యుద్ధాల కోసం, పురాణ కాలంలో అయితే, పెద్ద ఎత్తున సైన్యం... గుర్రాలూ, ఏనుగులూ, బాణాలూ, అస్త్రాలు, శస్థ్రాలు; తరవాత కాలంలో ఫిరంగులు....ఆ తరవాత కాలంలో ట్యాంకులూ, విమానాలు, బాంబులూ; మరి ఇప్పుడు ... అణుబాంబులు, ఖండాంతర క్షిపణులూ, ఒక చోట కూర్చొని ప్రపంచాన్నే నాశనం చెయ్యగల టెక్నాలజీ......... పాత కాలం నుండీ ఇప్పటి వరకూ సైన్యం అనేది కామన్‌గా ఉండి, మిగిలినవి పెరుగుతూ వచ్చినాయి...ఎందుకు.....??? ఇన్ని తెలివి తేటలని ఆయుధ సామాగ్రి ఆధునీకరణకు ఎందుకు వాడుతున్నారు.....? కొట్టుకు చావటానికేనా...ఈ యుద్ధాలన్నీ........??? లేక లాభం ఆశించా...?? ఏమిటి లాభం....?
ఒక దేశం మరొక దేశాన్ని ఆక్రమిస్తే అదీ కూడా దేశంలోని అంతర్భాగం అవుతుంది కదా......? ఆక్రమిత దేశాల వారిని కూడా స్వంత ప్రజల లాగే చూడాలి కదా.....?? కానీ, ఎప్పటికీ అలా జరగలేదు....ఇంగ్లీషు, ఫ్రాన్సు, డచ్చి మొదలైన దేశాల వారు తాము ఆక్రమించుకొన్న దేశాల నుండీ శతాబ్దాల తరబడి దోపిడీలు చేసి.....ఆయా దేశలను పిప్పి చేసి వదిలించుకొన్నారు. రష్యా కూడా 70 ఏళ్ళ పాటూ తాను ఆక్రమించుకొన్న దేశాలను అలాగే వాడుకోవటం వలన, ఆ దేశాలు కూడా అవకాశం రాగానే "USSR" కి దూరం అయినాయి. చైనా కూడా టిబెట్టుని ఆక్రమించుకొని, అక్కడి ప్రజల చేత వెట్టి చాకిరీ చేయించుకొని, సరైన డబ్బులు ఇవ్వకుండా, అలా తయారైన వస్తువులను అతి చవుకగా ప్రపంచ దేశాలలో అమ్ముతోంది.....
సరే, విషయంలోనికి వస్తే........ ఇప్పుడు, ప్రపంచం చిన్నదైపోయింది......అనే కంటే చిన్నదిగా చేసేశారు యూరప్పు తెలివిగల వారు.....ఎవరైనా ఇంకొకరి మీద దాడి చేస్తే వారు ఊరుకొనే స్థితి లేదు.....ఎందుకంటే ఆ హక్కు వారిదే మరి......వారికి తెలియకుండా ఏదీ జరగ కూడదు....పైగా వారి వ్యాపారాలన్నీ అలాగే ఉండాలి కదా......అందుకు అన్ని యూరప్పు దేశాల వారూ అప్పటిదాకా ఉన్న దోపిడీ దొంగల వేషాలని తోలగించి పెద్దమనుషుల వేషాలని తగిలించుకొన్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నది...యూరప్పు వారికి. బాగాలేనిది ఆక్రమణలకి గురైన దేశాలకి......బాగున్న వారు, శతాబ్దాల తరబడి దోచుకొన్న సొమ్ముతో జల్సాలు చేస్తుంటే......., ఆక్రమణలకి గురైన ఆసియా, ఆఫ్రికా దేశాలు వళ్ళు దగ్గర పెట్టుకొని అభివృద్ధి చెందటం మొదలు పెట్టినాయి...ఇలా కొన్ని దశాబ్దాలు గడచినాయి.......
క్రమంగా పరిస్తితులు మారినాయి.....దిగువున ఉన్న దేశాలలో అభివృద్ధి చెందటం మొదలైంది...... ఒకప్పుడు ఆక్రమణలకి గురైన దేశాల వారు స్వయం సమృద్ధి..... అంటే, తమకి కావాలిసిన అన్ని వస్తువులని తామే సమకూర్చుకోవటం, వ్యవసాయపరంగా, విద్యాపరంగా, సాంకేతికపరంగా ఎవరి కాళ్ళ మీద వారు నిలబడటం మొదలు పెట్టారు. దీనితో, ప్రపంచ మార్కెట్టులో యూరప్పు జనాల వస్తువులకీ, తెలివితేటలకీ వ్యాపారపరమైన డిమాండు తగ్గిపోనారంభించింది.......ఒకప్పుడు వెలిగిపోయిన దేశాలలో అశాంతి మొదలైంది.....ఇలా ఉంటే యూరప్పువారికి ఎందుకు నచ్చుతుందీ....?? తాము ఆక్రమించుకొన్న దేశాలను భౌతికంగా వదిలివేసినా.......వ్యాపర పరంగా వాటి గుప్పిటలోనే పెట్టుకొని ఉన్నాయి కదా.......వారు ఏమీ తెలివి తక్కువ వారు కాదు కదా.....ప్రపంచంలోని అన్ని దేశాల సంపదతో పాటూ... తెలివిని కూడా స్వంతం చేసుకొన్న వారు కదా....!!

అందుకనే, ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే తెలుసు......ఇంతకు ముందర నుండీ వాడుతున్న "చిన్న ప్రపంచం" నినాదానికి బాగా పదునుపెట్టారు......వారి మార్కెట్టులని డైరెక్టుగా ఒకప్పుడు ఆక్రమణలకి గురైన దేశాలలో నెలకొల్పటం మొదలెట్టారు....వారి దేశాలలోనూ....ఆక్రమణ గురైన దేశాల వారికి అవకాశం ఇచ్చారు.....!!!!! కానీ, ఎవరు మార్కెట్టింగు చేసినా వస్తువులు మటుకూ యూరప్పువారి వస్తువులే మరి.... 90 శాతం యురోపియన్లవే లేక ఆక్రమణ దారుల దేశాలలో తయారైన వస్తువులే........ఈ విధంగా చెయ్యటం వలన ఆక్రమణలకి గురైన దేశాలలోని ప్రజలు పనీ పాటలు లేకుండా పోతారు......కొనుగోలు శక్తి నశిస్తుంది......
ఎందుకంటే, మాల్‌లో కొన్న వస్తువులు మన దేశంలో తయారైనవి అయితే పరవాలేదు........ మనం చెల్లించిన సొమ్ము, వస్తువు తయారు చేసిన మన దేశం వ్యక్తులకి, జీతం రూపంలో వెళుతుంది.... ఆ జీతంతో ఆ వ్యక్తులు మన ఎకానమిలోనే[దేశంలోనే] ఖర్చు చేసి మన దేశం వారికే ఆదాయాన్ని ఇస్తారు. కానీ, మాల్‌లో కొనే వస్తువులు విదేశాలలో వ్యక్తులు తయారు చెయ్యటం వలన, మనం ఖర్చు చేసే డబ్బు మొత్తం విదేశాలకి వెళ్ళి వేరొకరికి ఆదాయంగా మారుతుంది.......... ఈ డబ్బుతో వారి దేశంలో వస్తువులు కొని వారి దేశం వారికి ఆదాయాన్ని ఇస్తారు.........మన దేశం వారికి పనికి రాదు.......క్రమంగా దేశం బలహీనపడిపోతుంది. ఆ... ఇది వ్యాపారస్తులకీ, ఇతరులకీ కదా అనుకునే ఉద్యోగస్తులకి కూడా పనీ పాటా ఉండదు......పని లేకుండా జీతాలివ్వటం కుదరదు కదా....అవసరం తగ్గి ఉద్యోగులనూ తగ్గిస్తారు. ఈ విధంగా అందరి కొనుగోలు శక్తీ తగ్గి, క్రమంగా తిరిగి దేశం బలహీన పడి మళ్ళీ యురప్పు వారి మీదే అధారపడవలసి వస్తుంది.
అయితే, ఈ క్రమంలో, ఏసీ షో రూములో అందమైన వస్తువులూ, ఆకర్షణీయమైన ధరలకి దొరకటం వలన అన్ని వర్గాల ప్రజలూ ప్రలోభానికి గురైపోతారు......దేశాన్ని గురించి ఆలోచించాలిసిన మంత్రులే ప్రలోభాలకి లోబడినప్పుడు, సామాన్య ప్రజలది లెక్కలోనికి రాదు. ఎవరికి వారు, ఆ ఇది మనకి ఏమీ నష్టం కాదులే అనీ ఉద్యోగస్తులూ, వ్యాపారస్తులూ, వ్యవసాయం చేసే వారూ.....చివరకి రాజకీయ వేత్తలూ... ఐక్యత లోపించి వర్గాలుగా విడిపోయారు.....శతాబ్దాల క్రింద రాజులూ కొట్టుకుచచ్చి అనైక్యంగా ఉండటం వలన ఆక్రమమణకి గురైన మన దేశం, మరల అదే విధమైన వాతావరణానికి అవకాశం ఇస్తోంది!!! "మనని మనం నమ్ముకొనే కన్నా, మనని శతాబ్దాల తరబడి మోసం చేసిన వారినే నమ్ముతున్నాం".........అదే యురోపియన్ల తెలివితేటలు!!
వీటన్నిటికీ కారణం...దేశంలో బాగా పెరిగిపోయిన "ఎర్ర తెగులు" కానీయండీ, "తెల్లమచ్చ తెగులు" కానీయండీ...... ఈ తెగుళ్ళు తగ్గటానికి కావాలిసిన "దేశభక్తి మందును" 50 శాతం చదువుల్లో, మిగిలిన 50 శాతం రాజకీయ వ్యవస్థలో కలిపి పిచికారీ చెయ్యవలసి ఉంటుంది. సామాన్యంగా వ్యవసాయ భూమిలో రైతు తన పొలానికి పట్టిన తెగులును సకాలంలో మందులు వాడీ చక్కబరచుకొంటాడు.....కానీ, అలాంటి రైతులు తగ్గిపోయి, ఇప్పుడు దిగుబడే ధ్యేయంగా పనిచేసే కమ్మర్షియల్ రైతులు పెరిగి పోయారు......వీరికి కావాలిసినది డబ్బు..........అంతే ......!
మళ్లీ అసలు విషయంలోకి వస్తే, ఒక దేశం మరొక దేశాన్న్ని యుద్దంలో ఓడించి ఆక్రమించుకొన్న తరవాత ఏమి చేస్తారో, దానినే మన వాళ్ళే దగ్గరుండి మరీ చేయిస్తున్నారు. అంటే ఇంత సైన్యం ఉండీ, రక్షణ కోసం వేలకోట్ల రూపాయలను వెచ్చిస్తో ఉండి కూడా, దేశ ప్రజలు మరే దేశం మీద ఆధారపడకుండా......మరే దేశం క్రింద పనిచేయకుండా రక్షించాల్సిన మన రాజకీయ వ్యవస్తే శత్రువులను రెడ్ కార్పెట్ వేసి మరీ పిలుస్తు ఉంటే ....యుద్ధం చెయ్యకుండానే ఓటమిని అంగీకరించినట్లా..... ఎఫ్ డి ఐ అంటే "FOREIGN DIRECT INVESTMENT అని కాదు....... FOREIGNERS DEFEAT INDIANS " అని అర్ధమని మన పాలకులకి ఎవరు చెపితే వింటారు.........!!! యుద్ధం జరిగితే ఏమవుతుందీ...? జరిగి ఓడిపోతే దేశంలో ఏమి జరుగుతుంది...?? అది మనవాళ్ళే చేసి చూపించబోతున్నారు..........
*******************
శత్రువులను రెడ్ కార్పెట్ వేసి మరీ పిలుస్తున్నారా.......???[FDI--PART..I]
శత్రువులను రెడ్ కార్పెట్ వేసి మరీ పిలుస్తున్నారా.......???[FDI--PART..I]
ఎలికల కోసం ఏనుగులని తెచ్చుకొంటామా...? [FDI....PART-2]
కిలో దొండకాయలు కేవలం 2 డాలర్లు మాత్రమే .....!!!![FDI--PART..3]
ఇందులోని బొమ్మలు గూగుల్ లోనివి.....మిక్సింగ్ కేఆర్ కే
although many points raised by you are debatable, I like the way you have written.
రిప్లయితొలగించండిGood writing.
బాగా చెప్పారండి. ఇదంతా ప్రజల దురదృష్టం.
రిప్లయితొలగించండిమేధావులనబడే వాళ్ళు కూడా వీటిని సమర్ధించటం మరింత దురదృష్టం.
యధారాజా తధాప్రజా.....యధాప్రజా తధా రాజా. అన్నట్లుంది.
శివరామప్రసాదు కప్పగంతు గారు,anrd గారు స్పందించినందుకు మీకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి* Radhakrishna.. గారు , మీరు వ్రాసిన టపాలోని విషయాలు బాగున్నాయని నా అభిప్రాయమండి.
రిప్లయితొలగించండి* శివరామప్రసాదు గారి వ్యాఖ్య కూడా చక్కగా ఉంది.
నేను వ్రాసినది మళ్ళీ నచ్చినందుకు మీకు ధన్యవాదాలు!!! ఏ ఇజాలకి ప్రభవితం కాకుండా ......ఉన్నదేదో వ్రాశాను.......అంతే. నేను ఎదో వ్రాశానే కానీ, ప్రజలెవ్వరికీ FDI ల సమస్య మీద ఆశక్తి ఉన్నట్లు కనబడలేదు...... మన ప్రజలు చాలా సున్నితమైన వారు....ఏదైనా తమకి గుచ్చుకొనే వరకూ దానిని పట్టించుకోరు.....లోకల్ మాల్స్ వచ్చినప్పుడే ధరలు పెరుగుతాయన్న గోలని ఎవరూ పట్టించుకోలేదు.....బియ్యం,పప్పులూ, కూరలూ పెరిగిన తరవాత ఇప్పుడు అనుకొని ఏమి లాభం......చెతులు కాలిన తరవాత..... ఇక విదేశీ పెట్టుబడులు దేశం మీద దాడి చేసిన తరవాత కానీ మన వారికి చలనం కలగదు........ఇది భారత్ పరిస్థితి శతాబ్దాలుగా...........
రిప్లయితొలగించండి