LOCAL WEATHER

15, మార్చి 2013, శుక్రవారం

యూరప్పు వాళ్ళు ఎంత మంచి వారు....!?!?!


 ప్రపంచ దేశాలన్నిటికీ ఒకే న్యాయం ఉన్నదా....???

మొదటి నుండీ ప్రపంచానికి యురప్పు వారు ఉట్టి పుణ్యానికి నాగరికతను నేర్పి, ఏ స్వార్ధం లేకుండా అందరినీ పరిపాలించి, వారు అనుసరించే మంచి సమాజానికి సంబంధించిన చట్టాలనీ, రాజ్యాంగాలనీ ప్రపంచానికి అలవాటు చేసి, ప్రపంచ ప్రజలని ఎంతో నాగరీకులుగా మార్చి,  ఎంతో సేవ చేసినారు.....  అని మనం అనుకునేట్లుగా, మనకి మనమే హిప్నటైజ్  అయ్యేట్టుగా చేసిపారేసి......  ఒక వేళ ప్రపంచంలోని ఏ దేశానికి చెందిన వాడు ఎవడైనా ఇది ఏమిటని ప్రశ్నిస్తే, దానికి సమాధానం కూడా యూరప్పు వారి తరపున వకాల్తా పుచ్చుకొని, ఆ దేశం వారే ఎగపడి, ఆ ప్రశ్నించిన వాడి గొంతు నొక్కి... నువ్వు అనాగరికుడవని చెప్పేంత విజ్ఞానాన్ని  అన్ని దేశాల వారికి కల్పించిన ఘనత యూరప్పు వారిదే మరి....!!!  

 ఇందులో యురోపియన్లచే బాధించపడ్డ ఒక్క దేశానికి కూడా శాశ్వత సభ్యత్వం లేదు...!!! 

ఈ విధంగా రూల్సు మేకర్స్ వారే అయ్యారు... ఏ రెండు దేశాల వారు మాట్లాడుకోవాలన్నా.... వ్యాపారాలు చేసుకోవాలన్నా.... చివరకి కొట్టుకోవాలన్నా కూడా మన నాగరీక యూరప్పు వారి అనుమతి కావాలిసిందే.... ఒక విధంగా యూరప్పు వారే మనకు ఆదర్శం  మరియూ మార్గ'దర్శకులు కూడా.... అయితే వారు వెళ్ళే అన్ని మార్గాలలో అందరికీ అనుమతి ఉండదు సుమండీ....!!!

నార్వే దేశంలో మన దేశానికి చెందిన దంపతులు తెలియక తమ పిల్ల వాడిని మందలిస్తే, అది నార్వే చట్టాల ప్రకారం చాలా నేరమని తీసుకుని పోయి జైల్లో పెట్టారు. ఆ పిల్లవాడి తల్లి భారత్ నుండీ నార్వే వెళ్ళి మరీ జైల్లో కూర్చున్నారు..... మన అమాత్యులు కూడా ఏ దేశం వారైనా చట్టాలని గౌరవించాలిసిందే అని నొక్కి వక్కాణించి మరీ తమ దేశం పౌరులని నార్వే జైలులో పెట్టి, యూరప్పు వారికి తమ విధేయతని ఒంగి మరీ చాటారు....అలాగే ఆస్ట్రేలియాలో ఒక భారతీయ విద్యార్ధిని ఘోరంగా అవమానించారు... కారణం అతను ముస్లిం అవటమే... అతనిని తిరిగి భారత్ తెప్పించుకోవటానికి మన ప్రభుత్వం నా నా .....  బాధలూ పడింది. ఇటువంటి సమయాలలో మొరిగిన నాయకులు కానీ, మీడియా కానీ తరవాత రోజునే మిన్నుకుండిపోతారు. ప్రపంచ మనవహక్కుల వారు కూడా తమ నేరస్తులని కాపాడే నోరుని వృధా చేసుకోలేదు. ఇంతకీ ఆయనే ఉంటే...... అనే సామెతగా మన దేశ ప్రభుత్వానికి ఇంటర్నషనల్ లా రూల్సు కంటే తమ ప్రజలంటే గౌరవం శ్రద్ధ ఉంటే ఇలా జరిగేదా....??? మరి ఇంటర్నషనల్ లా పట్ల మనకున్నంత విధేయత వాటిని సృష్టించిన యూరప్పు వారికున్నదా...  

   ఏదో విహార యాత్రకు వచ్చినట్లుగా ఉన్న ఇటాలీ నేరస్తులు .......      మత్స్యకారుల కుటుంబ రోదనలు 

ఏ మాత్రం పెద్ద నేరాలలో లేని మన దేశ ప్రజలని కేవలం ఇంటర్నేషనల్ లా రుల్సు కోసం మన వాళ్ళు కాపాడుకోలేకపోతుంటే... యూరప్పు వారు మటుక్కూ తమ నాగరిక తెలివితేటలని చూపెడుతున్నారు....    ఇటలీ వారిని చూడండి..... వారి దేశం పౌరులు ఇద్దరు, మన కేరళాకు చెందిన ఇద్దరు మత్యకారులని చంపి,ఆ హత్యా నేరం క్రింద అరెస్టు అయ్యి మన జైల్లో ఉన్నారు. ఇంకా విచారణ జరగవలసి ఉన్నది కూడా.... ఈ సమయంలో ఓ దొంగ కారణం పెట్టి, మళ్ళీ పంపిస్తామని చెప్పి, తమ వారిని ఇద్దరినీ ఇటలీకి తీసుకెళ్ళి, ఇప్పుడు వారి అసలు నైజం బయటపెట్టి, తమవారిని పంపించటం కుదరదని తేల్చిపారేశారు.... ఈ యూరప్పు వారికి ప్రపంచ చట్టాలంటే ఎంత గౌరవం; తమ పౌరులంటే ఎంత శ్రద్ధ... తమవారిపై హత్యా నేరం మోపబడినప్పటికీ వారు ఖాతరు చెయ్యలేదు..... దీని గురించి నాలుగు రోజులు అరుస్తారు తరవాత పట్టించుకోరని వారికి కూడా మన నాడి తెలిసిపోయింది. ఈ ప్రపంచ చట్టాలన్నీ యూరప్పుకు చెందని వారికేనా...???   

భోపాల్ గాస్ దుర్ఘటనలో చనిపోయినవారి సంఖ్య 

ఇది మన దేశంలో మొదటి తప్పేం కాదు....తమ నిర్లక్ష్యం వలన భయంకరమైన విషవాయువులు విదజల్లటం వలన, భోపాలులో వేల కొద్దీ మన దేశ ప్రజల మరణానికి కారణమైన, యూనియన్ కార్బైడ్ అనే సంస్థకి చెందిన అమెరికా పెద్దమనిషిని, మనవారు దగ్గరుండి మరి విమానం ఎక్కించి, అతని దేశానికి పంపించి వేశారు. మరో ఘటనలో, బెంగాలులోని పురూలియా అనే చోట విమానంలో నుండీ ఆయుధాలు జారవిడిచిన కేసులో, ఒక రష్యన్‌కి జైలు శిక్ష వేసి, అతను జైలు శిక్షను అనుభవిస్తున్న సమయంలో, తమ మిత్ర దేశమైన రష్యా వారి విజ్ఞప్తితో, శుబ్బరంగా రష్యాలో ఒదలిపెట్టేశారు. ఇదే ఇటలీకి చెందిన బొఫొర్సు కేసుకి సంబంధించిన ఖత్రోచీ గారిని కూడా చాలా గౌరవ మార్యాదలతో మనవారు చూశారు. ఇలా యూరప్పు దేశాల అహంకారపు ఒత్తిడులకి లొంగి, మన వారు అనేక విషయాలలో యూరప్పువారికి తమ విధేయతని చాటుతోనే ఉన్నారు. 

బాగానే ఉన్నది మరి, మనమేమో యూరప్పు వారి నుండీ నాగరికతా, చట్టాలని తెచ్చుకొన్నము కాబట్టి, ఎప్పుడు ఏ సమయంలో ఎలా మెలగాలో మనవారికి తెలియకపోవచ్చును. కానీ, రూల్సు మేకర్స్ యురప్పు వారే కదా మరి యురప్పువారికేమొచ్చింది రోగం...? ఎంతో నాగరీకులు, ప్రపంచాన్ని తామే నడిపిస్తున్నామనే అహంకారమా...? తాము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని పొగరా...??? 

నేరస్తుల అప్పగింతలో కూడా ఇదే వివక్షత, మన దేశలో టెర్రరిజానికి కారణమైన వ్యక్తిని, స్పెయిన్ వారిని అప్పగించమంటే, వారు ఎన్నో నియమనిబంధనలు పెట్టి, చివరకి నిరాకరించారు. ఇలాగే ఇంగ్లీషువారు కూడా తక్కువేమీ తినలేదు, ఒకప్పుడు లండన్ అంటే టెర్రరిస్టులకి ఆశ్రయంగా ఉండేది....[ఇప్పటికి అంతే] ఎవరైనా అడిగితే  "వారు మా దేశంలో ఏ నేరం చెయ్యలేదుగా"  అనే అతితెలివి సమాధానం ఒకటి చెపుతారు.....  ఇలాగే బిన్‌లాడెన్‌ని వెనకేసుకొచ్చిన అమెరికా, తమకే ఎదురు తిరిగేటప్పటికి, ఆప్పటిదాకా వారిచే "దేశభక్తుడు"గా  చెప్పబడిన అతనిని వేరే దేశంలో హతమార్చేశారు........!!!    ఆ దేశం వారి అనుమతి, చట్టాల అవసరం కూడా లేకుండానే........ !!!   అదీ తమ దేశ అధ్యక్షుడి సాక్షిగా.... 

ఇండియన్స్ అయినా .........  రెడ్ ఇండియన్స్ అయినా 

ప్రపంచ యుద్ధాలుగా చెప్పబడుతున్న "యురప్పు యుద్దాలలో" నాజీల వలన జరిగిన నేరాలని ఇప్పటిదాకా విచారిస్తునే ఉన్నారు. అప్పటి వారిలో ఓ వ్యక్తిని, మొన్నీమధ్య  96 ఏళ్ళ వయసులో చిక్కే వరకూ వెతుకుతూనే ఉన్నారు. అతను దక్షిణ అమెరికాలో దొరకంగానే విచారణ చేసి, ఆ వ్యక్తి వయసుని దృష్టిలో పెట్టుకొని వదిలి వేశారు.  ఇదే విధంగా యూరప్పు వారు ఆఫ్రికా లోని నీగ్రోలుపై చేసిన మారణ కాండపై కానీ, భారత్‌లో చేసిన దౌర్జన్యాలపై కానీ, నిజమైన అమెరికా పౌరులైన రెడ్ ఇండియన్స్ ఊచకోతపై కానీ విచారణ చేస్తారా..... వారి దృష్టిలో అవేమీ నేరాలు కావు....  యూరప్పు వారు ఏది నేరమని చెపితే అదే నేరం....!!!!  

ఇది వారి దృష్టిలో వ్యాపారం మాత్రమే...  నేరం కాదు .... 

ఇలా ఒకటేమిటి, యూరప్పు వారి పోగరు నీతి వలన ప్రపంచ దేశాలు ఎన్నో బాధలు పడ్డాయి, పడుతున్నాయి. మానవ టెర్రరిజాన్ని ప్రొత్సాహించటమే కాకుండా, "ఆర్ధిక టెర్రరిజాన్ని" స్విట్జర్లాండుచే చేయించి అనేక బడుగు దేశాల కడుపు మంటని స్విస్స్ బాంకుల లాకర్లలో భద్రపరచి... దానికి యూరప్పు వారే అండదండలుగా ఉంటున్నరు. ఈ విధమైన యూరప్పు పద్ధతుల వలన ప్రపంచం అశాంతికి గురవుతుంది. ఇకనైనా యూరప్పు వారు తాము కూడా మిగిలిన ప్రపంచ దేశ ప్రజల లాంటివారమనే బుద్ధి కలిగితే మంచిది. లేకపోతే ఏదో రోజున వారి ఆకాశ సౌధాల ఆర్ధిక, సామాజిక వ్యవస్థపై  వారు పెంచి పోషించే పొగరు అహంకార న్యాయం...   విషమై  చిమ్ముతుంది.  ఏదైనా తమదాకా వస్తే కానీ తెలియదు కదా.... అనేది పాత సామెత....  ఏ నొప్పైనా యురప్పు వారికి తగిలితే కానీ నొప్పి కాదుగా...   

ఇక ఇటలీ [లింకు నొక్కండి] వారి విషయానికొస్తే,  భారత్ ఈ విషయాన్ని సీరియస్సుగా తీసుకొని,  ఇటలీ దేశంపట్ల కఠినంగా వ్యవహరించి .... ఇంటర్నేషనల్ చట్టాలు కేవలం తమ దేశం వారికి మాత్రమే కాదని,  ఎవరైనా లొంగి ఉండాలని  నిరూపిస్తూ,  తగిన చర్యలు తీసుకొని,  యురప్పు దేశాల వారికి  కనువిప్పు చెయ్యాలి.    అది కుదిరే పని కానప్పుడు, మన దేశం కూడా అతి న్యాయానికి పోకుండా, యూరప్ వారిలాగానే ప్రవర్తించాలి. విదేశాలలో అతి చిన్న నేరాలకి కూడా  బలవుతున్న మన వారిని రక్షించుకోవాలి.  ప్రపంచంలో అతి శక్తివంతమైన దేశాలలో ఒకటని  గొప్పలు చెప్పుకుంటే కాదు... దానికి తగ్గట్లు ప్రవర్తించాలి ....  

ఈ కార్టూన్ని ఈ మధ్యనే[05-07-2013] చూడటం జరిగింది. ఇది ఇక్కడుంటే బాగుంటుంది అని అనిపించింది  ..... కర్టేసి కార్టూనిస్టు ఉన్ని కృష్ణన్ గారు. 

{}!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{}
{}!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{}
{}!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{ }!{}ఇందులోని బొమ్మలన్నీ గూగుల్ లోనివే 
      

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి