LOCAL WEATHER

22, జూన్ 2012, శుక్రవారం

చాలెంజి చేస్తున్న నేరస్తులు


సమాజంలో అనేకమైనటువంటి ఆర్ధిక, మరియు చట్ట ఉల్లంఘన నేరాలు జరిగినప్పుడు...వారు తమ పద్ధతిని మార్చుకోకపోగా......సీగ్గుపడటమో, భయపడటమో కూడా చెయ్యకుండా ఎమి చేసుకొంటారో చేసుకోండన్న ధొరణిలో ఉన్నారు సామాజిక నేరస్తులు.

మిగిలినవి ఎలా ఉన్నా, మధ్యన ప్రభుత్వం మేలుకొని స్కూలు బస్సుల కండిషన్లు చూసి అనేక బస్సులను సీజ్ చెయ్యటం జరిగినది. ఇందుకు ఆయా స్కూలు వారు బస్సులను కండెన్షనింగు చెయించుకోవల్సింది పోయి మేము ఇలాగే ఉంటాము.....పనికి రాని బస్సులనే నడుపుతాము....చేతకాని డ్రైవర్లనే ఉంచుతాము అనే ధొరణిలో ఉన్నాయి. తమ పరిస్తితికి సిగ్గు తెచ్చుకోక పోగా రోజు స్కూళ్ళ బందుని ప్రకటించి.....కావాలంటే మీ ఆర్టీసీ బస్సులని పంపించండి వాటిని వాడుకుంటాము అంటున్నారు.

మరి అడ్డగోలు ఫీజులు తీసుకొంటున్న స్కూళ్ళు.... ఫీజులను తమ స్కూలు అభివృద్ధికి వాడాలని తెలియదా..? వచ్చిన డబ్బులను కార్పొరేటు పెద్దలు జేబులు నింపుకోటానికేనా...?? చదువులు కన్నా, స్కూలు అభివృద్ధికన్నా "ప్రకటనలకే" ప్రాముఖ్యమిస్తున్న స్కూళ్ళకి అసలు చదువు చెప్పాలన్న చిత్త శుద్ధి ఉన్నదా...???

దీనంతటికీ కారణం ప్రభుత్వ అలసత్వం మరియూ అసమర్ధతే అని చెప్పవచ్చును. సరైన సమయంలో చర్యలు తీసుకోక పోగా... కార్పొరేటు పెద్దలకు వంగి వంగి సలాము కొట్టే అధికారులు. దానితో ఎవరికి వారు సమాజం మీద పడి దొరల పద్ధతిన దోపిడీ చేస్తూన్నారు. పైగా వారి జోలికి వెళితే తమ భాగోతాలేమైనా బయటపడతాయన్న భయంతో ప్రభుత్వ పెద్దలు...!!!

విధంగా చూసినా అందరూ కలిసి ప్రజల జీవితాలతో ఆడుకొంటునారు. ఎటుచూసినా మాఫియాలే....గనుల మాఫియా, ఇసుక మాఫియా, మీడియా మాఫియా, బస్సుల మాఫియా, ఆర్ధిక మాఫియా, .............చదువుల మాఫియా.................ఇవన్నీ చూస్తుంటే ........."ప్రజా మాఫియా" వస్తే గానీ ప్రజల కష్టాలు తీరేటట్లు లేవు.


5 వ్యాఖ్యలు:

 1. "యథాప్రజారాజా తథారాజా" అని నా ఉద్దేశ్యం. మనం ఎగబడి స్కూళ్ళల్లో పిల్లలను వాళ్ళు ఇంకా పాకే దశ కూడ దాటకుండా చేరిపించటానికి వెర్రి ఉత్సాహం చూపింస్తుంటె, ఇలాంటి స్కూళ్ళు కాక మరెటువంటివి వస్తాయి!!!!???? ఏ తల్లి తండ్రి అయినా స్కూల్లో చేర్పించేప్పుడు ఈ స్కూలుకి ఉన్న వనరులు ఏమిటి, స్కూలు బస్సు ఎలా ఉన్నది, అది ఏ రూటులో వెళ్తుంది, డ్రైవరు ఎవరు, వాడికి లైసెన్సు ఉన్నదా, ముసలాడా, కుర్రవాడా, తాగుబోతా అని వాకబు చెయ్యటానికన్నా ప్రయత్నిస్తున్నారా? అలా వాకబు చెయ్యాలని తెలుసా అసలు ఈ వెర్రి జనానికి. ఏదో ఎక్కడో ఏదో జరగంగానే ఊరికే గుమికూడి, కళ్ళు పెద్దవి చేసుకుని టి వి గొట్టాల ముందు అసందర్భపు వాగుడు వాగెయ్యటమే కాని, మనలో మనకు అవగాహనాలేమి తెలుసుకోలేకుండా ఉన్నాము కదా. ప్రజలమైన మనం సవ్యంగా ఆలోచించాలి, సవ్యమైన ఆరోగ్యకరమైన ఆలోచనలు చేసి, మనకు ఏమి కావాలి,మన పిల్లలను ఎలా పెంచాలి అని దృక్పథం ఉండాలి. ఒకళ్ళను చూసి మరొకళ్ళు గొర్రెల్లాగ ప్రవర్తిస్తే "యథా ప్రజా తధా రాజా" నే అవుతుంది. ప్రస్తుతం అవుతున్నది అదే. మన పరిపాలకులు మన ఆలోచనలకు దర్పణాలే తప్ప ఎక్కడనుంచో ఊడిపడలేదు, పడరు కూడా. ఎప్పుడూ కూడా ఏ దేశంలో అయినా సరే, ఆ ప్రజలకు తగ్గ పరిపాలకుడే ఉంటాడు. నాశిరకం ప్రజలకు నాశిరకపు పరిపాలకులే ఉంటారు. ఎప్పుడైతే ఆ ప్రజలు తమ దృక్పథంలో మార్పు చూపించటం మొదలుపెడతారో, పరిపాలకుడు, పరిపలనా పధ్ధతి మారుతుంది. అంతే కాని ఏ ఇజమూ ఈ మార్పు తేలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శ్యామలీయం గారూ మరియూ శివరామప్రసాదు కప్పగంతు గారూ స్పందించినందుకు ధన్యవాదాలు.....

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అమ్ముడు వోయిన' వోట్ల ' క
  తమ్మున నేర్పడిన' ప్రభుత ' తా నమ్ముడు వో
  కెమ్మెయి పాలించును ? ' బీ
  జమ్మొకటి తరువొకటి ' యయి జనియింపదుగా !
  ----- సుజన-సృజన

  ప్రత్యుత్తరంతొలగించు
 4. వెంకట రాజారావు లక్కాకుల గారూ స్పందించినందుకు ధన్యవాదాలు. బాగా చెప్పారు....కానీ తప్పు చేసింది కొందరైతే శిక్ష అందరం అనుభవిస్తున్నాము కదండీ....కేవలం 21శాతం ప్రజలు చేసిన తప్పుకి 79శాతం మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.[link:http://ideechadavamdi.blogspot.in/2012/03/20.html#links]

  ప్రత్యుత్తరంతొలగించు