LOCAL WEATHER

30, జూన్ 2012, శనివారం

ఆయసపడుతున్న సామాన్యుడు..........అభివృద్ధి


మన దేశంలో కొంతకాలంగా జరుగుతున్న అభివృద్ధిని అందుకోలేక సామాన్య ప్రజలు పరుగులు పెడుతున్నారు. జరిగే అభివృద్ది అంతా మన ఆర్ధిమ మాంత్రికుల నొట్లోనూ "నోట్లోనూ" కపడుతుందే తప్ప సామాన్యుడి జీవితంలో కనపడటంలేదు. అందుకే లేని దాని కోసం పరిగెడుతున్న సామాన్యుడు ఆయాస పడుతున్నాడు.

ఇదివరలో ఎవరైనా ఒక సారి గెలిస్తే మళ్ళీ ఎలెక్షన్స్ వచ్చేదాకా ప్రజల గురించి ఆలోచించేవారు. కానీ ఇప్పుడు మళ్ళి రాబోయే ఎలెక్షన్ల గోలలో పడి, లెక్కలు చెప్పి.......... మేమేదో గొప్పగా పరిపాలిస్తున్నమన్న భావన ప్రజలలో కలగజేస్తున్నారు. క్రమంలో ఆర్ధిక వేత్తల అవసరం పెరిగింది.
మన దేశంలో ఆర్ధిక మంత్రులకి అంతగా ప్రధాన్యం లేని రోజుల్లోనే సామాన్య ప్రజలు గురించి ఆలోచిచేవారు.....వారు కూడా ఎంతో కొంత హాయిగానే బ్రతికేవారు. కానీ, తరవాత కాలంలో ఆర్ధిక వేత్తల ప్రాధాన్యం పెరిగి పెరిగి చివరకు ఆర్ధిక వేత్తే ప్రధాని కూడా అవటం జరిగింది. కానీ, సామాన్యుల జీవితంలో అప్పటి నుండే కన్ఫ్యుజన్ మొదలైనది.


కనీసం తమ బ్రతుకేదో తమకి తెలిసెటట్లుగా సామాన్య జనానికి స్పృహ ఉండేది. కానీ ఇప్పుడు, మన ఘనత వహించిన మంత్రులు మనమేదో వెలిగి పోతున్నామని ఒకరు, 9 శాతం నుండి 10, 11 శాతానికి మన వృద్ధి రేటు{?} ఉన్నది అని లెక్కల గారడీ చేసి......."మీరందరూ హాయిగానే ఉన్నారు".......అని అక్కడతో ఆగకుండా, ఘనత అంత తమదేనని గొప్పగా మొహాలు పెట్టి తిరుగుతునారు. మాటలతో సందేహం కలిగిన సామాన్య ప్రజలకి "మనమే బాగాలేమా" అని ఎవరికి వారు తమలో తాము కుమిలి పోతున్నారు.


అంకెల గారడీ అని ఎందుకన్నానూ అంటే.....ఉదాహరణకి ఒక ఇంట్లో నలుగురు ఉంటే వారిలో ఒకరికి నెలకి 10000/- వస్తుంటే, రెండవవారికి నెలకి 1500/- వస్తుంటే, మూడవవారికి ఉద్యోగమే లేకుంటే, మరి నాలుగో వారికి ఇప్పుడొస్తున్న హైటెక్కు ఉద్యోగం ద్వారా నెలకు 1 లక్ష సంపాయిస్తుంటే వారి నెలసరి ఆదాయం సరాసరి 27875/- రూపాయలుగా ఉన్నది. కానీ అక్కడ పరిస్తితి వేరుగా ఉన్నది. నలుగురికే ఇంతగా లెక్కలు మోసం చేస్తుంటే మొత్తం 1,220,200,000 భారత జనాభాని లెక్కలోనికి తీసుకుంటే ఎన్నికోట్లమంది ప్రజలు లెక్కలక్రింద నలిగి పోతున్నారు..........?? విధంగా ఆర్ధికవెత్తల కబంధ లెక్కలలో చిక్కుకున్న సామాన్యుడు బాధ పడుతున్నాడు. దీని కోసం ప్రజలని ఆర్ధికంగా విడదీయాలి అంటే, మన నాయకులేమో కుల మతాలుగా విడదీసి ప్రజలలో అసూయా ద్వేషాలను పెంచి ఐకమత్యం లేకుండా చేస్తున్నారు.

ప్రజల విషయానికి వస్తే, వారు కూడా తమ "కుల రాజకీయ నాయకులకి" ఇచ్చినంత ప్రాధాన్యం తమ జీవితాలకి ఇచ్చుకోవటం లేదు. ఎందుకంటే, ఎక్కడ చూసిన పనికి మాలిన రాజకీయ నాయకుల గురించి చర్చే గానీ....తమకి నిత్యం కావాలిసిన దాని గురించి కనీసం ఆలోచన కూడా చెయ్యటం లేదు. ఉదాహరణకి.....ఇసుక మాఫియా వలన చట్ట ప్రకారం కోర్టులు స్టే ఆర్డరు ఇచ్చినాయి. కోర్టుల పరిధి అంతవరకే. కానీ మన ప్రభుత్వం కానీ, ప్రజా నాయకులు గానీ దీని గురించి సీరియస్సుగా తీసుకొన్నారా....? ఒక్క పరిణామం వలన రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ పనులు ఆగి పోవటమే కాకుండా.....అనేక లక్షల మందికి పని లేకుండా పోయింది.....పైగా నిర్మాణ సామాగ్రి అమ్మకాలు కూడా పడిపోయి, ప్రభుత్వానికి రావాలిసిన ఆదాయం తగ్గిపోయింది. దీని గురించి ప్రజలకే పట్టలేదు మనకెందుకు అనుకొన్న ప్రజా నాయకులు...... "మద్యం విషయంలో మాత్రం మాంచి పట్టుదలతో ఉన్నారు".


ప్రభుత్వాలు
ఉన్నది ప్రజలు సరిగా బ్రతికే దారి చూపించటానికేనన్న చిన్న విషయాం మరచి, ఎప్పుడో రాబోయే ఎన్నికలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కాబట్టి, ఇప్పటికైనా సామాన్య ప్రజల "నిజమైన బ్రతుకులను" గమనించి, అనవసర లెక్కలతో తమ గొప్పతనాని చూపించుకోవాలని అనుకోకుండా కనీసం అయిదేళ్ళు కాకపోయినా 3 ఏళ్ళూ అయినా "ప్రజలకోసం పరిపాలన" చేస్తే ముందు ముందు సామాన్య ప్రజల పరిస్తితి మరింత దిగజారకుండా ఉంటుంది.ఇందులోని బొమ్మలు గూగుల్ ఇమేజెస్ లోనివే

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి