LOCAL WEATHER

1, మార్చి 2013, శుక్రవారం

దేశాన్ని ముక్కలు క్రింద చేస్తున్న రైల్వేలు.....???దేశవ్యాప్తంగా వ్యాపించిన రైల్వే లైనులు దేశం లోని అన్ని ప్రాంతాలనూ కలుపుతున్నాయని గప్పాలు కొట్టుకుంటున్న రైల్వేశాఖ వారు, అదే నొటితో ప్రాయాణీకుల రవాణా వలన నష్టం వస్తోందని కూస్తున్నారు....  ప్రజల కోసం,  ప్రజల మధ్యన ఉన్న రైల్వేలు,  ప్రజల కోసం పనిచెయ్యటానికి మాత్రం నష్టాలు వస్తున్నాయని  అనుకొన్నప్పుడూ... లెక్కలు వేస్తుకొంటున్నప్పుడూ...  ప్రజలు కూడా అనేక లెక్కలు వేసుకోవాలిసిన పరిస్థితి వస్తున్నది.....కదా!!!  


రైల్వేలకి ప్రయాణీకులు భారమైతే, మరి  దేశంలో ఉన్న రైలు పట్టాల సంగతేమిటీ...? అనేక ఊళ్ళనీ, అనేక పొలాలనీ, నగరాలనీ అడ్డంగా విడదీసి ఒక్క నిమిషంలో ఎదురుగా కనపడే చోటుకి వెళ్ళే పరిస్తితి ఉన్నా.... పట్టాలు అడ్డం ఉండటం వలన 10 నిమిషాల నుండీ గంటల సేపు ప్రయాణం చెయ్య వలసి రావటం ఎవరి కోసం...? మన కోసం ఏ త్యాగం చెయ్యని రైల్వేల కోసం మనమెందుకు కష్టపడాలీ...??  ఈ విధంగా రైల్వేలు కోట్లాది ప్రజలకి అడ్డం కాదా....???


ఈ కష్టమేమిటో అనేక నగరాలు పరిశీలిస్తే తెలుస్తుంది. ఉదాహరణకి విజయవాడ రైల్వే స్టేషను తీసుకొంటే, ఆ స్టేషనుకి వచ్చే ప్రయాణీకులలో కేవలం 21 శాతం మంది మాత్రమే విజయవాడా ఆ పరిసర ప్రాంత ప్రజలు. మిగిలిన వారు ఎక్కడెక్కడివారో తెలియదు. విజయవాడకి పేరుకి 400 రైళ్ళు వస్తాయే కానీ, ఖాళీగా ఉండి అందుబాటులో ఉండే రైళ్ళు కనీసం 10 మరియూ 15 కూడా ఉండవు. వాటికి కూడా చాలా ముందు రోజులలోనే పేద్ద ప్లాను వేసుకొని టిక్కెట్లు కొనేసుకోవాలి.... ఇక్కడి నుండీ బయలు దేరే రైళ్ళు కూడా పరిమితమైనవే. రాత్రి వేళలో కనీసం ఒక్క ఎక్స్‌ప్రెస్స్ రైలు కూడా విజయవాడ నుండీ బయలు దేరదు. హైదరాబాదుకి కూడా అర్ధరాత్రి ఎక్కడి  నుండో వచ్చిన రైళ్ళలో ఎక్కాలి.... అదీ  కూడా బాగా ముందుగా రిజర్వేషను చేసుకొని ఎక్కాలి......  జనరల్ బోగిల్లో కాలు పెట్టటానికి కూడా చోటు ఉండదు ఇంతపెద్ద రైల్వే జంక్షన్  అని చంకలు గుద్దుకోవటం తప్ప ఎందుకు పనికిరానిది ... అయితే వొచ్చే పొయ్యే రైళ్ళను పిల్లలకి చూపించటానికి మాత్రం చాలా బాగుంటుంది .... అంతే ....!!!


ఈ సమస్యలు ఇలా ఉంటే ఎప్పుడో ప్రయాణానికి ఉపయోగపడే ఈ రైల్వే స్టేషను నగరం మధ్యలో ఉండి, నగరాన్ని రెండు ముక్కలుగా చేసి విజయవాడ ప్రజలకి రోజువారీ నరకం చూపిస్తోంది. ఈ రైల్వే స్టేషను మీదగా ఒక్క ఓవరు బ్రిడ్జికూడా ఉండేది కాదు. తరవాత రోజులలో ఒకటి ఊరు చివర, మరొకటి ఊరు మధ్యలో వేసినప్పటికీ అవి ఎంతమాత్రం ప్రయోజనకరంగా లేవు. వాన వస్తే చాలు విజయవాడ నగరం రెండు ముక్కలకీ సంబంధాలు తెగిపోతాయి. పైగా డ్రైనేజీ లైను ఈ స్టేషను క్రిందుగా ఎప్పుడో వెయ్యటం, అది చెడిపోవటం జరిగి, ఒన్ టవును ప్రాంతం అంతా మురుగుడు నీళ్ళతో మునిగిపోతుంది. దీని రిపేరు కోసం కనీస సహకారం కూడా ఈ రైల్వే అధికారులు ఇవ్వటం లేదు.   ఇక ఈ ఊరికి ఒక ఎంపి ఉన్నాడంటే ఆయన కార్పోరేటర్‌కి  తక్కువ; రాజకీయ అల్లరులకి మాత్రం పనికి వస్తాడు....  ఎక్కడ లేని గొడవలని ఊరి మీదకు తేవటానికి తప్ప ఎందుకూ పనికిరాడు.

రైల్వే స్టేషను అడ్డం వలన మునిగిపోయిన 1 టవున్ 

ఇన్ని కష్టాలు మధ్యన ఈ విజయవాడ పేద్ద రైల్వే స్టేషను అవసరమా.. అని ఇప్పటికే అనేక మంది మాంచి కోపం మీద ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్న ప్రజలకి ఉపయోగకరంగా ఉండే విధంగా ప్రయత్నాలు చేసే బదులు, రాను రానూ ప్రజలకి దూరం అయిపోతూ ఉండి, ప్రయాణీకులని దింపటమే నష్టమని రైల్వే వారు అహంకారంతో మాట్లాడుతున్నారు.  మరి ప్రజలు కూడా అదే దృష్టితో ఆలోచించి ఈ రైల్వే స్టేషను వలన లాభం కంటే నష్టమని అనుకుంటే రైల్వే వారి పరిస్థితి ఏమిటి...??? ఈ  పరిస్థితి కేవలం విజయవాడలోనే కాదు....  ఏలూరూ, తునీ, గుంటూరు, విశాఖపట్టణం, నెల్లూరు, కర్నూలు  ఇలా ఒకటేమిటి అన్ని ఊళ్ళ వాళ్ళకీ ఉన్నది. 

సత్యనారాయణపురం రైల్వే స్టేషను [SATYANARAYANAPURAM RAILWAY STATION]
పికకముందు ......................     పీకిన తరవాత వేసిన రోడ్డు 

ఒకప్పుడు విజయవాడ లోకల్ సత్యనారాయణపురం రైల్వే స్టేషను ప్రజలకి అడ్డంగా ఉన్నదని గొడవ చేసి పీకించుకొనే సమయంలో,  అది పీకకుండా ఉండేందుకు గట్టి ప్రయత్నం చేసిన వారిలో నేనూ ఓకడిని.... అప్పుడు కూడా ఆ స్టేషనులో ఎక్స్‌ప్రెస్స్ రైళ్ళు ఆపక, కేవలం ఒకటి రెండు రైళ్ళు మాత్రమే ఆపి ప్రజాగ్రహానికి గురై,  చివరికి ఆ రైల్వే లైనే పీకేసే పరిస్థితిని రైల్వే వారు తెచ్చుకొన్నారు. రైల్వే వారి మాటల వలన, చేష్టల వలనా, ఒకప్పుడు రైల్వే లైను  పీకకుండా ఉండేందుకు పోరాడిన వారం, ఇప్పుడు ఆ ఈ రైల్వేలతో మనకేమి పని అన్న పద్ధతిలో వ్రాయవలసి వచ్చింది.... అయితే సత్యనారాయణపురం రైల్వేస్టేషను గతి విజయవాడ స్టేషనులాంటి వాటికి పట్టకూదడనే నా బాధ...!!!


కాబట్టి, ఈ రైల్వేలు మనకి అవసరమా... మనకి రోడ్లు ఉన్నాయి కదా .... వాటి మీదైతే హయిగా మనం కూడా వెళ్ళ వచ్చును అని ప్రజలు అనుకోవటం మొదలు పెట్టక ముందే, "ప్రజలకి అడ్డంగా ఉండి తమ వ్యాపారాలని నిర్వహిస్తున్న మన రైల్వే వారు", ప్రజలకి  సేవ చేసి  వారి మన్ననలని పొందితే మంచిది..... ఈ రైల్వే లైనులు మాకొద్దు, రోడ్డులుంటే చాలు;  వాటి మీద ఎద్దుల బండితోనైనా తిరగచ్చు అనే భావన ప్రజలలో రాకుండా చూసుకోవాలిసిన బాధ్యత రైల్వే వారిదే.... 


ఇహ రైల్వే మంత్రుల దగ్గరికి వచ్చేసరికి, తాము మంత్రులు అయినప్పుడు చేసిన ప్రమాణం .... "ఏ పక్షపాతంతో మేము పనిచెయ్యము".... అనే మాటలని ప్రక్కన పెట్టి తమ ఇష్టారాజ్యంగా తాము ప్రతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలకి, అనేక వరాలు ఇచ్చే అధికారం ఎవరు ఇచ్చారు...?? అలాంటి రైల్వే మంత్రులని ఏమనాలి...?? ఇలా వివక్ష చూపటం వలన దేశ విభజనే జరిగే అవకాశం ఉన్నదని ఒక టీవీ వారి కార్యక్రమంలో మైసూరా రెడ్డిగారు అన్నారు.  పైగా  పూర్తి బడ్జెట్ పాఠం చదివే ఓపిక కూడా లేని వారిని రైల్వే మంత్రులుగా చెయ్యటం సరైనదేనా...? పార్లమెంటులో సాటి సభ్యులని గౌరవించని వారు మంత్రులుగా ఉండటం ఎంతవరకూ సమంజసం...???   కాబట్టి ఇకమీదటనైనా, రైల్వే బడ్జెట్టు అంటే రైల్వే మంత్రి దయాదాక్షణ్యాల మీదా కానీ, నిరంకుశ అధికారాల మీద కానీ ఆధారపడకుండా కొన్ని మార్గ దర్శకాల మీద ఆధారపడి  తయారు చెయ్యాలి.  అంటే ... ఎక్కువ రెవెన్యు ఎక్కడ వొస్తోందీ, ఎక్కడ నష్టాలు లేకుండా నడుస్తోందీ ... ఎక్కడి ప్రజలకి తమ రైలు పట్టాలు కేవలం అడ్డం అని మాత్రమె అనిపిస్తున్నాయో, వారికి ఎలా లాభ పడాలి.....లాంటి అనేక మార్గ దర్శకాలు ఆధారంతో మాత్రమే రైల్వే బడ్జెట్టు తయారైయేట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి....రైల్వేలు అంటే అవేమీ మంత్రుల జేబు సంస్థలు కావు... అవి పనిచేసేది ప్రజల మన్ననలని పొందటానికే అని ప్రభుత్వం తెలుసుకోవాలి.  ప్రభుత్వం ఉన్నదే ప్రజల కోసం .... లాభ నష్టాలని బేరీజు వెయ్యటానికి కాదు .........!!!@@@@@

ఇందులోని బొమ్మలన్నీ గూగుల్ లోనివే