LOCAL WEATHER

10, ఫిబ్రవరి 2013, ఆదివారం

ఈయన్ని ప్రజాసామ్య ద్రోహి అనాలా......???




వరవరరావుగారికి ఎంతో  "విశాలమైన"  హృదయం ఉన్నది. కాని,  పార్లమెంటు మీద దాడి చేయించి, ఉరికి గురైన గురు మీద పాపం అని అనగలిగిన ఆయన, అలా అనగలిగే స్వాతంత్రం ఇచ్చిన పార్లమెంటు మీద మాత్రం ఎందుకు ఆయన హృ'దయ్యం కుంచించుకుపోయింది.....?? ఇలా కనుక ఆయన గారి దండులో ఎవరైనా అన్న కానీ, అన్నారని అనుమానం వచ్చినా గానీ "కోవర్టులూ" లేక ఉద్యమ ద్రోహులూ అన్న పేరుతో వారి తుపాకీలకి పని చెప్పేస్తారు కదా....!!! 

మరి వరవరరావుగారు చేసే పని ఏమిటి??? ప్రజాసామ్యంలో ఉంటూ అది ఇచ్చిన స్వతంత్రాన్ని అనుభవిస్తూ, ఆ ప్రజాసామ్యాన్నే అపహాస్యం చేసిన వారి మీద "పాపం" అనటంలో ఆయనగారి ఉద్దేశం ఏమిటి??  ఈయన గారు ప్రజాసామ్య ద్రోహి అవ్వటం లేదా...???  ఒక వ్యవస్థలో  ఉంటూ ఆ వ్యవస్థ  ద్వారా వచ్చిన అన్ని స్వాతంత్రాలన్నీ  అనుభవిస్తూ కూడా ఆ వ్యవస్థ మీద గౌరవం లేని వరవర రావు గారి లాంటి వారి వల్లనే మన దేశంలో శాంతి భద్రతల సమస్యలు వస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో ఇలా టెర్రరిస్టులని కొందరు వెనకేసుకురాగానే మరి కొందరు "ఆ ఇది ఓట్ల రాజకీయం" అని కొట్టి పారేస్తున్నారు..... అయితే ఇది ఎవరి ఓట్ల కోసమూ...???  అలాంటి వారు  ఉన్నారని అపోహ చెంది, అడ్డమైన వాగుడులూ వాగి, వారి మనసు గెలుచుకోవలనుకునే వారు, వారిని అవమానించినట్లే...!!!  ఎందుకంటే  ఇలాంటి టెర్రరిస్టులని  క్షమించే వారు ఏ కులంలోనూ, మతంలోనూ మన దేశంలో లేరు. నిన్న జరిగిన సంఘటన తరవాత దేశమంతా హర్షించింది....దేశమంతా ప్రశాంతంగా ఉన్నది..... ఎవరూ కూడా ఉరితియ్యటానిని అన్యాయం అని అనలేదు...ఒక్క వరవరరావు "లాంటి వారు"  తప్ప....

అయ్యా, ఎవరి జాలినో మీరు పొందాలని అనుకుంటున్నారో వారిని మీకు తెలిసో తెలియకో అవమానిస్తున్నారు. వారు విద్రోహుల పట్ల జాలిగా ఉంటారన్న అపోహతో మీకై మీరు వారిని విద్రోహుల గ్రూపులో కలిపేస్తున్నారు.... ఏదైనా మాట్లాడేటప్పుడు మీ  మాటల వలన ప్రభుత్వాన్నో, మరి ప్రజాసామ్య వ్యవస్థనో ఇరుకున పెట్టేస్తున్నామన్న సంతోషంతో బాటూ..... మీరు ఎవరి ప్రాపకం పొందాలని అనుకుంటున్నారో వారిని దేశద్రోహుల సపోర్టర్లుగా చేసి అవమానిస్తున్నారన్న సంగతి గమనించండి.

ఇకపోతే,  వరవరరావుగారు ఓ గొప్ప నిజాన్ని కనిపెట్టేశారు... మొడీ గారు 3000 మందిని ఊచకోత కోసేశారుట.........!!!  మరి ఇంత గొప్ప రహస్యం తెలిసి కూడా చట్టం సహాయం ఎందుకు తీసుకోలేదు...?  ఈయనగారి దగ్గరున్న ఆధారాలతో మోడీగారిని చట్టానికి పట్టించవచ్చును కదా.....!!!  మరి అలా ఎందుకు చెయ్యలేదు....??  అసలు ఈ వరవరరావుగారికి చట్టమంటే గౌరవం ఉన్నదా....!!!    

ఈయనగారు సపోర్టు చేసే నక్సలైట్లు, మావోయిస్టుల  వలన ఏ పాపం ఏరగని ఎన్ని వేల మంది చనిపోయారు.... పాపం ఈయనకి లెక్కలు తేలక చెప్పి ఉండకపోవచ్చును. ఇదివరలో పోలీసు వేను అనుకొని పెళ్ళి బృదం ఉన్న బస్సు క్రింద బాంబును పెట్టిన   వీరి మావోయిస్టుల [లింకు నొక్కండి]  గురించి  ఆ సమయంలో ఒక టీవీ వారు ... వారి  ఇంటర్వ్యు లో  అడిగితే,  అదేదో అడగకూడని ప్రశ్న అయినట్లుగా చూసి...... ఉద్యమంలో ఏవో జరుగుతుంటాయని తప్పించుకొన్నారు సారు గారు. పైగా ఉద్యమ కారులకి తప్ప మిగిలిన వారి మానవ హక్కుల గురించి నాకు సంబంధం లేదని తెగేసి మరీ చెప్పారు......పోలిసు వేను అనుకొని పెట్టారని సమర్ధించారు.... పొలీసు వేను క్రింద అయితే బాంబు పెట్టచ్చనా ఈయనగారి ఉద్దేశం....?   


ఏ పాపం ఎరగని "గురివిందగింజ". కేవలం ఉదాహరణ కోసం 

వీరి హక్కులు గల మానవులలో పాపం బడుగు పోలీసులు కూడా లేరు. కేవలం టెలిఫొను ఎక్సేంజులు పేల్చేసే వారు, అనుమానంతో అమాయక గిరిజనాన్ని చంపేవారు, వంతెనల క్రిందా, రోడ్ల మీద బాంబులు పెట్టేవారు మాత్రమే మానవులు. వారి హక్కుల కోసమే వీరు పాటు పడతారు. అలాంటి వారి ప్రక్కన మాట్లాడే ఈ గొప్ప మనిషికి ఉన్నట్లుండి మాములు జనం మానవ హక్కులు గభాలున గుర్తుకొచ్చేశాయి అని అనుకోవాలా...??? ఆయనకి తెలిసిన నిజమేమిటో ఆయనగారు చట్టం ముందుంచితే మర్యాదగా ఉంటుంది....అలా కాకుండా ఒక బాధ్యత ఉన్నదనుకున్న మనిషి,  ఎలా పడితే అలా అరోపణలు చేస్తే అది సమాజానికి మంచిది కాదనీ,  వీరిపై జనానికి నమ్మకం పోతుందినీ వీరు తెలుసుకుంటే మంచిది. ఇకపైనైనా పద్ధతిగా, మనది ప్రజాసామ్య దేశమనీ,  మన పైన ఒక చట్టం ఉందనీ, ఒక రాజ్యాంగం ఉన్నదనీ దానికి లోబడి ఉన్న వారి వల్లనే,  దేశమంతా చాలా ప్రశాంతంగా ఉన్నదని గుర్తెరిగి బాధ్యతగా మాట్లాడితే మంచిది.         


@@@ @@@ @@@

4 కామెంట్‌లు:

  1. "....వీరిపై జనానికి నమ్మకం పోతుందినీ...."

    ఇంకెక్కడ ఇలాంటి "వాళ్ళ" మీద నమ్మకం, ఎప్పుడో పోయింది. ఇంకా పోవటానికి ఏమీ లేదు.

    గురువుంద గింజ పోలిక అద్భుతంగా సరిపోయింది.

    రిప్లయితొలగించండి
  2. ఈ దేశం లో ఎం జరిగినా మోడీ నే గుర్తుకు వస్తాడు.
    మోడీ పేరు చెప్పి ఎంత పాపం చేసిన వాన్నైనా వదిలెయ్యాలి.
    భారత పార్లమెంట్ మీద దాడి చేసిన వాణ్ని వదిలెయ్యాలి అని చెప్పే, ఈ so called మేధావులు ఈ దేశానికి ఎలా ఉపయోగ పడుతున్నారో తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది.
    ఒక్కసారి, వీళ్ళు ఆ దాడి లో చనిపోయినా లేదా గాయపడ్డ వాళ్ళ దగ్గరకి వెళ్లి ఈ మాటలు చెప్పాలి.
    తరిమి తరిమి కొడతారు . వీళ్ళ ఇంట్లో వాళ్లకి జరిగినప్పుడు కూడా ఇలానే చెప్తే నమ్మచ్చు. నిజంగా పని చేసేవాళ్ళు కాక ,
    కొంతమంది రిటైర్ అయిపోయి ఉంటారు, పనేమీ ఉండదు , మీడియా లో కనపడటానికి బాగా ఉత్సాహంగా ఉంటారు, అటువంటి వాళ్ళు
    ఇలాంటి ఉరి తీత వ్యతిరేక కమిటి అని, అత్యాచార హక్కుల సాధన కమిటి అని , వెనక నిలబడిన , వెనక కూర్చున్న వాళ్ళ హక్కుల సాధన కమిటి అని ఏవేవో పిచ్చి పేర్లు పెట్టుకుని వస్తుంటారు బయటకి.
    .

    రిప్లయితొలగించండి
  3. venkat గారు స్పందించినందుకు ధన్యవాదాలు. బాగా చెప్పారు; పొద్దున లేస్తే బూర్జువాలు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే వీరందరూ ఆ బూర్జువా దేశాలలోనే తమ పిల్లలని చదివించి, అక్కడే ఉద్యోగాలు చెయిస్తారు.... వేరొకరికి చెప్పేటందుకే నీతులన్నీ.

    "కొంతమంది రిటైర్ అయిపోయి ఉంటారు, పనేమీ ఉండదు , మీడియా లో కనపడటానికి బాగా ఉత్సాహంగా ఉంటారు" ...... నిజమేనండీ..... ఈ కోవలోనికే మన మహిళా సంఘాలూ వస్తాయనుకుంటా........ ఎదైనా చిన్న విషయానికైనా నానా అల్లరి చేసే ఈ మహిళా సంఘాలు, ఆడవారిని నానా చెత్తగా చూపించే టీవీల వారి జోలికి రారందుకనే....... బహుశా టీవీల వారికి వ్యతిరేకంగా గొడవలు చేస్తే వారి టీవీలలో వీరిని చూపించరని బెంగ అనుకుంట.

    రిప్లయితొలగించండి
  4. శివరామప్రసాదు కప్పగంతు గారు స్పందించినందుకు ధన్యవాదాలు. "ఇంకెక్కడ ఇలాంటి "వాళ్ళ" మీద నమ్మకం, ఎప్పుడో పోయింది" ..........అవునండీ మీరు చెప్పింది నిజం, సామాన్య జనాని ఏ మాత్రం సంబంధించని దుర్మార్గమైన ఆలోచనా ధోరణితో వీరు వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రజల నమ్మకాన్నీ ఎప్పుడో పొగొట్టుకొన్నారు. వీరి వల్లనే మానవ హక్కులు అంటే కేవలం నేరం చేసిన వారికి సంబంధించినవి అని అపోహ జనాల్లో పెరిగింది. వీళ్ళేదో దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది హీరో ఇజం అని అనుకుంటున్నారేమో........

    రిప్లయితొలగించండి