LOCAL WEATHER

5, జనవరి 2013, శనివారం

హైదరాబాదు పిచ్చోడి వాగుడుకి 2 వేల రూపాయల పెద్ద మనిషి కోరిక తీరలేదు.....!!!పాపం 2000/- రూపాయల పెద్దమనిషి కోరిక తీరలేదు. భారత దేశలో మతకల్లోలం సృష్టించాలి అంటే కేవలం రెండు వేలుంటే చాలు అని పిచ్చి వాగుడు వాగిన పెద్ద పదవిలో ఉన్న పెద్ద మనిషి ఇప్పుడు ఏ నోటితో దేశ ప్రజలకి క్షమాపణ చెపుటాడు...?? ఎందుకంటే హైదరాబాదు పిచ్చోడు వాగిన వాగుడికి ఈ పాటికి ఏ పాకిస్తానులో కానీ, విపరీత స్వతంత్రం ఉన్న అమెరికాలో కానీ అయితే విపరీత అల్లర్లు జరిగేవి.... కానీ, మన దేశంలో అలా జరగలేదు.   దేశ ప్రజలందరినీ తూలనాడిన ఈ మనిషి లాంటి వారి దగ్గర చట్టం తనపని తాను చేసుకోకపోవటం  వల్లనే ఈ రోజున  హైదరాబాదు ఉన్మాది లాంటి పనికిమాలిన వారికి ప్రొత్సాహం లభించినట్లైంది.

ఇది వరకూ వ్రాసిన పోస్టు "తిరుమల భద్రత.......ఇల్లెక్కి కూయాలా...???" లో రామ జఠలమలాని వాగిన వాగుడు గురించి ప్రస్తావించటం జరిగింది.  ఆ రోజున రాముడి పేరే పెట్టుకొన్న ఈ పెద్దమనిషి పిచ్చివాడులా వాగుతుంటే వారించిన వారు లేరు. రాముడిని నిందించినందుకు ఇతగాడిపైన ఎటువంటి కేసు పెట్టలేదు... ఇదే అలుసైంది వాళ్ళకి. రాంజఠల్మలానీ మాటలనే ప్రాతిపదికగా చేసుకొని హైదరాబాదు పిచ్చోడు తెగ ఎగిరాడు...వెనుకాల తోడేళ్ళ నవ్వుల మధ్యన. ఇలాంటి పనికిమాలిన వాళ్ళకి ఊతం ఇచ్చింది రాంజఠల్మలానీ కాదా...? మరి అతని మీద ఎందుకు కేసు పెట్టరు...?

ఇదే విధంగా అరవవాళ్ళ నెల్లూరి ముసలాయన రాముడి గురించి వెర్రి వాగుడు వాగినా ఎవరూ ఆయనను వారించలేదు.... ఈయన సినిమాలకి డైలాగులు వ్రాసి మరీ మంత్రి అయిన వ్యక్తి కదా ఎలా వాగినా పరవాలేదని ఆయన అనుకుని ఉండచ్చు.... ఎందుకంటే మన దేశీయ సినిమాలలో హిందూ దేవుళ్ళని ఎంత వ్యంగం చేస్తారో అందరికీ తెలిసిన విషయమే... ఇలాంటి అవమానకరమైన పనిచేసిన వారిని ముందర నుండీ "చట్టం ఒక చూపు చూసుంటే" ఎటువంటి ఉన్మాదులకీ అవకాశం లభించేది కాదు. కానీ ఇలాంటి విషయాల పట్ల ఏనాడూ శ్రద్ద వహించలేదు.  

సమస్య చిన్నదిగానే ఉన్నప్పుడు కనుక సకాలంలో వారించినట్లైతే అది పెద్ద సమస్యగా రూపొందదు.  కానీ  ఈ రోజున సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది........ఇప్పుడే కనుక అదుపు చేయ్యకపోతే తరవాత రోజులలో చెయ్య దాటిపొయ్యే అవకాశం ఉన్నది. శిక్షా స్మృతిలో ఉన్నట్లుగా.....  ఒకడు నేరం చేస్తే ఆ నేరాన్ని ప్రొత్సాహించిన వాళ్ళూ, సమర్ధించిన వాళ్ళూ, దారి చూపి నేరాన్ని చేయించిన వాళ్ళు కూడా దోషులే....!!! ఇలా కనుక పైన చెప్పిన పెద్ద మనుషుల మీద చట్టం తన పని తాను చేసినట్లయితే  ఈ రోజున దేశానికి "చీడలాంటి" వారి గురించి మనం ప్రస్తావించాలిసిన అవసరం ఉండేది కాదు....!!! 

చివరగా,  హైదరాబాదు ఉన్మాది వ్యాఖ్యలు వలన హిందువుల మనోభావాలు ఎలా దెబ్బ తిన్నాయో,  అలాగే ముస్లింస్‌లో అనేక మందికి ఇబ్బందికరంగా తయారైనాయి....  ఒకే దేశంలో ఉంటూ ఒకరికొకరు సంబంధం లేకుండా బ్రతకటం చాలా కష్టం అన్న సంగతి ఈ ఎంఎల్ఏకి తెలియదా.... తనదాకా వస్తే వేరే మతం అమ్మాయిని పెళ్ళి చేసుకొన్న వ్యక్తి[ఒక టీవీ చర్చలో నన్నపనేని రాజకుమారిగారు చెప్పిన మాటల ఆధారంగా], మిగిలిన వారిని రెచ్చగొట్టటం చూస్తే ఆ వ్యక్తిలో మతం కన్న రాజకీయ కుళ్ళు కంపే కొడుతోంది.....!!!     


@@@@@@@@@@


కర్టేసి వికిపిడియా-గూగుల్ ఇమేజస్