LOCAL WEATHER

29, మార్చి 2013, శుక్రవారం

న్యాయమూర్తే నేరస్థులని వదిలెయ్యమంటున్నారా....!!!



ఈ మధ్యన పేపర్లలో వార్తలు వ్రాసేటప్పుడు, ఎవరి గురించి వ్రాస్తున్నారో వారి "వృత్తిని  కూడా కలిపేసి వ్రాస్తున్నారు....." దాని వలన, ఆ వార్తలని చదివే వారికి చాలా తికమకగా ఉంటోంది. ఉదాహరణకి వార్తా పత్రికల్లో వచ్చిన వార్తలని పరిశీలిస్తే......

"ఒక లారీ ద్రైవర్ దుర్మరణం..."  ఇతను  ఉదయయాన్నే పాలు తీసుకొద్దామని రోడ్డు దాటుతుండగా ఇతన్ని ఆటో గుద్దేసింది... ఈ వార్తలో మొదలు చూసి, లారీకి ప్రమాదం జరిగి లారీ డ్రైవర్ మృతి చెందాడని అనుకుంటాము.... కానీ జరిగింది వేరు...

ఒకానొక బాంకు ఉద్యోగి, మోసం చేసి డబ్బులు కాజేశాడని....... ఇతను ఇంటిదగ్గర చిట్టీలు నడిపి, అందులో మోసం చేశాడని వివరణ... కానీ, మనం అనుకుంటాము, బాంకు లావాదేవీలలో మోసం చేసి డబ్బు కాజేశాడని.... 

"తండ్రే కూతురి ఎడల కాలయముడైనాడు........" అని సినిమాటిక్‌గా ఓ వార్త; కాని అతడు నిజమైన తండ్రి కాదనీ, వరుసకి మాత్రమే తండ్రి అనీ, క్రింద వార్త చదివిన తరవాత తెలుస్తుంది.... కానీ, "తండ్రి కూడా సేఫ్" కాదు అన్న భయాన్ని..........  సమాజంలో ఉన్న పిల్లలకి కానీ, పెద్దలకి కానీ పంపినట్లు అవుతుంది.... ఇలా చెప్పుకుంటూపోతే బోలెడున్నాయి.............

ఇలాంటివే, కొన్ని వార్తలు ఈ మధ్యన పేపర్లలో తెగ కనపడుతున్నాయి.... "ఒకానొక జస్టిస్" గారు నేరస్థులని విడిచి పెట్టమనీ, లేక వారికి క్షమాబిక్ష పెట్టమని రాష్ట్రపతిగారిని కానీ, గవర్నర్ గారిని  కానీ కోరుతున్నాడని.... ఈ వార్తలు చదివిన వారికి  ఓ అనుమానం వస్తుంది.....  "అదేమిటి న్యాయమూర్తి  నేరస్తులకి క్షమాబిక్షపెట్టి వదిలేయ్యమంటున్నాడా" అని ....... పైగా "ఆయనే స్వయంగా క్షమాబిక్షని అడిగేస్తున్నాడా" అని.......  కానీ,  ఆయన తన వృత్తి పరంగా ఇలా అడగటంలేదు... ఆయన, తన ప్రవృత్తి ద్వారానే ఈ రకమైన "సంఘసేవ"[?] చేస్తున్నాడని ఎంత మందికి తెలుస్తుంది...??? తీర్పులు చెప్పే ఆయనే నేరస్తులకి క్షమాబిక్ష పెట్టమని అడుగుతుంటే,  ఈ వార్త చదివిన వారిలో చాలా మంది అమాయక ప్రజలకి  "నేరస్థుల మీద సానుభూతి ఏర్పడే అవకాశం కూడా  ఉన్నది".........  న్యాయమూర్తుల  తీర్పుల మీదే  అనుమానం వచ్చే ప్రమాదం ఉన్నది...!!!!!! 

ఇదే కాకుండా, ఎవరికీ తెలియని వ్యక్తుల వార్తలని వ్రాసేప్పుడు, చదివేటప్పుడు ఆ వ్యక్తుల పేర్లతో వ్రాస్తున్నారు, చదువుతున్నారు..... ఆ పేరు ఎవరైనా ప్రముఖుడిది  అయితే... ఆ ప్రముఖుడికి ఏదైనా జరిగిందేమోనని ప్రజలు అపొహపడే అవకాశం ఉన్నది.  కాబట్టి మీడియా వారికి విజ్ఞప్తి ఏమంటే వార్తలలోని వ్యక్తులు, వారి వారి వృత్తిపరంగా మాట్లాడినప్పుడు కానీ, వృత్తిపరంగా ప్రమాదానికి గురైనప్పుడు మాత్రమే, ఆయా వ్యక్తుల వృత్తిని వార్తలలో చెప్పండి, వ్రాయండి.  అలా వ్రాయకపొతే, ఫలానా వృత్తికి చెందిన ఆయన, తన "వృత్తికి విరుద్దంగా" ప్రవర్తిస్తున్నాడని ప్రజలు అపొహపడే అవకాశమున్నది. అలా వ్రాసిన వార్తల సారాంశం, సరైన అర్ధాన్ని ఇవ్వకపోగా........ చదివినవారు  అపార్ధం చేసుకొనే  ప్రమాదం కూడా ఉన్నది ....... !!! 



@@@@@@@@@@@@@ 
@@@@@@@@@@@@@



తెలుగు అక్షరమాల 

1 కామెంట్‌: