LOCAL WEATHER

14, ఏప్రిల్ 2012, శనివారం

అరటికాయ పచ్చడి


అరటికాయ పచ్చడి

ఇదేమిటి అరటికాయతొ పచ్చడా....అని అశ్చర్యపోకండి...... మా అమ్మగారు అరటికాయ పచ్చడిని మాంచి రుచికరంగా చేసేది. మొత్తాన్ని మేము లాగించెసేవాళ్ళం. ఆవిడతో నాకున్న సాన్నిహిత్యం వలన కొన్ని వంటకాలు నేర్చుకొవటం జరిగింది. ఇప్పుడు ఆవిడ లేకపోయినా వాటిని చేయించుకుని అమ్మని గుర్తుకు తెచ్చుకుని ఆనందిస్తున్నాము.


సరే, ఆనందాన్ని మీతో పంచుకొవటానికి, అరటికాయ పచ్చడిని ఎలా చెయ్యాలో వివరిస్తున్నాను.

కావాల్సినవి:

ముదిరిన అరటికాయలు --- 3

ఎండు మెరపకాయలు --- 15 లేక 25 [కారాన్ని బట్టి]

ఆవాలు, జీలకర్ర --- కొద్దిగా

శనగపప్పు --- 5 టీ స్పూన్లు

మినపప్పు --- 3 టీ స్పూన్లు

ఇంగువ --- కొద్దిగా

కర్వేపాకు --- 4 రెమ్మలు

మంచి నూనె --- తాలింపునకు తగినంత

ఉప్పు --- తగినంత



చెయ్యవలసిన విధానం:

ముందుగా అరటికాయలను స్టవ్వు మీద పెట్టి కాల్చాలి. వాటికి నూనె రాసి కాలిస్తే బాగా కాల్తాయి. మంచిగా కాలిన తరవాత ప్రక్కన పెట్టి నీళ్ళు చల్లాలి. అలా చెయ్యటం వలన లోపల బాగా ఉడుకుతుంది.

తరవాత ఎండు మెరపకాయలు, శనగపప్పు, మినపప్పులను..... ఆవాలు జీలకర్ర ఇంగువలను వేయించుకొని ప్రక్కన పెట్టుకోవాలి. దించుకొనే ముందర కర్వేపాకు వేసుకోవాలి.

ఇప్పుడు, కాలిన అరటికాయల పైపెచ్చును జాగ్రత్తగా వలిచి తీసెయ్యాలి. తరవాత వేయించి ప్రక్కన పెట్టిన వాటిలో మెరపకాయలను, శనగపప్పు[కొద్దిగా] మినపప్పులను[కొద్దిగా] తీసుకొని "దంచుకొన్నట్లుగా" వచ్చేటట్లు మిక్సీలో తిప్పుకొవాలి.

ఇక చివరి స్టేజిలో అరటికాయలను, మిక్సీలో తిప్పిన వాటినీ, మరియూ మిగిలిన ఆవాలు జీలకర్ర శనగపప్పు, మినపప్పులను తగినంత ఉప్పు వేసి ఒకటిగా కలిపెయ్యాలి. ఇలా కలిపెయ్యటం చేత్తో చేస్తె బాగుంటుంది. అలా కాకుండా మిక్సీలో వెయ్యదలిస్తే మొత్తం పిండి పిండిగా అవకుండా చూసుకోవాలి[1, 2 సార్లు ఆన్ చేసి ఆఫ్ చెసి చూసుకోవాలి].


అంతే అయిపోయింది. మరి చేసుకు తిన్న తరవాత ఎలావుందో చెప్పండే........


పైన ఫొటోలన్ని నా సెల్ ఫొనుతో తీసినవే

9 కామెంట్‌లు:

  1. అద్భుతం గా ఉంది బాబాయి నీ వర్ణన...
    ఇవాళ రాత్రి భోజనానికి అరటి పచ్చడి :)

    రిప్లయితొలగించండి
  2. రాధాకృష్ణ గారు. మంచి వంటకం ఎలా చెయ్యాలో చెప్పారు , ఇక్కడ దగ్గర్లో కూర అరిటి దొరికితే తప్పక ట్రై చేస్తా.....ఎలా ఐనా అమ్మ చేతి వంటకు వొంక ఎవరు పెట్టగలరు....

    మరో టపా కోసం ఎదురు చూస్తూ.....

    రిప్లయితొలగించండి
  3. లైవ్ గా చేసి చూపించినట్లుంది మీ వెరైటీ వంటకం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు Padmarpita గారు, ఒక సారి ట్రై చెయ్యండి రుచి చాలా బాగుంటుంది.

      తొలగించండి
  4. ఊరికే అన్నారా నల-భీమ పాకం అని! దమయంతీ-హిడింబా పాకం అనలేదుకదా.(ద్రౌపది భీముడికి ఒక్కడికే కాదుకదా అందుకని ఆయనకు మాత్రమే భార్య ఐన హిడింబ పేరును చేర్చటం జరిగింది) బాగున్నది చెప్పిన పధ్ధతి. ఈ వంటకాన్ని అరటి పొడి అంటారు. నేను నాగార్జునసాగర్ లో బ్రహ్మచారిగా వంటచేసుకుంటూ ఉండెరోజుల్లో (1980ల్లో) అనేకసార్లు ఈ పొడి చేసుకు తిన్నాను. కాని ఇప్పటిరోజుల్లో దేశవాళి అరటికాయలు (ఇలాంటివి ఒకటి ఉన్నాయని ఇప్పటి తరానికి తెలియదు పాపం) ఐతే అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు మనకు దొరికే సంకర రకాలకు చెందిన అరటికాయలతో చేస్తే పొడి కాదు పేస్ట్ అవుతుంది. జాగ్రత్తగా పలకలుగా ఉన్నవి (గుండ్రంగా పలకల ఏంగిల్ లేనివి కాదు) ముదిరినవి, పండకుండా ఉన్నవి ఎంచుకుని వాటితో ఈ పొడి చేసుకు తింటే మళ్ళి వదిలిపెట్టరు మరి.

    రిప్లయితొలగించండి
  5. అవును శివాగారు మీరు చెప్పినట్లు ఇప్పుడొచ్చే అరటికాయలు సవ్యంగాలేవు.....అమ్మే వాళ్ళు తెలివి మీరిపోయారు.....లెక్కకి వచ్చేవి సరిగా ఎదగ కుండా కోసి అమ్మేస్తున్నారు.....బరువు తూచేవి దొండకాయలు లాంటివి ముదిరిన తరవాతగానీ అమ్మటంలేదు...

    రిప్లయితొలగించండి
  6. Radhakrishna garu, sorry for typing in english but no option now. :-)

    naako silly prasna, konna arati kaya meedi tokka peeling lekuntane frying aa stowe meeta ? or tokka teesi, mallee frying tarwata nallaga unna pottu inko layer teeyala ?

    amma garni khooste,maa relatiwes lo okawida ilage untaru, tanu gurtokhaaru.

    రిప్లయితొలగించండి
  7. madhu గారూ స్పందించినందుకు ధన్యవాదాలు.... తెలుగులో టైప్ చెయ్యటం చాలా తేలిక ... http://lekhini.org/ లో ప్రయత్నించండి. ఇది నెట్ సాఫ్ట్‌వేర్ కాబట్టి ఎక్కడైనా వాడవచ్చును. తరవాత, అరటికాయ మీద తొక్క తియ్యకుండానే ఆ కాయమీద కొద్దిగా నూనె రాసి స్టవ్వు మీద తక్కువ మంటలో కాల్చాలి...కాలిన తరవాత కొద్దిగా నీళ్ళు చల్లి...ఆ తరవాత తొక్క తియ్యాలి.

    రిప్లయితొలగించండి