LOCAL WEATHER

26, జూన్ 2012, మంగళవారం

రాష్ట్ర ప్రజలందరూ తాగుబోతులా.....???
మన రాష్ట్ర ప్రభుత్వ "తాగుబోతుల నిపుణుల సంఘం" లెక్కల ప్రకారం అలాగే కనిపిస్తోంది. ఎందుకంటే 2 లక్షల జనాభా ఉన్న ప్రాంతానికి ఇంత రేటు....5 లక్షలు ఉన్న ప్రాంతానికి మరికొంత రేటూ....అంతకన్నా ఎక్కువైతే మరింత రేటూ అని నిర్ణయించేశారు. ఎక్కువ ఆదాయం ఎలా రావాలీ అనే ఆదుర్దాలో ప్రజలందరినీ ఒకే గాటన కట్టేసి అవమానిస్తున్నామన్న సంగతి మన లాటరీ ప్రభుత్వ నిపుణులకి పట్టలేదు.


అయినా, ఒక ఏరియాలో 20 లక్షల మంది ఉంటే అందరూ తాగుతారా....? లేదా ఎక్కువ మంది తాగుతారా....?? 2 లక్షల మంది జనాభా ఉండే చోటు ఎక్కువ మంది ఎక్కువ సార్లు తాగే తాగు బోతులుండే అవకాశం లేదా....??? విధమైన నిపుణతతో లెక్కలు కట్టినా...... మొత్తానికి ప్రజలందరినీ తాగుబోతులుగా చేసేశారు.

మన జనాభా లెక్కల డిపార్టుమెంటువారు దేశం మీద పడి కష్టంతో సేకరించిన జనాభా వివరాలను చాలా అవమానకరంగా మద్యం ఆదాయం కోసం వాడతారా....? అసలు జనాభా లెక్కలు దేని కోసం....?? ప్రాంతాలలో ఎంత మంది జనాభా విధంగా ఉన్నారు......... విధంగా బ్రతుకుతున్నారు.....వారిలో వెనుక బడినవారు ఎంతమంది.........ఇలా చాలా విషయాలను సేకరించి వారికి కావాలిసిన మౌలిక సదుపాయాలను అందించటానికి ఉద్దేశించబడిన జనాభా లెక్కలను మద్యం కోసం వాడి రాష్ట్ర జనాభానే అవమాన పరుస్తున్నారు.

మద్యం
మీద ఆధార పడి మానవ వనరులను దుర్వినియోగ పరచేకన్నా అభివృద్ధిలో 28వ రాష్త్రంగా ఉండటమే మేలు. అనేక రాష్ట్రాలు ఈ దిక్కుమాలిన ఆదాయం లేకుండానే, తమ మానవ వనరులను సక్రమంగా వాడుకొని అభివృద్ధి చెందుతున్నాయి. సరే, ఇంత చెప్పినా మద్యం మీదే పడి బ్రతకాలంటే 10 టూ 5 ఉద్యోగం కోసం ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగ నిపుణులకేమి తెలుస్తుంది....? అదే కావాలంటే క్రింద విధంగా చేస్తే బావుండచ్చు.....


1] ప్రతీ ప్రాంతంలోని తాగుబోతులందరికీ ఒక గుర్తింపు కార్డునివ్వటం.

2] కార్డులకి "ఆదాయశ్రీ కార్దులు" అని పేరు పెడితే తాగుబోతులకి కూడా ఆత్మ విశ్వాసం పెరిగే అవకాశం ఉన్నది.

3] కార్డులో తాగుబోతు వివరాలను.....అంటే అతని పేరు....అడ్రెస్సూ లాంటివి కాదు[ఎవడిక్కావాలి]......అతను ఎంత తాగ గలడు....ఎన్నాళ్ళ నుండీ తాగుతున్నాడు...... ఇంకా ఎన్నాళ్ళు తాగగలడు మొదలైన వివరాలు ఉండాలి.

4] దీని వలన ప్రాంతాలలో ఎంతమంది తాగుబోతులున్నారో వారు ఎంత మద్యాన్ని కొనుగోలు చెయ్యగలరో తెలుస్తుంది. లెక్కల బట్టి ఆయా ప్రాంతాలని విభజించి...మాంచి ఆదాయాన్ని దండుకోవచ్చును.

5] మరి కార్డులు తీసుకొన్నవారికి ప్రత్యేక ఆకర్షణగా ఆరోగ్య, రవాణా పాసు లాంటి మొదలైన సౌకర్యాలని కల్పించాలి. ఇది వారికోసం కాదు...." తాగుబోతులు ఎంతకాలం బ్రతికుంటే అంత ఆదాయం కదా ".

6] అలాగే, ప్రతీ సంవత్సరం ఎక్కువ తాగిన వారికి ప్రోత్సాహక బహుమంతులూ...."తాగుబోతు"....,,,,,,.."మహాతాగుబోతు",,,,,,,......."వీరతాగుబోతూ"............."ప్రచండతాగుబోతూ"......అని బిరిదులిస్తే...............ఇహ ఆదాయమే ఆదాయం.


అయ్యయ్యో, పై లెక్కలు తీసుకోవటానికీ, బహుమతులు ఇవ్వటానికీ  బోలెడు ఖరుచు అవుతుందన్న బాధా లేదు....... విషయాన్ని మన మద్యం వ్యాపారులు చాలా చక్కగా ఫైనాన్సు చేసి నిర్వహించ గలరు. కాబట్టి భయం కూడా అక్కర్లేదు.


పై బొమ్మలన్నీ గూగుల్వే6 వ్యాఖ్యలు:

 1. రాష్ట్రంలో అందఱూ కాకపోయినా 80 శాతం మంది మగవాళ్ళు కనీసం అప్పుడప్పుడైనా చుక్కేసుకునేవారే ననడంలో సందేహం లేదు. వాళ్ళ లెక్కలెలా ఉన్నా మనకి అన్నిచోట్లా కళ్ళక్కట్టినట్లు కనిపిస్రోంది గదా !

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Excellentsatire Radhakrishna!

  The drunkards and the Govt. encourging them should hang their heads in shame after reading this excellent parody of Govt. Policy.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. శివరామప్రసాదు కప్పగంతుగారూ, LBS తాడేపల్లిగారూ మీకు ధన్యవాదాలు. LBS తాడేపల్లిగారూ...80 శాతం మొగవాళ్ళంటున్నారు......అంతమంది తాగినట్లైతే మనకి ప్రస్తుతం వస్తున్నా మద్యం ఆదాయం కన్నా ఎన్నో రెట్లు వచ్చే అవకాశం ఉన్నది. ఒక్కో జిల్లాకీ ఎన్నో వేల మద్యం దుకాణాల అవసరం కూడా పడేది; ఇప్పటికి మన అదృష్టం కొద్దీ ప్రతీ జిల్లాకీ వందల సంఖ్యలోనే ఉన్నాయి. చెడు కొద్దిగా ఉన్నా ఎక్కువ కనపడుతుంది. మనం ఏదైనా కొత్త ఊరికి వెళ్ళీ వెళ్ళగానే నలుగురు తాగుబోతులు కనపడంగానే, ఆ ఊళ్ళో అందరూ తాగుబోతులులాగానే కనపడటం సహజం.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. రాష్ట్రంలో జనాభా లెక్కలకీ, ఏటా ప్రభుత్వానికొస్తున్న ఆదాయానికీ నేను వ్రాసినది కరెక్టుగా సరిపోతోంది. గమనించండి. రాష్ట్రంలో ఎదిగిన మగవాళ్ళు 2 కోట్ల 70 లక్షల మంది అనుకుంటే కనీసం వారానికో రు. 100 ల ప్యాకెట్ కొనుక్కుని తాగినా, ఒక్కొక్కడూ నెలకి రు.400, అలా ఏడాదికి రు.4800 చొప్పున ఖర్చుచేస్తాడు. అలా 2 కోట్ల 70 లక్షల మందిలో 80 శాతం మంది యొక్క తాగుడుఖర్చు లెక్కవేయండి. రు.10,368 కోట్లుగా తేల్తోంది. ఇక్కడ నావి కాకిలెక్కలేననుకోండి. అయితే నిజానికి మన రాష్ట్రంలో త్రాగుడు మీద ఆదాయం ఇంతకంటే ఎక్కువే.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. "త్రాగుడు మీద ఆదాయం ఇంతకంటే ఎక్కువే".......అలా జరిగేటట్లు కొన్ని దశాబ్దాలుగా పాలక, ప్రతిపక్షాలు బాగా కృషి చేసినాయి. దాని ఫలితంగా మిగిలిన ఆదాయాలు క్రిందికి పోయి ఇదే ఎక్కువగా అయ్యి, మరింత ఎక్కువగా కనపడుతోంది. తరవాత, మీ లెక్కలు ప్రకారం చూసుకొన్నా పిల్లలూ, ఆడవారూ, తాగని మొగవారూ కలిపితే రాష్త్ర జనాభా లెక్కల ప్రకారం కనీసం 80 శాతం మంది అవుతారు, మిగిలిన 20 శాతం మందే తాగుబోతులు ఉన్నట్లు అయింది.......... కానీ నా బాధంతా కేవలం లెక్కల కోసమే కాదు......తాగుడే ముఖ్యాదాయ వనరా అని.....

  ప్రత్యుత్తరంతొలగించు