కర్టేసి ఈనాడు
ఫొటో జర్నలిజం అని పేరు పెట్టుకొని ఎక్కడబడితే అక్కడ ఎగబడి మరీ ఫొటోలు తీస్తుంటే వారిని వారించాలిసినది పోయి....... మీడియా ప్రచారానికి దాసోహమైన కొందరు పెద్దలు మమతను విమర్శిస్తున్నారు....... పశ్చిమ బెంగాలులో జరుగుతున్న మాటీ ఉత్సవాల్లో అత్యుత్సాహం చూపించిన ఒకానొక ఫొటోగ్రాఫెర్ మీద మమతా బెనర్జీ ...... "మీకు నాగరికత తెలియదా... చెంప పగలగొడతా" అని మండి పడ్డారుట..... అంతే ప్రతిపక్షం వారికి ఓ విషయం దొరికిపోయింది. "నియంత్రిత పోకడలు" అనీ మరేదో పేరులు పెట్టి విమర్శించి, ప్రెస్స్ ఫ్రీడంని వీరే కాపాడేసినట్లు ఆయస పడిపోయారు. ఇంతకీ బెంగాలులో ఇప్పుడు ఉన్న ప్రతిపక్షానికి ప్రెస్స్ ఫ్రీడం అంటే అర్ధం తెలుసా...??? ఇక మీడియా వారి విషయానికొస్తే మహిళల గౌరవం అంటు రోజు తమ మీడియాలో అల్లరి చేసే వీరు "మమత నోరు జారారు" అని, "నోరు పారేసుకున్నారు" అనీ, తమ పత్రికలలొ అమర్యాదగా వ్రాయటం ఎంతవరకు సమంజసం.....???
రాజకీయ నాయకులు కానీ, సినిమా వాళ్ళు కానీ ఎదురుపడితే మన ప్రెస్స్ ఫొటొగ్రాఫెర్లకి ఒంటి మీదకి పూనకం వచ్చేస్తుంది, మీద పడి, కొట్టుకొని మరీ ఏవో ఒక "సాగర సంగమం ఫొటోలు" తీసి పారేస్తారు... ఒక్కొక్కళ్ళూ వందల కొద్దీ ఫొటోలు తీసి ఆయా ప్రముఖులకీ, అక్కడికి వచ్చిన వారికీ కళ్ళు పోయే విధంగా ఫ్లాషులు వెలిగించి పారేస్తారు.... అలా మీదపడి ఫొటోలు తీయటమే ఫొటో జర్నలిజం'ట.....!!! ఇంతకీ వీరికి న్యూస్ కవరేజ్ లో ఉన్న ఆదుర్దా ఆక్కడ జరిగే విషయం మిద అవగాహన కాని, శ్రద్ద కానీ ఉండదు.
ఈ రకమైన మీడియా ప్రచార మత్తు మందులకి అలవాటైన చాలా మంది ప్రముఖులకి, ఇందులో ఇబ్బంది ఉన్నప్పటికీ సహించి ఊరుకుంటున్నారు...... కానీ, అందరూ ఒకే లాగా ఉండరు కదా; దీదీ లాంటి ప్రచారం అక్కర్లేని, సామాన్య ప్రముఖులు కూడా ఉంటారు కదా...... ఒక మహిళ అని చూడకుండా ఎగపడి అక్కడ ఆవిడకి ఇబ్బంది కలిగించే విధంగా ఫొటోలు తీస్తుంటే వారించాలిసినది పోయి, దానికేదో ఫొటో జర్నలిజం అని పేరెట్టి, ఆ కనీస మర్యాద తెలియని వ్యక్తులని వెనకేసుకు రావటం ఎంతవరకూ సమంజసం....?? ప్రతి పక్షం అంటే విమర్శించటమే పనా...???
ఎందరికో నీతులు చెప్పే ఈ మీడియా వారికి "ఎవరి పొయ్య వారిది" అన్న చందాన అంత మంది ఫొటో గ్రాఫర్లు అవసరమా...??? ఏదైనా సమస్య వస్తే మటుకూ వారి సంఘానికి వెళ్ళిపోయి నానా యాగీ చేసే వారు, ఈ ఫొటోల విషయంలో కూడా ఏ కొద్ది మందినో వినియోగించి అలా వచ్చిన న్యూస్‌నీ, ఫొటోలనీ వాడుకోవచ్చును కదా... ఎవరు తీసినా ఆ నాయకుల, సినమా వాళ్ళ ముఖాలే కదా.... కనీసం ఈ మాత్రం సంయమనం, సమైక్యత ఈ మీడియా వారి మధ్యలో లేక ఎవరికి వారు ఎగపడితే, అక్కడ అసలు జరిగే కార్యక్రమం అభాసు పాలవుతుంది. కాబట్టి, వ్యక్తులకి సంబంధించిన న్యూస్ విశేషాలని సేకరించటానికి మీడియా వారు తమ యునియన్ని వాడుకొంటే అటు మీడియా వారికీ మంచి ఫొటోలు వస్తాయి, ఇటు కార్యక్రమం జరిగేటప్పుడూ అనవసర గందరగోళం ఉండదు. ఎవరికీ వారు ఎగబడటానికి, ప్రెస్ అంటే వ్యాపారం కాదు కదా......!!!!
@@@@
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి