LOCAL WEATHER

31, అక్టోబర్ 2012, బుధవారం

ప్రజా భూకంపం

ఇది గూగుల్ ఇమేజెస్ లోనిది మాత్రామే

మొన్న పనిమీద వినుకొండ వెళ్ళను....ఆ సమయంలో అక్కడా,  పరిసర ప్రాంతాలలో భూకంపం వచ్చింది........వచ్చినప్పుడు అయిదు సెకండ్ల పాటూ ఉరుములాంటి చప్పుడు  వచ్చి,  కాళ్ళ క్రింద భూమి కంపించింది...అందరం బయటకు పరిగెత్తాము....దగ్గరలో ఉన్న కొన్ని ఇళ్ళకు  కొద్దిగా బీటలు వచ్చినాయి.......కాసేపు హడావిడి.....10 నిమిషాలు గడిచినాయి......రోడ్డు మిదకు వచ్చిన జనం అది ఇదీ మాట్లాడి,  ఎవరి పనిలో వారు నిమజ్ఞమై పోయారు. అసలు ఇందాక భూకంపం ఇక్కడేనా వచ్చింది అనేంత  మళ్ళీ వాతావరణం మాములుగా మారిపోయింది.

టివీ వారు కొద్ది సేపు "బ్రేకింగు న్యూస్" అని హడావిడీ చేసి  ఊరుకున్నారు...విజయవాడ వచ్చిన తరవాత  భూకంప విషయం చెప్పాను......అలా వినీ  విననట్లుగా  విని ఊరుకున్నారు.....నాకు అశ్చర్యం వేసింది.  ఇదే ఇదివరకు రోజుల్లో అయితే వారం పదిరోజులు చెప్పుకొనే వారు...మరి జనంలో చైతన్యం తగ్గిందా....లేక భూకంపం అనేది మనకు అలవాటైయిందా.......భూకంపం అంటే లెక్క లేదా......అదేమంత ముఖ్యమైన విషయం కాదా......కాళ్ళ క్రింద భూమి కదిలినా పట్టించుకోనంతగా జనం మారిపోయారా.......??? 

లేదు. జన చైతన్యంలో మార్పేమీ లేదు....మరి దీనికి బదులు, ఎవరో ఒక రాజకీయ నాయకుడికి ఏదైనా జరిగితే టీవీలూ, ప్రజలూ విపరీతంగా ప్రతిస్పందిస్తున్నారు కదా!!!   రోజుల తరబడి చర్చించుకొంటారు కదా!!!  ఉదయాన్నే ఎంతో మంది పెద్దమనుషులు టీవీల్లొ కూర్చుని రాజకీయ నాయకుల భవిష్యత్తూనూ, ఆరోగ్యాన్నీ  విచారిస్తుంటే,  తమ సమస్యలను మరిచిపోయి మరీ చూసి........ఆ తరవాత,  కనపడిన ప్రతీ వారితో అదే విషయాలని చర్చిస్తూ ఉన్నారు కదా!!! కాబట్టి జనంలో చైతన్యానికి కొదవలేదు.....ఎటొచ్చీ అది దారి తప్పింది. అంతె.

ప్రజలు తమ కాళ్ళ క్రింద భూమి కదిలినా పట్టించుకోకుండా, కేవలం  రాజకీయాల పట్ల విపరీత స్పందనతో   ఉండేట్లుగా మన  ప్రజా నాయకులూ, వారి కనుసన్నలలో నడిచే మీడియా, ప్రజలని హిప్నటైజ్ చేసేశారు...... మరి ఈ జబ్బుకు గురైన ప్రజలు స్వంత విషయాల పట్ల ఎలా స్పందించగలరు.....? భూకంపం వచ్చినా చలించని మన ప్రజ, "ఏమిటి మంత్రి పదవి మన సామాజక వర్గానికే వచ్చిందా? మన ప్రాంతానికే వచ్చిందా?" అనే  ఈ పరిస్తితులలో ఎవరేం చెయ్య గలరు???  ........ఎవరేం చెస్తారు.....ఎవరికి వారే తెలుసుకోవాలి.......అంతె.

2 కామెంట్‌లు:

  1. పైబొమ్మలో రోడ్డుమీద బీట్లల్లో ఉన్న కారణాల్లో ముఖ్యమైనది 15 రకాల టివి లు అందులో పైగా 24 గంటల వార్తల టివిలు. ప్రజలకి సమాచారం ఎక్కువైపోయి మొద్దుబారిపోయి, స్తబ్ధుగా మారిపొయ్యారు. అంతకంటే మరేమీ లేదు.

    ముంబాయిలో 2006 లో లోకల్ రైళ్ళల్లో టెర్రరిస్టులు బాంబులు పేల్చారు, వందల మంది పొయ్యారు. మర్నాటి పొద్దునకి రైళ్ళన్నీ యధావిధిగా రద్దీగానే తిరిగాయి. దీనికి "ముంబాయి స్పిరిట్" అని పేరెట్టి ఈ టి వి వాళ్ళు పొగడటం. జనం అంతా ఇలా ఏమీ జరగనట్టుగా (అమ్మయ్య మనకి ఏమీ కాలేదు, మనవాళ్ళకీ ఏమీ కాలేదు అనేసుకుని) రైళ్ళ మీదకు ఎగపడకుండా, ఆ రోజల్లా అన్ని లోకల్ స్టేషన్లల్లోనూ ధర్ణా చేసి ఉంటే, ప్రభుత్వం ఇంత టెర్రరిజం విషయంలో నిమ్మకి నీరెత్తినట్టు ఉండేదా. ఎప్పుడో పాకిస్తాన్ కి చెప్పవలసిన రీతిలో బుధ్ధి చెప్పేది, 2008 లో టెర్రరిస్ట్ దాడి జరిఏది కాదు, మరి కొన్ని వందల మంది పొయ్యేవాళ్ళు కారు.

    ఒకప్పుడు యథా రాజా తధా రాజా. ఇప్పుడు ప్రజాస్వామ్యం కదా, ప్రజలకు తగ్గ ప్రభుత్వమే వస్తుంది అందుకు భిన్నంగా ఏమీ జరగదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శివరామప్రసాదు కప్పగంతుగారు స్పందించినందుకు ధన్యవాదాలు......అదేనండీ, ప్రజలు సమాజానికి పనికి వచ్చే విషయాల పట్లే మొద్దుబారిపోయారు.

      తొలగించండి