హిందువుల పార్టీ అని పైకి కనపడుతున్న ఒక రాజకీయ పార్టీకి చెందిన జాతీయ నాయకుడూ, ఆయన అనుచరుడూ నిన్న తిరుమల వచ్చి శ్రీవారి దర్శనం చేసుకొన్నారు. పాపం, ఆ తరువాత.........మర్యాద విషయంలో ఏమైనా తేడాలు వచ్చినాయో లేక మన మీడియా వారు పట్టించుకోలేదో ఏమో మరి.......ఉన్నట్లుండి తిరుమల బధ్రత గురించి వారికి ఎక్కడిలేనీ శ్రద్ధ వచ్చి అక్కడి అధికారులని కడిగి పారేశారు. "ఒక వేళ బొంబయి తరహా దాడులు జరిగితే[?]" ఏమి చేస్తారని పేద్ద పేద్ద డైలాగులు వాడేశారు.......అసలు వీళ్ళలాంటి వాళ్ళు రావటం, వచ్చి అనవసర వాగుడు వాగటం వల్లనే టెర్రరిస్టులకి దారి చూపిస్తున్నట్లు అవుతోంది అనే విషయం ఈయనకు తట్ట లేదా.....? ప్రతీదీ సెన్సేషనే కానీ తరవాత ఏమి జరుగుతుందనే బాధ లేదా?? తిరుమల బధ్రతలో లోపాలుంటే అలా ఇల్లెక్కి కూయాలా...??? రెండో కంటి వాడికి తెలియ కుండా అక్కడున్న అధికారులతో సమావేశమై, తనకు తోచింది చెప్పి జాగ్రత్త పడమని చెప్ప వచ్చును కదా....!!!
తిరుమలకి లక్షలలో, కోట్లలో భక్తులూ, ప్రజలూ వస్తున్నారు హాయిగా అయినంత వరకూ దర్శనం చేసుకు పోతున్నారు. ఎవరికీ బధ్రత అనేది ఒక పెద్ద విషయంగా కనపడటం లేదు......అయితే ఈ వీఐపీలు అంటూ వచ్చి అనవసర హడావిడీ చేసి నలుగురి దృష్టిలో పడాలన్న వీరి తాపత్రయం వల్లనే తిరుమల బధ్రతకి లోటు వస్తోంది. ఈ ప్రచార నాయకులు ఓహ్ మర్చే పోయాను.....అదే ప్రజానాయకుల ప్రచార ధొరణుల వలననే తిరుమల లాంటి చక్కటి ప్రదేశాలు ఇబ్బందుల్లో పడుతున్నాయి.....
ఏదైనా పండుగ వస్తే చాలు అప్పటిదాకా హిందువుల మీద ఎవరు నోరు పారేసుకొన్నా కిమ్మన కుండా నోరు మూసుకొని చిమూ నెత్తురూ లేని వాళ్ళ లాగా ఉన్న ప్రతీ వాళ్ళూ, స్వామి వారి దర్శనానికి ఎగబడటమే.....అదీ జనం బాగా రద్దీగా ఉన్నప్పుడు వచ్చి, తమ దర్పం ప్రజల దగ్గర ప్రదర్శించటం పరిపాటైపోయింది. ఇలాంటి వాళ్ళూ, వారి వెనుక తిరిగే చెంచాలూ.......వీరి కోసం స్కెచ్చిలు వేసే టెర్రరిస్టు మూకలూ..........కేవలం ఈ విధంగా మాత్రమే తిరుమల లాంటి ప్రదేశాలకి ముప్పు వాటిల్లుతోంది.....
వీరికి తోడు వీరి చెంచా మీడియాలు....టీవీలలో హొరెత్తిచటం.... ఇలా లక్షలూ, కోట్లూ ప్రజలు గుమికూడతారు అన్న విషయాన్ని చక్కగా టీవీలలో ప్రచారం చేసి టెర్రరిస్టు మూకలకి సహాయ పడుతున్నారు. ముంబాయిలో టెర్రరిస్టు మూకల దాడి సమయంలో కూడా మన అతి స్వేచ్చగల మీడియా విపరీత లైవ్ టెలీ కాస్టు చెయ్యటం వల్లనే, లోపల ఉన్న టెర్రరిస్టు మూకలు హాయిగా టీవీలు చూస్తూ తమ యుద్ధ రచనని చేసేయి. ఒక విధంగా వారికి సహాయకులుగా పని చేశాయి మన మిడి మిడి మీడియా. ఇప్పుడు కూడా సందు దొరికింది కదా అని "ఒరేయ్ టెర్రరిస్టు బాబులూ ఇక్కడ భద్రత ఏమీ లేదు రారండోయ్......" అని పిలిచినట్లుగా గొల గొల చేసి, పనికి మాలిన మూకల దృష్టి పడేటట్లు చేస్తున్నాయి మన మూఢియాలు.......
ఎక్కడన్నా, ప్రజలకి సంబంధించి ఘోరం జరిగితే, సంయమనం పాటించమనే ఈ పెద్ద మనుషులు; తమ వర్గానికి[రాజాకీయ/మీడియా]ఏదైనా జరిగితే, ఎదో ప్రపంచం తలక్రిందులు అయినట్లు ప్రవర్తిస్తారు. "నాయకులకే రక్షణ లేకపోతే ఎలా......?"అనీ, "మీడియా స్వేచ్చకి భంగం వాటిల్లితే ఎలా....??" అని తెగ కాకి గోల చేసేస్తారు.
కాబట్టి ఓ నాయకులారా, మీడీయ పెద్దలారా.......ప్రజల స్వంత విషయాలలో కానీ, ధార్మిక విషయాలలో కానీ బాగా జనం గుమికూడే దగ్గరకి మీరు రాకండి, అక్కడి విషయాలలో తల దూర్చకండి, అక్కడి పరిపాలనకి సంబంధించిన వాటిలో వేలు పెట్టకండి.....బధ్రత అదే వస్తుంది.
*************
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
-----------------------------------------------------------------------------------------------------------------
******************************
అందరికీ దీపావళి శుభాకాంక్షలు
********************************
----------------------------------------------------------------------------------------------------------------
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
బొమ్మలన్నీ గూగల్వె ...మిక్సింగు కేఆర్కే
మన పుణ్య క్షేత్రాలకు ఇటువంటి ముప్పు ఉండటమే ఎంతో విచారించతగ్గ విషయం. మన దేశ బడ్జెట్ లో దాదాపుగా పావు వంతుకు పైగా రక్షణకే ఖర్చు పెట్టాల్సిన అవసరం కలిగించి మన పక్కనే ఉన్న చెత్త దెశాలవాళ్ళు, మనకు ఎంతో నష్టం కలిగించి, దేశ అభివృధ్ధితి గండి కొడుతున్నారు. వాళ్ళకి ఇజాల పేరునా, మతం పేరునా సమర్ధించే దేశద్రోహులు దేశంలోనే ఉన్నారు. అసలు శత్రువుల కన్నా ఈ ఇంటి శత్రువులతోనే ఎక్కువ ఇబ్బంది ఆపైన ప్రమాదం కూడా. కారణం వాళ్ళని పసి కట్టడం కష్టం. శత్రువును మనం గౌరవించవచ్చు, ఎందుకంటే, శత్రువు రూపాన కనపడుతున్నాడు కాబట్టి. ఇక్కడే, మనదేశంలో ఉండి చైనా పక్కన పాకిస్తాన్ పక్కన మాట్లాడే వాళ్ళను ఏమి చెయ్యాలి? అదే ఇప్పుడు దేశానికి పట్టిన పెద్ద సమస్య వాళ్ళ వల్లే. లేకపోతే ఎక్కడో ఉన్న పాకిస్తాన్ ఇంత దూరం వచ్చి ఏమైనా ఎలా చెయ్యగలదు!?
రిప్లయితొలగించండిశివరామప్రసాదు కప్పగంతుగారు స్పందించినందుకు ధన్యవాదాలు..........అవును, దేశం బయట కన్నా దేశంలోనే శత్రువులున్నారు......వారిని స్వేచగా తిరగనిచ్చే, మాట్లాడనిచ్చే మన దేశ రాజకీయ అసమర్ధత, దుర్బలత్వమే మన దేశానికి అసలు శత్రువులు. జిన్నాని మెచ్చుకొనే ఆయన హిందుత్వవాది......ఇదీ పరిస్థితి.
రిప్లయితొలగించండి