LOCAL WEATHER

6, జూన్ 2012, బుధవారం

ఎలక్షన్ కమీషను వారికి విజ్ఞప్తి


మన రాష్ట్రంలో 18 నియోజక వర్గాలలో వచ్చిన ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి అమలవుతుంది. దీని వలన అభ్యర్ధులు లేక వారి చిన్నా చితకా మొదలుకొని పెద్ద నాయకుల రోడ్డు ప్రచారాలతో ఆయా నియోజక వర్గాలలో హొరెత్తకుండా కొన్ని కాల పరిమితులు కూడా వచ్చాయి.

కానీ, మన న్యూస్ చానళ్ళ మాటేమిటి.......? ఉదయం నుండి సాయంత్రం వరకూ రాజకీయ నాయకులు చేసిన హడావిడిని ఒక ప్రక్క "ఉచితంగా" ప్రత్యక్ష ప్రసారాలు చెయ్యటమే కాకుండా......సాయంత్రం నుండీ మరునాడు ప్రొద్దున వరకూ అవే వేసినవే వేసి రాజకీయ పార్టీలకి "ఉచిత{?}ప్రచారం" చేసిపెడుతున్నాయి మన ఘనత వహించిన మ్యుజికల్ వార్తా చానళ్ళు.

రాజకీయ నాయకుల హోరు కన్నా వీటి గొడవ ఎక్కువ అయిపోయింది. ఎన్నికల ప్రచారమే కాకుండా...ఎక్కడ ఎవరు గెలుస్తారూ....ఎవరికి ఇది జీవన్మరణ పరీక్ష....... పార్టీకి ఇక నూకలు చెల్లిపోతాయీ.... వ్యక్తులు 2014 ఎన్నికలలో ముందుకు వస్తారు ....లాంటి అనేకమైన పనికిమాలిన ప్రసంగాలు...రివ్యులతో ప్రజలను  బాధ పెడుతున్నారు. వీటి వలన ఎన్నికలు జరిగే ప్రదేశాలలో ప్రజలు[ఓటర్లు] అనవసర ప్రభావాలకి గురి అయ్యే అవకాశం ఉన్నది. దీని వలన ఆయా నియోజక వర్గ ప్రయోజనాలు కాకుండా, అనేక పనికి మాలిన విషయాలపట్ల ఓటర్లు ప్రభావితం అవుతున్నారు. దీని వలన అనేక ఉద్రిక్తతలకు అవకాశం ఇచ్చినట్లు అవుతోంది. ప్రజాసామ్యంలో వీటీ అవసరం ఉన్నా.....ఇవి ప్రజాసామ్యాన్నే అపహాస్యం చేసేంతగా ప్రవర్తిస్తున్నాయి.
సరే, ఎదో 18 స్థానాలలో ఎన్నికలు జరుగుతున్నాయి బాగానే ఉన్నది. మరి మిగిలిన నియోజక వర్గాల ప్రజలేం పాపం చేసుకొన్నారు?? ఎన్నికల పేరుతో వారిని కూడా 24 గంటలూ వేధించుకుని తింటున్నాయి. న్యూస్ చానళ్ళ లెక్క ప్రకారం కేవలం తెలుగు వస్తే చాలు..... వారు ప్రపంచంలో ఎక్కడున్నా సరే 18 నియోజక వర్గ ఎన్నికల గురించే తల్లడిల్లి పోవాలి మరి. రాష్ట్రంలో మరే సమస్యలూ లేవా చూపించటానికీ.....మరే అభివృధినీ ప్రజలు కాంక్షించటంలేదా రాష్ట్ర ప్రజలు. వారి వారి మనో భావాలను చానళ్ళు తుంగలోకి తొక్కి.....చాలా నిరంకుశంగా వారికి తోచిందే వార్త అన్నరీతిన ప్రజల మీద రుద్దుతున్నాయి. విధంగా 18 నియోజకవర్గాల ఉద్రిక్తతని అన్ని నియోజక వర్గాలకీ వ్యాపింపచేస్తున్నాయి.



కాబట్టి, ఎలక్షన్ కమీషను వారికి విజ్ఞప్తి ఏమంటే మన రాష్ట్రంలో ఉన్న 15 లేక 20 చానళ్ళనూ సవ్యమైన పద్దతిలో నడిచేటట్లు నియంత్రించాల్సిందిగా చేయ్యగలరు. అప్పుడే రాష్ట్రంలో సవ్యంగా నిస్పక్షపాతంగా ఎన్నికలు జరిగి రాష్ట్రం ప్రశాంతంగా ఉండే అవకాశం ఉన్నది.


ఇందులోని బొమ్మలన్నీ గూగుల్లోనివే

3 కామెంట్‌లు:

  1. EXCELLENT SUGGESTION. I HOPE ELECTION COMMISSION SEES THIS NICE ARTICLE AND ACTS UPON IT SUO MOTTO.

    PLEASE TAKE A COPY AND SEND THIS TO ELECTION COMMISSION IN HYDERABAD AS WELL AS DELHI.

    రిప్లయితొలగించండి
  2. abba...emi post guru very very good post in recent times and another dimension thought

    రిప్లయితొలగించండి
  3. శివరామప్రసాదు కప్పగంతు గారూ and vedam gaaru మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి