ సంకుచిత సైన్సు వారికి  తెలియదు......
     
విషయంలోనికి వెళితే.....నిజమే, చేప మందు మీద ఈ అనుమానం కలగవలసిందే...ఈ మందు వలన అసలు రోగం తగ్గుతోందా...? ఇన్ని లక్షల మంది ఈ మందు కొసం ఎందుకు వస్తున్నారు...?? ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు వస్తున్నారు...???ఈ మందులో ఏవేవి ఉబ్బసాన్ని తగ్గించేవి ఉన్నాయి...??? ఈ మందులు ఏ జాతికి చెందినవి...ఆయుర్వేదమా...లేక రసాయనాలా..లేక అసలు ఏ మందూ లేకుండానే ఏదో ఒక ఉండని చేప పిల్ల నోట్లో పెట్టి వేస్తున్నారా....??? ఇలా అనేక అనేక అనుమానాలు ఉన్నాయి....

కొన్ని ఇంగ్లిషు ఆసుపత్రుల చేపలకి మందు.........బొమ్మల మిక్సింగు కేఆర్కే  

అవును,  ఇన్ని అనుమానాలు ఉండాలిసిందే...కానీ కేవలం ఈ బత్తిన సోదరుల ఎప్పుడో సీజన్‌లో ఒకరోజు వేసే చేపమందు మీద మాత్రమే ఇంత అనుమానం ఎందుకూ.... సంవత్సరం పొడవునా అనేక కార్పోరేట్ ఆసుపత్రులలో విపరీతమైన మందులూ, అక్కర్లేని ఆపరేషన్లు జరుగుతున్నప్పుడూ...[?] శవాలకి వైద్య చేసిన సందర్భాలలో ఈ విజ్ఞాన చైతన్యం ఉన్న వారికి ఎందుకు రాదు అనుమానం...??? కార్పోరేట్ ఆసుపత్రులలో ముఖ్యంగా హార్టు జబ్బులు లాంటి పెద్ద పెద్ద జబ్బుల విభాగంలో అయితే...ఇంటెన్సివ్ కేర్ పేరుతో పేషంటుని వారి బంధువులకి కనపడనీయ కుండా దాచిపెట్టీ, వంటినిండా బోలెడు కనెక్షన్లూ పెట్టీ, నోటిలో ఓ గొట్టాన్ని పెట్టీ[వెంటిలేటర్] భయానక వాతావరణాన్ని కలిగించి..."ప్రాణం" అనే మాటతో బ్లాక్ మేల్ చేస్తూ ఉండటం...

పైగా గంట గంటకీ వేలాది రూపాయల మందులూ, టాబ్లెట్టులూ, కేప్సిల్సూ సంచీలకి సంచీలు వారి మెడికల్ షాపులోనే  కొనిపిస్తారు...మరి నోటిలో గొట్టం పెట్టిన పేషంటుకి అన్ని రకాల మందులని గంటలో ఎలా వేస్తారో మన సైన్సు విజ్ఞానులకే తెలియాలి...అవేవో ఇంజెక్షన్లూ లేక సిలైన్లలాగా ఎక్కించెవో అయితే అనుమానం రాకపోను...కానీ వారు కొనిపించే సంచీలకి సంచీల మందులు నోటి ద్వారా వేసేవే అవుతున్నాయి.....!!!  పైగా,  ఈ సంచీలు మూట విప్పాకుండానే మరల వారి మెడికల్ షాపులకే వెనుక నుండి వెళ్ళే సంఘటనలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ అడిగే దిక్కు ఉండదు......కాకపొతే ఈ మధ్యనే పేషంట్ల బంధువులకి పేషన్సు తగ్గి బల్లలూ, అద్దాలు వీలైతే కొందరు సిబ్బందిని చితగోట్టిన సంఘటనలు జరుగుతున్నాయే కాని.......ఇలాంటి వాటి మీద మన సైన్సు ప్రముఖులు మీడియాలో చేరి రచ్చ చెయ్యటం కనపడదు........

సరే, తప్పుని తప్పుకి ఎర వెయ్యకుండా, పక్షపాతం లేకుండా ఆలోచించి చూద్దాము.... చేపమందు వలన ప్రజలకి అనవసరమైన అనారోగ్యం ఏదైనా వస్తోందా....? అనవసరమైన డబ్బు ఖర్చును చేప మందువారు చేయిస్తున్నారా...?? ఇంతవరకూ అయితే అటువంటివేవీ కనపడలేదు... ఇక ఆ మందు లోపల ఉబ్బసం తగ్గే మందులు ఏవి ఉన్నాయి..?? ఈ విషయాన్ని చేప మందువారు రహస్యం అంటున్నారు...   అవునూ, ఇదే విషయాన్ని ఏ అమెరికన్నో, జర్మనీ మందుల గురించి, ఆయా కంపనీ వారిని అడిగినా రహస్యం అనే చెపుతారు... ఎవరి మందుల రహస్యం వారిది.  సరే, ఈ చేప మందు వలన మంచి జరగకపోయినా చెడు జరగకపోతే ఇబ్బంది ఏవున్నదీ... ఇంతకీ ఆ చేపమందు వేసుకొనే వారిని మందు పనిచేస్తోందా లేదా అని రిసెర్చి చేసారా ..??? లేదు. పోనీ, ఈ మందును వేసుకొనే వారవరైనా కోర్టులకి వెళ్ళారా....???? లేదు. మరి, ఎంతో దూరాల నుండీ వచ్చే వారికి లేని శ్రమ, మరొకరికి ఎందుకూ...???

ఇకపోతే, బత్తిన సోదరులు ఏమి సేవ చేస్తున్నారో తెలియదు కానీ, ఈ విజ్ఞానులు మాత్రం వచ్చిన జనాలకి ప్రభుత్వం సౌకర్యాలు కల్పించటంపై కోర్టులకి వెళుతున్నారు...!!! ఎక్కువ మంది జనం వచ్చినప్పుడు వారికి సౌకర్యాలు కల్పించటం, శాంత్రి భద్రతల సమస్యలు రాకుండా చూడటం, ఆ జనం తొక్కిసలాడకుండా వారు నిలబడేందుకు ఒక ప్రదేశాన్ని చూడటం..ఇంతెందుకూ ఆ జనాలకి ప్రభుత్వం వారు సౌకర్యాలని కల్పించటమే నేరమని మన అమొఘమైన తెలివీ విజ్ఞానం కలిగిన పౌరుల ఉద్దేశం....!!! 

ఎవరిదీ మూర్ఖత్వం....??? ప్రజలకి సౌకర్యాలని కల్పించే వారిదా...? లేక... ఎంతమంది జనం వచ్చినా వారిని అసలు పట్టించుకోవద్దనేవారిదా...??? నిజంగా ప్రజా ధనం మీద శ్రద్ద ఉన్నట్లయితే....ప్రజల సౌకర్యాలకే  వెచ్చించే ప్రజా ధనం గురించి కాదు..........అనేకమంది రాజకీయ నాయకులకి ఇచ్చిన అనవసర కాపలాలు, సౌకర్యాల మీద ఖర్చు పెట్టే  ప్రజా ధనం గురించి  కోర్టుకి వెళితే బాగుంటుంది.........

చేపమందును పనికిమాలినిదిగా ఎవరు ఋజువు చెయ్యగలరూ...??? ఆ చేపమందు వేసుకొనే వారిని మందు పనిచేస్తోందా లేదా అని అడిగారా...???లేదు.అడగరు....అదేమిటో వీరికి తెలియదు......అర్ధంకాదు....వీరికి అర్ధం అయితేనే అది శాస్త్రీయమైన మందు....అంతే. వీరు సీతయ్యలు.... ఇంతకీ వీరిలో ఎంతమందికి శాస్త్రీయ జ్ఞానం ఉన్నది........ ఒకసారి ఓ టివీలో జ్యోతిష్యం చెందిన ఓ పెద్దాయనను వీరు ప్రశ్నించబోయారు.....అప్పుడు ఆ పెద్దాయన..."బాబూ మీలొ ఎవరైనా జ్యోతిష్య శాస్త్రం చదివిన వారి ప్రశ్నలకే జవాబు చెపుతాను"  అన్నారు. దానితో తెల్లమొహం వేశారు ఈ సైన్సు పెద్దలు. ఈ విధంగా  వారు కలగాజేసుకోబోయే విషయంపై అవగాహనే లేని వ్యక్తులు విపరీతమైన ప్రశ్నలు వేస్తున్నారు....

ఇక్కడ ఇంకోవిషయం....
 మన భారతీయ వ్యవస్థలో కొన్ని మందులు వంశపారంపర్యంగా వస్తున్నాయి....
వాటి వివరాలని ఆ కుటుంబం వారు ఎవరికీ చెప్పరు. అలా చెపితే పనిచెయ్యదని వారి నమ్మకం. ఉదాహరణకి...ఎవరికైనా కామెర్లు[జాండిస్]వస్తే దానికి 
ఇంగ్లిషు మందులు కనుక వాడటం మొదలు పెడితే, వారికి ప్రాణ గండం ఉన్నట్లే లెక్క.. ఎందుకంటే, ఆ మందుల ద్వారా తగ్గేటప్పటికి చాలా ఆలస్యం అవుతుంది...మరి ఇదే కామెర్లకి వంశపారంపర్యంగా మందులు ఇచ్చే వారు ప్రతీ ఊళ్ళో ఉన్నారు. వారు కనుక వారి పద్ధతిలో రెండు రోజుల నుండీ అయిదు రోజుల వరకూ ఎవో కొన్ని చిన్ని ఉండలు మందుగా ఇస్తారు... అంతే, కామెర్లు ఇట్టే తగ్గిపోతాయి. ఆశ్చర్యకరమైన విషయమేమంటే, 
ఇలా కామెర్లకి మందులు ఇచ్చేవారెవరూ కనీసం ఆయుర్వేద డాక్టర్లు కూడా కాదు... కానీ వారి వైద్యం వలన కామెర్లు తగ్గుతాయి. ఆ మందులో ఏమి కలుపుతున్నారని అడిగితే వారు చెప్పరు..అది వంశపారంపర్యమనీ, వారి కుటుంబంలో వారికి మాత్రమే తెలియాలనీ చెపుతారు. ఇలాంటి మందులు మన దేశంలో బోలెడున్నాయి. అలాగే ఈ చేపమందు వలన కూడా తగ్గుతుందేమో....ఈ చేప మందు వలన ఇంగ్లిషు మందులులాగా ఆర్ధిక భారం, ప్రాణ భయం లేనప్పుడు  
ఈ చేప మందు మీద మాత్రమే ఎందుకు కోపం....???

కాబట్టీ,ఎప్పుడో సంవత్సరానికి ఒక రోజున వేసే మందు గురించి అనవసర రాద్దంతం చెయ్యకుండా...అనవసర [చేపమందే తెలియని వాళ్లకి కూడా తెలిసేట్లు] ప్రచారం చెయ్యకుండా.....సంవత్సరం  పొడవునా ప్రజలని పీల్చి పిప్పి చేస్తున్న కొన్ని కార్పోరేట్ ఆసుపత్రుల మీద దృష్టి పెడితే మంచిది.  అలాగే,  మూఢనమ్మకాల గురించీ చెప్పినప్పుడు కూడా తర తమ బేధం లేకుండా అందరిగురించీ, అన్ని మూఢ నమ్మకాల గురించి తెలియ చెప్పి.. ప్రజలలో అనుమానాలని తొలగించేబాధ్యత విజ్ఞాన వేదిక వారిదే...

ఇంకో విషయం ఏమంటే,  మీడియాలలో కనపడి ఎవరి నమ్మకాన్ని అయినా కాదనేప్పుడు, వారికి గుండెకు హద్దుకునేట్లుగా చెప్పాలే కానీ....వారి గుండెని మండించేట్లుగా వ్యంగంగా నవ్వుతూ... అనవసర వ్యాఖ్యానాలని చేస్తూ వివరించటం మంచిది కాదు. ఉదాహరణగా, సంవత్సరం పొడవునా రకరకాలైన పరిశ్రమల వారు, ఫార్మా కంపనీ వారు తమ వ్యర్ధ విష పదార్ధాలని నదులలో కలుపుతుంటే మాట్లాడని వీరు, సంవత్సరానికి ఒక సారి వినాయక విగ్రహాల నిమజ్జనం మీద టివిలలో చేరి అల్లరి అల్లరి  చేస్తారు. దీని వలన వారు చెప్పేది... ఒక వేళ నిజమైనప్పటికీ, ఎవరూ ఒప్పుకోరు. చెప్పేదేదో పక్షపాతం లేకుండా, అన్ని వర్గాల పట్ల వివక్షత లేకుండా  ఉన్నట్లయితే, అప్పుడే ప్రజలు  ఈ విజ్ఞాన వేదిక యొక్క విశ్వసనీయతనీ విశ్వసిస్తారు. లేకపోతే, వీరిని కూడా "కార్పోరేట్ ప్రతినిధులుగానే" అనుమానిస్తారు. 


@@@@@@@@@

+++++++++++++++++++++++++++++++++++++++++++++
  +++++++++++++++++++++++++++++++++++++++++++++

@@@@@@@@@ 


ఇందులోని బొమ్మలు గుగుల్లోనివే 

బొమ్మల మిక్సింగు కేఆర్కే 


ఈ రోజు వేసిన 

"హైదరాబాదు చిన్న చేప మందా..?? కార్పోరేట్ పెద్ద చేప మందా......???" ను
 చదివిన అందరికి ధన్యవాదాలు.