LOCAL WEATHER

20, అక్టోబర్ 2012, శనివారం

వినోదమా?? విపరీతమా??? లేక బందువులా.. రాబందువులా.......




ఆదివారం, లేక సెలవులు వచ్చినప్పుడు, ఇంట్లో కూర్చుని ఏమి చెస్తామూ, అలా వెళ్ళి నలుగురినీ కలుద్దామని బయలుదేరి  వెళ్ళి ఒక స్నేహితుడిని కలిస్తే వాళ్ళింట్లో ఓ బందువుతో కాలక్షేపం చేస్తున్నారు.....కాసేపు కూర్చున్నాక విసుగు పుట్టి చుట్టాలింటికి వెళితే అక్కడ కూడా మరో రకమైన బందువు చెప్పేది వింటూ చూస్తూ ఉన్నారు.....అక్కడా చిరాకు పుట్టి...దూరపు చుట్టాలైన పెద్ద వాళ్ళ దగ్గరికి వెళితే అక్కడ ఓ బందువు దాపరించటమే కాకుండా....ఆ బందువును  బాగా దగ్గర నుండీ  చెప్పెది వింటూ, చూస్తూ మధ్యలో నవ్వుకొంటూ....కోపగించుకొంటూ కనపడ్డారు....ఇంతకీ అన్ని చోటలా ఆ కనపడ్డ బందువు ఎవరంటారా....?  ఇంకెవరు ప్ఫదో లేక ఇర్రవయ్యో చానళ్ళను చూపించే టీవీనే....!!!

వినోదం అనేది ప్రతీ మనిషికీ అవసరమే......అది లేకుండా మనిషికి ఆనందం కలగదు.......నిజమే....కానీ ఎప్పుడు వినోదం కావాలీ...? మనకి తోచనప్పుడు....కాలక్షేపం జరగనప్పుడూ లేక ఒంటరి తనం ఎక్కువై బాధ కలిగినప్పుడూ వినోదం మంచి ఔషధం లాగా పనిచేస్తుంది.....కానీ....."ఈ వినోదం కూడా ఎంత ఉండాలీ అనే ప్రశ్నను ఇప్పటి టీవీ వినోదం మూలంగా తలెత్తింది..."

సమాజంలో మనుషులు ఒకరికొకరు దగ్గరగా నివసించటానికి కారణం.....మానవుడు సంఘజీవి కాబట్టి. కానీ ఇప్పుడు ఇదే మానవుడు సంఘజీవిగా కాకుండా స్వార్ధ జీవి లాగా మారిపోయారు.....ఎవరితోనైనా పని ఉంటేనే పలకరింపులు సాగుతున్నాయి.....ఏ పనీ లేకుండా ఎవరిని ఎవరూ పలకరించుకోనంతగా దిగజారిపోయారు....ఎవరైనా ఊరికే ఏ పనీ లేకుండా వస్తే కూడా "వీడికి మనతో ఏంపని ఉందబ్బా" అని మనసులోనూ మొఖంలోనూ అనుమానం వెలిబుచ్చెంతగా మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది. 
  

కారణాలు ఏమైనప్పటికీ, ఎవరి స్వార్ధం గురించి  వారు కారణాలు వెతుక్కున్నప్పటికీ,  దీని వలన మన సమాజానికి విపరీతమైన కీడు చెడూ జరుగుతో ఉన్నది. టీవీలు చూసి చూసీ, తమ సమస్యలకన్నా సీరీయల్లోని   కేరక్టర్ల్ సమస్యలకీ, సమాజ సమస్యలకన్నా రాజకీయ నాయకుల సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తునారు.   మన ప్రక్కన ఉన్న వాడి గురించి మనకు అఖర్లేదు....చివరికి మొగుడూ పెళ్ళాలు కూడా  బందువు కాని బందువు రాబందును చూస్తూ వారిలో వారు సరదాగా మాట్లాడు కోవటం తగ్గించేశారు....దీని వలన సమాజంలో ఒకరికీ మరొకరికీ మధ్య సంబంధ   బాంధవ్యాలు బలహీన పడుతున్నాయి.....

పోనీ, మన మీడియా వారు ఇంత జనాదరణ పొదుతూ వుండి కూడా, ప్రజలను సక్రమమైన ఆలోచనల వైపుకి వెళ్ళేటట్లు తమ కార్యక్రమాలని రూపొందిస్తునారా  అంటే.....అదీ లేదు... జనం ఎగబడి చూస్తున్నారు కదా అనీ....మన టీవీల వారు కూడా ఎక్కడ లేని కధలూ, రియాలిటీ షోలు, న్యూస్ చానళ్ళ పేరుతో ప్రజా జీవితానికి ఏమాత్రం సంబంధం లేని పనికిమాలిన విషయాలతో ప్రజల బుర్రలని పాడి చేస్తున్నారు.....వీరికి కావాలిసినది కేవలం డబ్బు సంపాదన మాత్రమే; ఆ క్రమంలో సమాజంలో ఎన్నో దుష్‌ ప్రభావాలను చూపించే అనేక కార్యక్రమాలను తమ ఇష్టారాజ్యంగా వేస్తున్నారు.....పైగా దానినే మీడియా స్వేచ్చా అంటున్నారు.  మన రాజకీయ వ్యవస్థ లోని కొందరు,  ఇదే సందని ఈ పనికి మాలిన మీడీయాలో ప్రేతాత్మలుగా చేరి ప్రజల మధ్య వైషమ్యాలను పెంచుతున్నారు......   

ఇక, మొదటికొస్తే......మనుషుల మధ్య వినోదం పేరుతో విభజన జరుగుతుంటే దీనిని కంట్రోలు చెయ్యాలి అనే విషయాన్ని కూడా అలోచించేంత తిరిక లేనట్లు నటిస్తో,  సమాజం తన దారిన తను దిక్కు లేకుండా పరిగెడుతో దిక్కులేనిదైపోయింది. దీని చెడు ప్రభావం పెద్దల మీద కన్నా పిల్లల మీద బాగా పడబోతోంది......ఈ విపరీత వినోదం లేని  కాలంలో ఒకరినొకరు పలకరించుకొంటూ, కలుసుకుంటూ కలివిడి వాతావరణంలో  పెరిగిన పెద్దలే  ఈ రోజున సమాజానికి దూరంగా ఉంటుంటే,  చిన్నప్పటి నుండీ టీవీయే లోకం అన్న రీతిన పెరిగిన ఇప్పటి చిన్న పౌరులు, రేపటి సమాజాన్ని "సమాజం" అనేట్లుగానైనా చూస్తారా.....? 

 కాబట్టి,  ప్రజలందరూ వినోదం పట్ల విపరీత ధోరణులను  తగ్గించుకొని, ఎంతో కొంత కాలాన్ని  ఒకరికొకరు కేటాయించ గలిగితే రేపటి సమాజం బాగుంటుంది.  లేకపోతే "మన దేశం పేరు భారత్ అయితే ఏమిటీ...? పాకిస్తాను అయితే ఏమిటి...??? మనం మన దారిన బ్రతుకుతున్నామా లేదా......"  అన్నంత వరకే అలోచించే స్తితికి దిగజారిపోయే ప్రమాదం ఉన్నది. 





 ఇందులోని బొమ్మలన్ని గూగూల్ లోనివే .....మిక్సింగ్  కే.ఆర్.కే 


3 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. అప్పుడెప్పుడో దురాచారాలు ఉండేవి, సాంఘిక దురాచారం అంటూ పెడబొబ్బలు పెట్టే అలోచనపరులం అనుకుని భ్రమపడేవాళ్ళు కూడా ఈ టి వి భూతానికి బలయ్యిపొయ్యారు. ప్రస్తుతం ఉన్న పెద్ద సాంఘిక దురాచారం ఇరవైనాలుగు గంటల వార్తా చానెళ్ళు, నిత్య ధారావాహికలు. ఈ సాంఘిక దురాచారాన్ని ఏ రామ్మోహన రాయ్ వచ్చి తొలగిస్తాడో, ఏ విలియం బెంటిక్ వచ్చి అరికడతాడో తెలీటం లేదు. అంతగా వెర్రెక్కిపోయి ఉన్నారు జనం మీడియా, ఇద్దరూనూ.

    రిప్లయితొలగించండి
  3. అవును శివాగారూ, వినోదం ముదిరి చివరికి సాంఘిక దురాచారంగా మారుతోంది. వేరే దురాచారాల వలన ఏ కొద్ది మందో బాధ పడితే, ఈ దురాచారం వలన మొత్తం సమాజం
    అనైక్యానికి గురై బాధ పడుతోంది.

    రిప్లయితొలగించండి