LOCAL WEATHER

13, జూన్ 2012, బుధవారం

ఎన్నికలు ఎన్నికలు ఎన్నికలు


ఎన్నికల ప్రకటన అని అనగానే అన్ని రాజకీయ పార్టీలకీ మొదలు గుర్తొచ్చేది ప్రాంతాలలో కులాల, మతాల వారున్నారు ఎవరికి టిక్కెట్ ఇవ్వాలి? ఇక మన న్యూస్ చానళ్ళ వాళ్ళకి పండగే పండగ...బోలెడు యాడ్స్ !!

ప్రచారం
మొదలవ్వగానే ...ఎదో చేసేస్తామనీ.....మరెవరో ఏమీ చెయ్యకపోగా బాగా తినేశారనీ[తమని తిననియ్యలేదని].......వార్తా చానళ్ళలో ప్రతీ రోజూన ప్రొద్దున్నే "పెద్దమనుషులు" కూర్చుని ఎవరు మంచి, ఎవరు చెడ్డా అని, "అయినిస్టీన్ సిద్ధాంతాన్ని" ఆధారం చేసుకొని చర్చలు.

న్నికల ముందు రోజున ... రాజకీయ పార్టీలన్నీ వారెవరో డబ్బులు పంచుతున్నారనీ, మద్యం పారుదల చేస్తున్నారనీ[తాము చేసేదే ఇతరులూ చేస్తారు కనుక ముందు జాగ్రత్తగా]అరుస్థాయి.......

ఎన్నికల
రోజున
1] ఉదయం....ఏజెంట్లు ప్రచారం చేశారనీ...వేరెవరో దొంగ వోట్లు వేశారనీ......తమకి ఓట్లుపడే[?]గ్రామంలో ఓట్లే లేవనీ[ఏం ముందర రోజు వరకూ తెలియదా?].....2]మధ్యాన్నం...అందరూ పూర్తి మౌనం[తమ "పనిలో" తాము] ఉంటారు .......
3]
సాయంత్రం...ఎవరికి వారు తామే గెలుస్తామని మేకపోతు గాంభిర్య ప్రకటనలు......
మరి
మన మ్యుజికల్ న్యూస్ టివీ వాళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏమి చేస్తారూ....అదిగో ఫలానా చోట కాపలా లేదు.....మరొక చోట గొడవలు అవుతున్నాయి....ఇది "ఎవరికి చెపుతున్నారో" మనకర్ధం కాదు.

ఫలితాలు
రోజున......ఓడిన వారు .. ఎక్స్ పార్టీ వారు రిగ్గింగు చేశారనీ......గెలిచిన వారు...ఇది ప్రజా విజయమనీ ఎలుగెత్తి అరుస్తారు....రాజకీయ నాయకులు సరే, మరి మన వార్తా చానళ్ళ సంగతి ...అవి తమ బ్రతుకుతెరువు కోసం "విషయమున్న" చోటుకి గుడారాలను ఎత్తుకొని పోతాయి

మరి మరునాడు...... నియోజకవర్గాల ప్రజల గోడు ఏమిటి? సమస్యలేమిటి?? అవసరాలేమిటి??? ఎవరికిపట్టిందీ....ఇప్పట్లో ఎన్నికలేమీ లేవు కదా!!!!

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి