LOCAL WEATHER

9, ఫిబ్రవరి 2013, శనివారం

ఆడవారంటే టీవిల వారికి లోకువా.....???ఆడవారిని ఏదో అనేస్తున్నారనీ, మగాళ్ళూ మృగాళ్ళు అని కొత్త మాటలు కనిపెట్టిన మన నీచ టీవీలు...... అదే న్యూసు టీవీల వారు ఆడ వారంటే ఏమాత్రం గౌరవం చూపిస్తున్నారో వారి కార్యక్రమాలని చూస్తే తెలుస్తుంది.  నిన్న రాత్రి ఎన్.టీవీలో ఓ  కార్యక్రమం ......పేరు బాక్సాఫీసు అనుకుంటా... సినిమా నటి సమీరా రెడ్డి బ్యాంకు కార్డు ద్వారా 5 లక్షలు పోగొట్టుకొన్న విషయం  చెప్పిన విధానం చూస్తే ఎన్.టీవీ వారికి ఆడవారి పట్ల ఎంత గౌరవం ఉన్నదో బాగా తెలుస్తుంది. ఎవరో సమీరా రెడ్డి అభిమాని అమెరికా నుండి హ్యాకింగు చేసి ఆమె అక్కౌంటు నుండి డబ్బులు కాజేసిన విధానాన్ని ఎంత వ్యగంగా వెకిలిగా చెప్పారో.... దానికి తోడు సమయానికి తగ్గ దొంగ పాటలు పెడుతూ  ఆ విషయాన్ని ఒక హాస్య సన్నివేశంగా మార్చి వేశారు.  "దానికి తగ్గట్టు అమ్మడు అంటూ వ్యంగంగా మాట్లాడేది కూడా ఆడ అన్నౌసరే".......అందుకే అంటారేమో ఆడ వారికి  ఆడవారే  శత్రువు అని!!!!   ఎన్ టీవీలో ఎన్ అంటే బహుశా నీచమైన టీవీ అని అర్ధమేమో అని అనిపించక మానదు.   

ఇదే టీవీలలో మగ మెగా నటుల గురించి ఇదే విధమైన పధతిలో చెప్పగలరా.......? అంత దమ్ముందా........?? లేదు చెయ్యలేరు... ఎందుకంటే ఆయా హీరోల ఫ్యాన్సు దెబ్బకి ఏమి జరుగుతుంతో ఈ బజారు టీవీల వారికి బాగా తెలుసు.... స్వలింగ సంపర్కులకీ, దొంగలకీ, హత్యలూ చేసే ఫ్యాక్షనిస్టులకీ కూడా బ్రహ్మాణ్ణమైన గౌరవం ఇచ్చే  ఈ దిక్కుమాలిన బజారు టీవీలు,  ఆడవారి విషయానికి వస్తే ఎక్కడలేని వ్యంగమూ చూపిస్తాయి.... మళ్ళి పొద్దున నుండీ రాత్రి వరకూ ఆడవారి గౌరవమూ అంటూ గొప్ప మాటలు సృష్టిస్తాయి..... ఇటు ఆడవారినీ  గౌరవించక అటు మగాళ్ళందరినీ మృగాళ్ళుగా  చెప్పే   టీవీలు ఏ జాతికి చెందినవో వారికే తెలియాలి.  

ఇకమీదటనైనా, దొంగతనాలూ, హత్యలూ లాంటివి చెప్పేటప్పుడు హాస్యాన్ని జోడించే నీచ సంస్కృతికి ప్రొత్సాహం ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తిసుకొంటే మంచిది.... చాలా వాటికి స్పందించే ఆడ సంఘం వారు కూడా,  టీవిల వారు  ఆడవారి పట్ల ఉపయోగించే "అమ్మడూ గిమ్మడూ" లాంటి వ్యంగమైన  పదాలని ఉపయోగించకుండా,  గ్యాసిప్స్ కార్యక్రమం పేరుతో ఆడవారిని అక్రమంగా చూపించకుండా తగిన బుద్ధి చెపితే బాగుటుంది.  @@@@@@@@@@@@@   


2 వ్యాఖ్యలు:

  1. "స్వలింగ సంపర్కులకీ, దొంగలకీ, హత్యలూ చేసే ఫ్యాక్షనిస్టులకీ కూడా బ్రహ్మాణ్ణమైన గౌరవం ఇచ్చే... "

    Earlier days there used to be a concept of Editor in print media. Now no such concept anywhere leave alone in electronic media. In TV as the Reporter starts blabbering "live" there is nobody who can hear it first and then edit and telecast only the neat copy. Since it takes time and one channel will lose time in giving some silly story as breaking story, they just telecast as it comes. So these semi literate people passing as Journalists talk subject to their illiteracy and we are subject to the news items which are quiite half baked, lopsided and prejudcial also.

    The problem is quite rampant and the present day media requires EDITORS and not people called "AS EDITORS" and such Editors should be impartial. The word "impartial" is nowhere near the Media. That is the unfortunate situation of Press Freedom in India. This situation in my view shall definitely be used, if not already, as leverage by Government to impose restrictions on Media as time goes by. This, the present Media "moghuls" are not realising as they are bent upon making some quick buck with somehow enhancing their so called TRPs. For getting better TRP (God also may not be know how this is measured or counted), media is ready to do anything. Media is now run purely as a business enterprise and nothing else.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. శివరామప్రసాదు కప్పగంతు గారు స్పందించినందుకు ధన్యవాదాలు. నిజమేనండీ ఆ టీఆర్పీ ఎలా నిర్ణయిస్తారోగానీ, దాని వలన పనికిమాలిన పోటీ పెరిగి అనారోగ్య వాతావరణం ఏర్పడింది.

    ప్రత్యుత్తరంతొలగించు