LOCAL WEATHER

9, జూన్ 2012, శనివారం

వ్యక్తి భూతాలూ - ప్రజాసామ్య వ్యవస్థ


వ్యక్తి భూతాలతో ప్రజాసామ్య వ్యవస్థ సర్వనాశనమైపొతోంది. మన రాజకీయాలలో వ్యక్తులు ఒకరిపై మరొకరు పైచేయి సాధించాలనే ప్రయత్నంలో ప్రజాసామ్య వ్యవస్థనే నాశనం చేస్తున్నారు. దేశ రాజకీయాల నుండీ రాష్ట్ర రాజకీయాల వరకూ ఇదే పరిస్థితి. ఎవరైతే అధికారంలో ఉంటారో వారు తమ వ్యక్తి ప్రాబల్యాన్ని పెంపొందిచుకోవటం జరుగుతోంది. ఇదే సమయంలో ప్రతి పక్షాలుగా ఉన్నవారు, అధికారంలో ఉన్న వ్యక్తిని క్రిందకు దించటానికి అనేక ప్రయత్నాలు చేసేక్రమంలో వేర్పాటువాదాలూ, బందులూ, రోకోలూ, ఊరూరా అడుక్కునేవారిలాగా తిరిగి ప్రజలను ప్రాంతాలవారీగా, కులాలవారీగా మరియూ మతాల వారీగా రెచ్చగొట్టి, దాని ద్వారా వారు లబ్ధి పొందాలనుకోవటం జరుగుతోంది. దీనివలన ప్రజలు నానా ఇక్కట్లూ పడుతున్నారు. ఇవేమీ వ్యక్తులకి పట్టవు. వారి వారి ప్రాబ్ల్యం పెంచుకోవటం, దాని ద్వారా అధికారాన్ని కాపాడుకోవటం కోసం గానీ, లేదా అధికారాన్ని అందిపుచ్చుకోవటం గానీ వీరి ఉద్దేశ్యం. అంతే, ప్రజలేమైపోయినా వీరికి పట్టదు.


మన దేశంలో ప్రజాసామ్య వ్యవస్థ చాలా ముఖ్యమైనది. వ్యక్తి సామ్యమైన రాజరిక పద్ధతిలో అనేక లోపాల వలన ప్రజాసామ్యం పుట్టింది. దీనిలో వ్యక్తి కన్నా వ్యవస్థకే ప్రధాన్యమిచ్చారు. కానీ, వ్యక్తులు అధికారం పొందగానే తమకు తాము రాజులమనే భావన పొంది, తమ రాజరికాన్ని ఎలా వ్యాప్తి చెయ్యాలని దురాలోచన చేసారు. వ్యవస్థ బలంగా ఉన్నంత కాలం తమ ఆటలు సాగవని గమనించిన వ్యక్తులు, వ్యవస్థని బలహీన పరిచేవిధంగా చర్యలు మొదలు పెట్టారు.

అందులో భాగంగానే వ్యవస్థ మీద ఆధార పడిన వ్యక్తులు, తాము లేనిదే వ్యవస్థకు ఎదో ప్రమాదమనే భ్రమ కల్పించారు. దానికి తోడు అనేకమైనటువంటి పనికిమాలిన.....అంటే ఏమత్రం కష్టపడకుండా కొన్ని సౌకర్యాలను పొందేటట్లు కొందరికి అలవాటు చేశారు. సౌకర్యాలు, ఎవరు తమతో సయోధ్యగా ఉంటే వారికే అన్న పద్ధతిన ప్రజలను తమ బానిసలుగా చేసుకోనారంభించారు. దానితో సౌకర్యాలు చేస్తున్న వ్యక్త్లుల పట్ల చాలామందిలో ఆశనూ, ఆశక్తినీ కలిగించింది. దాని పర్యావసనంగా ఆయా లాభపడిన వారు, వ్యక్తులకి దరిదాపులు మానసిక బానిసలుగా తయారైనారు. తాము నమ్మిన నాయకుడి మీద ఈగ కూడ వాలనీయనంత మూర్ఖంగా కొందరు ప్రజలు తయారైనారు. దానికి తోడు కులాభిమానం, మతాభిమానం మరియూ ప్రాంతీయత కూడా ప్రజలని గుడ్డి వారిగా చేస్తోంది. రకం ప్రజలు ఎంతగా దిగరాజిపోయారంటే, తమకున్న కష్టాలని మరచి తమ నాయకుల కష్టాల గురించే మాట్లాడుకుంటున్నారు. మేధావి వర్గాలనబడే వారు కూడా పొద్దున్నే మేకప్పులు చేసుకొని న్యూస్ చానళ్ళకి వచ్చి తెగ ఆవేశంతో పనికిమాలిన నాయకుల గురించే మాట్లాడుతున్నారే తప్ప ప్రజల కష్టాల జోలికి వెళ్ళటంలేదు. దీనినే మానసిక బానిసత్వం అంటారనుకుంటా...!!!! ఇక మన మీడియా వారికి ప్రజల మీద ఎంత ప్రేమంటే జనభా లెక్కల విడుదల[క్లిక్ చెయ్యండీ] అయిన తరవాత వివరాల కోసం న్యూస్ పేపర్ల వాళ్ళు ఒక ఫుల్ పేజీ కేటాయించలేకపోయారు. అలాగే, టివీలలో కనీసం ఒక అరగంట కేటాయించి, ప్రజలందరూ చూసే టైములలో వివరాలను అందించలేకపోయారు.


ఇదంతా, వ్యక్తులు తమ రాజరిక ప్రస్థానాన్ని సుస్థిరం చేసుకోవటానికి, ప్రజలను పావులుగా చేసుకొనే దానిలో భాగమే. విచిత్రమేమంటే ఇదంత ప్రభుత్వ[ప్రజల]సొమ్ముతోనే చేస్తారు. తమ దగ్గరున్న పైసా కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టరు. ఇంకో విషయం ఏమంటే.....ఏదైతే ప్రజల కోసం పెట్టిన పధకాల ద్వారా బయటకు వచ్చిన ప్రజా ధనంలో 80 శాతం వ్యక్తులే తినేస్తున్నారు. విధంగా ప్రజల సొమ్ముతో వీరు సోకులు చేసుకొని, ప్రజలని వెర్రి వాళ్ళని చేస్తున్నారు. పెద్ద వ్యాపారులు దశాబ్దాలుగా సంపాయించలేని సొమ్మును, వీరు 4, 5 సంవత్సరాలలో సంపాయించేస్తున్నారు. పైగా వారేదో ప్రజల కోసం తమ జీవితాలనే త్యాగం చేసేస్తున్నట్లుగా ప్రజలకి భ్రమ కలిగిస్తున్నారు. సొమ్ము ప్రజలదీ, సోకు నాయకులదీ అయింది. విధంగా వ్యక్తులు తమచుట్టూ తమదైన వ్యవస్థను ఏర్పాటు చేసుకొనీ, దానికి రాజకీయ పార్టీ అని పెరు పెట్టుకొనీ, దానిలో తమ ప్రాబల్యాన్ని పెంచుకొంటూ, ఆయా రాజకీయ పార్టీలను బలమైన వ్యవస్థలుగా చేసి, దేశాన్ని[ప్రజలని]బలహీన పరుస్తున్నారు.


ఎవరిని పడితే వారిని నమ్మి నెత్తిన పెట్టుకొనీ, వారి చేత అనేక దెబ్బలు తినీ, అనేక అవమానాలకు గురైన తరవాత స్వంతంగా స్వాతంత్రం తెచ్చుకొని, మరల అదే ధొరణిలో ఉన్న ప్రజలని మోసం చెయ్యటం పెద్ద విషయమేమీ కాదు "వ్యక్తిసామ్య రాజులకి". మొదలు నుండీ ఎవరిని పడితే వారిని నమ్మేసే ప్రజలుండటం వలన వ్యక్తుల ఆటలు సాగుతున్నాయి. మన దేశ ప్రజలకి ఎవరైనా కాసిని కన్నీళ్ళు పెడితే చాలు, తాము రోజూ పెడుతున్న కన్నీళ్ళు మరచి, వచ్చిన వారికి సహాయం చెయ్యాలనుకొంటారు. విధమైన "సెంటిమంటు మానసిక బలహీనతగల" ప్రజలని మోసం చెయ్యటం చాలా తేలిక అని వ్యక్తిసామ్య రాజకీయ వ్యవస్థలకి తెలుసు.

ప్రజాసామ్యంలో ఎవరికి వారు వచ్చి, తమవంతు కృషిగా వ్యవస్థను బలపరచి, తద్వారా ప్రజాసామ్యానికి బలాన్ని చేకూర్చి బలమైన దేశంగా మార్చాలి. కానీ, పద్ధతిలో వ్యవస్థను బలపరిచే బదులు తాము ప్రజల సొమ్ముతో బలపడి ఎక్కడికక్కడ సంస్థానాలుగా ఏర్పాటు చేసుకొని పరిపాలించటం మొదలు పెట్టారు. వీరికి పెద్ద అధికారులు బ్రోకర్లలాగా సహకరించి తాము కూడా సమాంతరంగ బ్యురోక్రాటిక్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొన్నారు. తమలో తమకు ఎన్ని అభిప్రాయ బేధాలున్నప్పటికీ, తమ జాతివాడికీ ఇబ్బంది[ప్రజల నుండి]వచ్చినా కాకుల్లాగా సమైక్యం ప్రకటిస్తున్నారు.

worst bureaucracy--asia లో ఫదికి ఫది పాయింట్లతో ముందున్న భారత్


విధంగా తాము ఆడిందే ఆటగా పరిపాలన చేస్తూ, కొద్ది మంది వ్యక్తులే మన దేశాన్ని ఆడిస్తున్నారు. అసలు అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన కేంద్రప్రభుత్వంలోనే వంశపారంపర వ్యక్తుల ఆరాధన మొదలైనది. దానితో ప్రతీ రాష్ట్రంలోనూ, జిల్లాలలోనూ చివరికి పంచాయితీలలోనూ కూడా..... ఏదో సినిమా డైలాగులాగా "వాడూ...వాడుపోతే వీడూ......." లాగా తయారైనది. వ్యక్తులని ఆదర్శంగా తీసుకొని, వారు కూడా పైకి రావాలనుకొనేవారి మూలంగా సమాజంలో ఆసాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాని వలన శాంతి భద్రతలకు కూడా విఘాతం కలుగుతున్నది. ప్రస్తుతం మన రాష్ట్రంలో కూడా అదే పరిస్తితి. ఇది ఇలాగే కొనసాగితే పూర్వకాలంలో ఉన్న సంస్థానాల పరిపాలన ఎంతో దూరం లేదు. విచిత్రమేమంటే ప్రజలలో అవగాహన తేవాల్సిన స్వచ్చంద సంస్థలు కూడా, స్వార్ధంతో ఆలోచించి తమకే పేరు రావాలనీ, తద్వారా భవిష్యత్తులో ఎదో ప్రయోజనం పొందాలన్న దురాలోచనతోనే పనిచేస్తున్నాయి. కాబట్టి ప్రజలారా మేల్కొనండి. మళ్ళీ సినిమా డైలాగే...."ప్రజలారా మీరు రాజకీయాల గురించీ, రాజకీయ నాయకుల బాబోగుల గురించీ ఆలోచించకండి[వారెలాగో బానే ఉంటారు], మీ గురించీ, మీ పిల్లల భవిష్యత్తు గురించీ ఆలోచించి మెలగండి........"


కాబట్టి, ప్రజలు పనికిమాలిన వ్యక్తుల పూజలు మాని, ప్రజల మధ్య ఉన్న ప్రాంతీయ, మతాల, కులాల వైషమ్యాలను రెచ్చగొట్టుకోకుండా ఉన్నట్లైతే వ్యక్తి సామ్య ఆటగాళ్ళ ఆటలు సాగవు. ఎందుకంటే, పైన ఎవరున్నా వారు ప్రజల వైషమ్యాలనూ వారి ఎదుగుదల కోసమే వాడుకొని వారికోసమే చేసుకొంటున్నారు. ఇటువంటి వ్యక్తుల వలన ప్రజలకి ఒరెగేదేముండదు, మన వార్తా చానళ్ళలో కాలక్షేపం తప్ప. ఇకనైనా ప్రజలు వ్యక్తులని కాకుండా....ప్రజాసామ్య వ్యవస్థను నమ్ముకుంటే అది బలపడి మన మరియూ మన పిల్లల భవిష్యత్తునూ బాగుచేసి తీరుతుంది.

జై హింద్


ఇందులోని బొమ్మలు గూగుల్లోనివే

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి