LOCAL WEATHER

20, జనవరి 2013, ఆదివారం

"మాయారోగాలు" ఎందుకు వస్తాయి...???


****************************************************************************
ధర్మాన్ని మనం పాటిస్తే ఆ ధర్మమే మనని  కాపాడుతుంది
 
ధర్మాన్ని అతిక్రమిస్తే  "అధర్మ రోగాన"  పడవలసి ఉంటుంది 
*****************************************************************

మాములుగా సామాన్యులకి వారి వారి తిండీ తిప్పల అలవాట్ల వలన రోగాలు వస్తాయి. అంటే తినగూడనవి తింటే, తినాలిసిన దానికన్నా ఎక్కువ తింటే రోగాలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే తిండి కోసం పడే తిప్పలు వలన కూడా రోగాలు వస్తాయి... ఎలాగంటే... చెయ్య వలసిన పనులు చెయ్యకపోయినా, చెయ్యవలసిన దానికన్నా ఎక్కువ చేసినా రోగాలకి మనం ఆహ్వానం పలికినట్లే...... అయితే,  ఈ సామాన్యులకి ఎట్టి పరిస్థితిలోనూ "మాయారోగాలు" వచ్చే అవకాశం చాలా తక్కువ.  

ఇకపోతే బాగా డబ్బున్న వాళ్ళకి రోగాలు డబ్బు టెంక్షను వల్లనా.......ఆ డబ్బును అపసవ్యంగా ఖర్చు పెట్టే పిల్లల వల్లనా, ఆ డబ్బును లెక్కలేకుండా ఎక్కడ పడితే అక్కడ దాచటం వల్లనా, అవి లెక్క తేలకపోవటం వల్లనా, లేక ఆ డబ్బును ఎవరో కొట్టేస్తారన్న భయం వల్లనా వస్తాయి. వీరు డబ్బు విషయంలో మరింత వ్యధ చెందితే వీరు "మాయారోగానికి" గురవుతారు.   

ఇకపోతే, కొందరికి నోటి దూల వల్లన రోగాలు వస్తాయి.....అంటే అవేశంతో ఎదో అనేసినా, అవసరం కన్నా ఎక్కువ వాగినా, అహంకారంతో తమ అవసరాలకి జనాలని వాడుకునేందుకు వారితో అనకూడని మాటలు అనేసినా లేక చుట్టూ ఉన్నదే ప్రపంచం అనుకుని ఆ కావరంతో వాగినా ఎక్కడలేనీ మాయరోగాలు చుట్టుముడతాయి.  

పైన చెప్పిన రెండు రకాల వారికీ అంటే సామాన్యులకీ, బాగా డబ్బున్న వారికీ వచ్చే రోగాలని కనిపెట్టటానికి చాలా సాధనాలు ఉన్నాయి. వాటి ద్వారా రోగ మూలాలని కనిపెట్టి అవి ఉపశమించటానికి మందులు ఇవ్వగలుగుతారు మన డాక్టర్లు......వీటీలో కొన్ని వంశపారంపర్యంగా వచ్చేరోగాలుంటాయి, వాటికి పై రొండు తరగతుల వారికీ మందులుంటాయి.

సరే, మనం ముఖ్యంగా మూడో తరగతికి చెందిన నోటి దూల వల్లన వచ్చిన మాయా రోగుల గురించి చెప్పుకోవలసి ఉన్నది. వీరికి ముఖ్యంగా వంశపారంపర్యంగా రోగాలు వచ్చే అవకాశం ఉన్నది. అంటు వ్యాధి వల్లన కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఈ అంటు వ్యాధి కేవలం దగ్గరున్నప్పుడే కాదు, శబ్ద తరంగాల వలన కూడా వ్యాపిస్తుంది. రోగులని పరీక్ష చెయ్యటానికి ఇవ్వాళ ఎన్నో పరికరాలు ఉన్నప్పటికీ, ఆ పరికరాలలో ఈ జబ్బు కనపడదు. ఇది కేవలం ఆ జబ్బు వచ్చిన వ్యక్తికి మాత్రమూ తెలుస్తుంది.  ఈ వ్యక్తులు దూల కొద్దీ మాట్లాడినప్పుడు చట్టం తన పని అది చేసుకుపోయినప్పుడు ఆయా వ్యక్తులలోని మాయారోగాలన్నీ బయటకి వచ్చి వారిని ఆందోళనకి గురిచేసి భయాందోళనలని కలగ చేస్తాయి. ఈ వ్యక్తులు యొక్క మాయా రోగం బయటకి రావటానికి కారకులు "చట్ట పరిరక్షకులు". ఈ చట్ట పరి రక్షకులని చూసిన కొద్దీ ఈ దూల రోగ వ్యక్తుల మాయారోగం మరింత ప్రకోపిస్తుంది. ఈ రోగానికి విరుగుడు కానీ మందు కానీ లేదు.....ఈ మాయా రోగం ఉపశమించటానికి ఒకే ఒక్క కాల పరిమితి గల మందుంది.....అయితే ఈ మందును చట్ట పరి రక్షకులు మాత్రమే  ఇవ్వగలరు.  ఆ మందు పేరే  "బెయిలు".............!!!


ఈ మాయా రోగం వచ్చిన తరగాత మందు లేకపోయినప్పటికీ....అసలు రాకుండా చెయ్యటానికి  చక్కటి మందుంది.......... అదే "భగవత్ గీత".  ఎవరైతే భగవత్ గీతను చదివి అందులో చెప్పిన విధంగా ధర్మాన్ని పాటిస్తారో వారికి పైన చెప్పిన మాయారోగం ఎప్పటికీ వచ్చే అవకాశం లేదు. ఈ భగవత్ గీతను ఎవరు ఆస్వాదించరో వారికి పైన చెప్పిన మాయారోగం వచ్చే అవకాశం ఉన్నది...ఈ  భగవత్ గీత కేవలం ఒక మతానికే కాదు,  అన్ని మతాల వారికీ .......ఇదే విధమైన భగవత్ గీత  వారి వారి మత గ్రంధాలలో లభిస్తుంది.          

 @@@@


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి