శలవలు వస్తే చాలు జనం ఒకటే పరుగులు...సొంత ఊరికి వెళ్ళే వారూ, భక్తితో యాత్రలు చేసే వారూ....సరదాగా ఊళ్ళు తిరిగే వారు. ఇలా, ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రయాణాల మీద ప్రయాణాలు చేసేస్తున్నారు. అయితే, చాలా మందికి తాము వెళ్ళబోయే ఊరు ఎంత దూరంలో ఉన్నది, ఎలా వెళ్ళాలి, ఏ ఊరికి దగ్గరలో ఉన్నది, అసలు ఎటువైపు వెళితే వస్తుందీ, ఎంతసేపు పడుతుందో తెలియదు.
అందుకని, మొత్తం ప్రపంచ జ్ఞానం కాకపోయినా, కనీసం మన రాష్ట్రంలోని తిరగాలిసిన ప్రదేశాల పట్ల కొంత తెలిసి ఉంటే బాగుంటుంది......దీని కోసమే ఇక్కడ కొన్ని సూచనలూ, ఏ ఊరు ఎలా వెళితే బాగుంటుందో తెలియ చెయ్యటమే నా ప్రయత్నం....
మన రాష్ట్రం వరకూ తీసుకొంటే, [అంటే పొలిటికల్ మేప్ ప్రకారం కాదు] చెన్నై నుండి రాయగడ-బరంపురం-కటక్కు వరకూ, బెంగుళూరు నుండి ఆదిలాబాదు-షిరిడీ వరకూ, బళ్ళారి నుండి తిరుపతి వరకూ మన జనాభా బాగా తిరుగుతుంటారు.
మొదలుగా, మా ఊరు విజయవాడని తీసుకొంటున్నాను. మా ఊరు కాబట్టి అని కాదు.........దేశంలో ఏ ప్రాంతం నుండి అయినా ఇక్కడికి రావచ్చును. అలాగే, ఇక్కడి నుండి రైళ్ళలో దేశంలోని అన్ని ప్రాంతాలకీ, బస్సులలో రాష్ట్రంలోని అన్ని చోట్లకీ చేరుకోవచ్చును. అయితే, దగ్గర ఊళ్ళు అయితే పరవాలేదు. ఏ శ్రీకాకుళమో, కడపో, అనంతపురమో, కరీంనగర్ వెళ్ళాలంటే డైరెక్టు బస్సు, రైలు కోసం ఆగితే టైము వృధా అవుతుంది......అందుకని ఇలా వెళితే బాగుంటుంది.........ముందుగా ..........
విజయవాడ నుండి విశాఖ-శ్రీకాకుళం, ఇచ్చాపురం, బరంపురం.........
ఇచ్చాపురం, బరంపురం, కుర్దా/పూరి, భువనేశ్వర్/కట్టక్ లాంటి ప్రదేశాలకి విజయవాడ నుండి డైరెక్టుగా రైళ్ళలో వెళ్ళటమే మంచిది....... వీటికి డైరెక్ట్ రైళ్ళు చాలా ఉన్నాయి. పగలు పూట వెళ్ళాలంటే... విజయవాడలో ఉదయానే 6:00 గంటలకి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి విశాఖలో మధ్యాహ్నం 12:20 గంటలకి దిగితే, విశాఖ నుండి భువనేశ్వర్ ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్ 3:20కి దొరుకుతుంది.......విజయవాడ నుండే కావాలిసిన ప్రదేశానికి డైరెక్టు టికెట్టు తీసుకోని, హాయిగా కూర్చొని వెళ్ళవచ్చును. అలాగే బొబ్బిలి, పార్వతీపురం, రాయగడలకి.......విజయవాడలో రాత్రి 9:00 గంటలకి పాసింజరు ఉన్నది......... దీనిలో మరునాడు మధ్యాహ్నం లోపల అక్కడికి చేరుకోవచ్చును.
శ్రీకాకుళం: దీనికి బస్సులో కాకుండా రైలులో[బోలెడు రైళ్ళు] ఆరు లేక ఆరున్నర గంటలు ప్రయాణం చేసి ఉత్తరాంధ్ర ద్వారం....విశాఖపట్నం వెళ్ళి, అక్కడి నుండీ నాన్ స్టాప్ బస్సులో 2 గంటలు ప్రయాణం చేసి చేరుకోవచ్చును. శ్రీకాకుళం రోడ్[ఆముదాలవలస]రైల్వే స్టేషను, శ్రీకాకుళం పట్టణానికి కనీసం 10 కిలో మీటర్ల దూరంలో ఉన్నది. శ్రీకాకుళం చేరిన తరవాత అక్కడి నుండీ పలాసా, సోంపేట, ఇచ్చాపురం వెళ్ళటం చాలా తేలిక. [ఇచ్చాపురం నుండి ముప్పావు గంటలో బరంపురం వెళ్ళవచ్చును] శ్రీకాకుళం నుండీ ఒరిస్సాలోని పర్లాకిమిడికి[పాతపట్నం[ఆం.ప్ర]కేవలం 2 గంటలలో చేరిపోవచ్చును. పాతపట్నం నుండీ బోలెడు ఆటోలు పర్లాకిమిడికి ఉంటాయి. శ్రీకాకుళం చుట్టు ప్రక్కలే అరసవిల్లి, శ్రీముఖలింగం, శ్రీకూర్మం లాంటి చక్కటి పుణ్య క్షేత్రాలు ఉన్నాయి.
సింహాచలం
విజయనగరం; విశాఖ నుండి చేరుకోవటానికి గంటంపావు ఎక్స్ ప్రెస్ బస్సులో ప్రయాణం చేసి చేరుకోవచ్చును, మూడు గంటలు ప్రయాణం చేసి సాలూరు, బొబ్బిలీ, బొబ్బిలి నుండీ మరో అరగంట ప్రయాణం చేసి పార్వతీపురం చేరుకోవచ్చును. విశాఖ నుండీ పుణ్య క్షేత్రమైన సింహాచలం వెళ్ళాలంటే సిటీ బస్సెక్కితే అరగంటా, నలభై నిమిషాలలో చేరుస్తారు. ఈ బస్సులు విశాఖపట్టణం రైల్వే స్టేషను దగ్గరే దొరుకుతాయి. విజయవాడ నుండి 5.00 గంటలు ప్రయాణం చేసి అనకాపల్లి దిగితే, అక్కడ నుండి నర్సిపట్నానికి గంటన్నరలో చేరుకోవచ్చును.
అన్నవరం
తునికి విజయవాడ నుండి రైలులొ నాలుగున్నర గంటలు ప్రయాణం చేసి, అక్కడి నుండి బస్సులో గంటన్నర ప్రయానంతో నర్సీపట్టణం చేరుకోవచ్చును. తుని నుండీ కేవలం 8 కిలో మీటర్ల దూరంలో ప్రకృతి అందాలుగల "లోవ" పుణ్య క్షేత్రానికి అటోలలో చేరుకోవచ్చును. విజయవాడ నుండి రైలులో షుమారు 4 గంటల ప్రయాణం చేస్తే ప్రముఖ పుణ్య క్షేత్రం అన్నవరం చేరుకోవచ్చును. స్టేషను బయట దేవస్థానం బస్సులు ఉంటాయి. విజయవాడ నుండి రైలులొ 3:30 గంటలు ప్రయాణం చేసి సామర్లకోట చేరుకొని, అక్కడ స్టేషను ఎదురుగా ఉన్న బస్‌స్టాండులో బస్సెక్కి అరగంటలో కాకినాడ చేరుకోవచ్చును......కాకినాడ నుండి బస్సులో గంటన్నర ప్రయాణం చేసి పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామం/కోటిపల్లి చేరుకోవచ్చును. సామర్లకోట నుండీ బస్సులో పుణ్య క్షేత్రం పిఠాపురం అరగంటలో చేరుకోవచ్చును. సామర్లకోట కూడా పంచారామాలలో ఒకటి. విజయవాడ నుండి రైలులో 2.30 గంటలు ప్రయాణం చేసి రాజమండ్రి దిగి, స్టేషను ఎదురుగా అమలాపురం బస్సెక్కితే కేవలం గంటన్నరలో అమలాపురం చేరుకోవచ్చును. బస్సులో అమలాపురం చుట్టు ప్రక్కల ఉన్న ముక్తేశ్వరం/కోటిపల్లి, అప్పనపల్లి, అంతర్వేది పుణ్య క్షేత్రాలను చూడవచ్చును.
ద్వారకా తిరుమల
ఏలూరు వెళ్ళటానికి విజయవాడ నుండి చాలా నాన్ స్టాప్ బస్సులు ఉన్నాయి. ఉదయాన వెళ్ళ దలిస్తే 8:15 నిమిషాలకి పాసింజరు రైలు ఉన్నది. రు.10/- ఇచ్చి ఇందులో గంటన్నర ప్రయాణం చెసి ఏలూరు పట్టణం మధ్యలో ఉన్న పవర్‌పేట స్టేషనులో దిగవచ్చును. మనం బస్సులో రు. 40/- ఇచ్చినా 2 గంటలు ప్రయాణం చేసి ఊరి బయట ఉన్న బస్‌స్టాండులో దిగవలిసినదే.......ఏలూరు దిగితే, అక్కడి నుండి బస్సులో గంటలో కైకలూరు, తాడేపల్లిగూడెం, పుణ్య క్షేత్రమైన ద్వారకా తిరుమల[చిన్న తిరుపతి] చేరుకోవచ్చును. జంగారెడ్డిగూడెం, చింతలపూడి మరియూ భీమవరం, పాలకొల్లు, నర్సాపురాలకి ఏలూరు నుండి బస్సులు ఎక్కువ దొరుకుతాయి.
ఈ క్రింద లింకులు నొక్కితే విజయవాడ -విశాఖపట్టణం-విజయవాడ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ టైం టేబుల్స్ ఉన్నవి......
విజయవాడ-విశాఖ @ విశాఖ-విజయవాడ
విజయవాడ -రాజమండ్రి/కాకినాడ-విశాఖపట్టణం-కాకినాడ/రాజమండ్రి విజయవాడ పాసెంజరు రైళ్ళు
విజయవాడ -రాజమండ్రి/కాకినాడ-విశాఖపట్టణం-కాకినాడ/రాజమండ్రి విజయవాడ పాసెంజరు రైళ్ళు
57201 VIJAYAWADA-RAJAHMUNDRY-VISAKHA[57235] 04:30
57200 [67299] RAJAHMUNDRY-VIJAYAWADA 17:15
67261 VIJAYAWADA-RAJAHMUNDRY 18:20
67262 RAJAHMUNDRY-VIJAYAWADA 03:45
67295 RAJAHMUNDRY-VISAKHA 11:15
57236 VISAKHA-RAJAHMUNDRY 17:00
67296 VISAKHA-RAJAHMUNDRY 18:10
[ఈ రైళ్ళు విజయవాడ రావు]
57457 Vijayawada[Tpty]-Kakinada Port 12-30
57458 Kakinada Port-Vijayawada[Tpty] 07:00
57255 KAKINADA-VISAKHA 04:30
57256 VISAKHA-KAKINADA 17:00
[ఈ రైళ్ళు విజయవాడ రావు]
[ఈ రైళ్ళు విజయవాడ రావు]
57231 VIJAYAWADA-KAKINADA[FAST] 17:25
57232 KAKINADA-VIJAYAWADA[FAST] 04:45
57225 VIJAYAWADA-VISAKHA 08:25
57226 VISAKHA-VIJAYAWADA 09:15
57229 MACHILIPATNAM/NARSAPURAM-VISAKHA 21:15
57230 VISAKHA-MACHILIPATNAM/NARSAPURAM 20:10
[ఈ రైళ్ళు విజయవాడ రావు]
[ఈ రైళ్ళు విజయవాడ రావు]
57271 VIJAYAWADA-VISAKHA-RAYAGADA 21:00
57272 RAYAGADA-VISAKHA-VIJAYAWADA 15:45
పైన అన్ని ఊళ్ళకీ విజయవాడ నుండి డైరెక్టు బస్సులు కూడా ఉన్నాయి. కానీ, మన ప్రయాణ కాలం మరియూ అమూల్యమైన కష్టార్జితాం వృధా అవుతుంది. అలాగే డైరెక్టు రైళ్ళు కూడా ఉన్నాయి....కానీ అవి ఎక్కువ లేకపోవటం, రిజర్వేషను అనుకున్న సమయానికి దొరకక పోవటం వలన చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది.
ఈ లింకు నొక్కితే విజయవాడ నుండి వరంగల్ వైపునకు ప్రయాణ వివరాలు ...........
*************
కర్టేసి ఇండియా రైల్ ఇన్ ఫో
చాలా శ్రమపడి మంచి సమాచారం సేకరించారు.thanks.
రిప్లయితొలగించండిVery informative. Continue the good work.
రిప్లయితొలగించండిశివరామప్రసాదు కప్పగంతు గారు, jyothi గారు, స్పందించినందుకు మీకు ధన్యవాదాలు......ప్రత్యేకించి శ్రమ పడిందేమీ లేదు.......చాలా సంవత్సరాలుగా వ్యాపారం పని మీద రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన ప్రదేశాలే.......రాష్ట్రంలోని అన్ని ప్రదేశాల గురించి తెలియ చెయ్యటానికి ప్రయత్నిస్తాను.
రిప్లయితొలగించండి