LOCAL WEATHER

19, జూన్ 2012, మంగళవారం

చీమల ట్రాఫిక్.....


క్రింది వీడియోలో చూడండి కొన్ని వందల చీమలు చక్కగా ఒకే లైనులో వచ్చేవీ పోయేవీ వెళుతున్నాయి. కానీ ఒకదానికి ఒకటి గుద్దుకోవటంగానీ, పోట్లాడుకోవటంగాని జరగటం లేదు. మధ్యలో జంక్షనులో అలాగే చక్కగా సాగిపోతున్నాయి. అది కూడా వాలుగా ఉండే గోడమీద...!!!


మరి చక్కగా నాలుగులైనులు ఉన్న రోడ్లలో మన ట్రఫిక్కు ఎందుకు అస్థవ్యస్తంగా ఉంటుందీ....?? చీమలలాగా బుద్ధిగా సొలుపుగా వెళ్ళటం మనుషులైన వారికి చేతకాదా...??

ఎందుకంటే, చీమలకి స్వార్ధం గురించి తెలియదు....ఒకదానికొకటి అడ్డం  అనుకోకుండా, వాటిదార్లో అవి పోతు పద్ధతిగా ఉన్నాయికానీ మనుషుల ట్రాఫిక్కులో......ఎవరికి వారికే తమ పనే అర్జెంటు...మిగిలిన వారందరూ  పనీ పాటాలేనివారు....మిగిలిన వారందరూ తమకి అడ్డం అనే స్వార్ధ భావంతో పోవటం వలననే ట్రాఫిక్కు జాములు.....


కాబట్టి కావాల్సింది వెడల్పు అయిన రోడ్డులు కాదు...విశాలమైన మనస్తత్వం...మిగిలిన వారు కూడా తమలాంటివారే అనే భావం....ఇదుంటే చాలు......దీనికి రోడ్డు డివైడెర్లూ అఖర్లేదు...పోలిసుల అజమాయషీ అఖర్లేదు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి