LOCAL WEATHER

17, జూన్ 2012, ఆదివారం

పోలీసులంటే అంత చులకనా....?




ఏ విషయంలో చూసిన పోలీసుల పట్ల మన మీడియా వారు చేస్తున్న అల్లరి సృతి మించుతోంది. ఒక రైల్వే పోలిసు స్టేషనులో పిల్లలకి సంకెళ్ళు వేశారనీ, వారినేదో చేసేస్తున్నారనీ ముందూ వెనుకా చూసుకోకుండా....తమ మీడియాలో ప్రసారం చేసి...ఆ పోలిసులలో ఇద్దరు సస్పెండ్ అయ్యేదాకా నిద్దరపోలేదు. రాత్రిపూట బూతుపాటలు వేసుకొనే ఈ పనికిమాలిన న్యూస్ టివీ వారికేమున్నది సమాజం పట్ల బాధ్యత...??

అసలు వారినెందుకు  పట్టుకొన్నారు,  అక్కడ జరుగుతున్నది ఏమిటీ అనేది తెలుసుకోవాలా..?? రైళ్ళలో చిన్న పిల్లలను అడ్డం పెట్టుకొని దొంగతనాలను చేస్తున్న ముఠాలను పట్టుకొనే ప్రయత్నంలో ఉన్న పోలిసుల మనోధైర్యాన్ని దెబ్బతీశారు. పొలీసులేమన్నా వ్యక్తిగత కక్షలతోనూ స్వార్ధంతోనూ ఈ పని చేశారా...??? ఇవేమీ పట్టకుండా ప్రజలకోసం  డ్యూటీ  చేస్తున్న పొలీసులకి  కూడా "ఆ మనకెందుకొచ్చిన గొడవ" అనే ప్రజా మనస్థత్వం వచ్చేట్లుగా మన బాధ్యతా రాహిత్య చానళ్ళు ప్రవర్తించాయి. మళ్ళీ ఏదన్నా అభద్రతా భావం కలిగితే "ప్రతీ వాళ్ళకీ" కావాల్సింది పోలిసుల సహాయమే మరి!!!

ఒక ప్రయాణికుడి నుండీ ముఖ్యమైన విలువైన వస్తువులు పోయినప్పుడు ఈ ప్రజా సంఘాలు, మానవతా వాదులు ఏమి మాట్లాడుతారు....? రూల్సు ఉన్నాయి కదా అని, ఆ రూల్సు కోసమే పనిచేస్తున్న పోలిసుల మనోధైర్యాన్నే దెబ్బ తీస్తారా....ఈ బూతు చానళ్ళ వాళ్ళు.   మరి నిన్న రాత్రి ఖమ్మం దగ్గర రైలులో జరిగిన దొంగతనాలకి ఈ చానళ్ళవాళ్ళు  బాధ్యత వహిస్తారా....?

కాబట్టి,  రూల్సు మాట్లాడేవారు ముందర తమని తాము సంస్కరించుకొని దొంగలని సంస్కరించి,  అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే, పోలీసులు కూడా సామాన్య ఉద్యోగులలాగానే జీతం కోసమే ఉద్యోగం చేస్తారు. అప్పుడు ఈ బూతు చానళ్ళు గానీ, దొంగ మానవతా వాదులు కానీ సమాజాన్ని రక్షించలేరు.



ఇందులోని బొమ్మలు గూగుల్లొనివే

5 కామెంట్‌లు:

  1. మీరు ఒకే కోణంలో చూస్తున్నారు. మీడియా వాళ్ళు తాగుబోతులు, డబ్బులు తీసుకుని వార్తలు రాసేవాళ్ళు అన్న ఆరోపణ 95% నిజమే కావచ్చు. ఇక్కడ పిల్లల హక్కులు అన్నది కూడా చూడాలి, తల్లిదండ్రుల ప్రేమ, డబ్బు, అన్నీ వున్న పిల్లలే అలా పోకిరిగా అయిపోతుంటే... అనాథలైన ఆకలితాళలేక చిల్లర దొంగతనాలు చేసే పిల్లను ఇలా చట్టానికి అతీతంగా శిక్షించాలా అన్నది ఇక్కడ చూడాల్సిన పాయింట్. ఆ పోలీసులదీ తప్పులేదు, వాణ్ణి లాకప్లో వేస్తే మరిన్ని ఇబ్బందులు అనుద్కే అలా కట్టి పడేశారేమో. ప్చ్... I pity the PCs.

    రిప్లయితొలగించండి
  2. SNKR గారూ స్పందించినందుకు మీకు ధన్యవాదాలు. మీరు చెప్పింది నిజమే...నేను సమాజ కోణం నుండే అలోచించి వ్రాశాను. కొద్ది మంది దొంగల వలన మొత్తం సమాజం ఇబ్బందులు పడుతోంది. పిల్లలని అడ్డం పెట్టుకొని దొంగతనాలు చేసే వారికి మనం చెప్పుకొనే "పిల్లల హక్కులే" వరంగా మారినాయి. ఆకలికి తాళలేక దొంగతనాలు చేసే అనాథలైన పిల్లలని పట్టుకొని శిక్షించేంత పని మన పొలీసులు చెయ్యరు.

    రిప్లయితొలగించండి
  3. Murthy గారూ మరియూ sravan గారూ స్పందించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి